మాతా శిశు హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ !


పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రంను మంగళవారం  మంత్రులు హరీష్ రావ్, కొప్పుల ఈశ్వర్  ప్రారంభించారు. అనంతరం ఎర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆచార్య  కొత్తపల్లి జయశంకర్ , వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి, ఘన నివాళులు  అర్పించారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్  పుట్ట మధుకర్, పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, పెద్దపెల్లి ఎమ్మెల్యే  దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే  కోరుకంటి చందర్, భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్, గ్రంధాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, తదితర నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

జయశంకర్ సార్ ఆశయాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు.
జెడ్పి చైర్ పర్సన్ దావా  వసంత !

తెలంగాణ వచ్చాక ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని జయశంకర్ సార్ ఆశించారో నేడు సీఎం కేసీఆర్ గారి సమర్ధ నాయకత్వంలో అవే పథకాలు అమలు అవుతున్నాయి.. అని జగిత్యాల్ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్  జయశంకర్  11 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన  జడ్పీ చైర్పర్సన్  దావ వసంత .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ యాదిలో ఆయన ఆశయాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారు. అని అన్నారు.  తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో కరెంట్ కోసం మనం చాలా గోస పడ్డాము. రైతులు ఆందోళన చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ తెలంగాణ వచ్చాక మొదటి సంవత్సరంలోనే కోతలు లేని కరెంట్ ఇచ్చాము. ఆ తరవాత ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుందర వరదరాజన్ మరియు జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.


  మహిళా డిగ్రీ కళాశాల  అంతర్జాతీయ యోగా దినోత్సవం !
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని  జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో  అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. యోగాసనాల, అభ్యసనం, మరియు  ఆన్లైన్ క్విజ్  ద్వారా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలవేడుకలు నిర్వహించారు., యోగ గురువు  బిక్షమయ్య గురూజీ ,శిష్యులు రఘు గురూజీ  ఆన్లైన్లో సెమినార్లు నిర్వహించారు. ఇందులో ఆధునిక జీవిత విధానంలో యోగా ప్రాముఖ్యతను, నొక్కి వక్కాణించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ  యోగ వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాల్  డాక్టర్ మైసూరు సుల్తానా,  ఐక్యూ ఏసీ కో-ఆర్డినేటర్  డాక్టర్ హరి జ్యోతి కార్,  అకాడమీ కోఆర్డినేటర్ శంకరయ్య,  ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, ఎం శ్రీనివాస్ స్వరూపరాణి,  ఏ రజిని,  జోత్స్నా జమున,  మానస, జి చంద్రయ్య, యాస్మిన్ సుల్తానా, సునీత, సత్యం నవీన్, రశ్మిత, వీణ, సత్యం నవీన్ రశ్మిత వీణ తదితరులు పాల్గొన్నారు.


ఘనంగా 8వ అంతర్జాతీయ యోగ దినోత్సవము:
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రోజు స్వామి వివేకానంద మినీ స్టేడియం జగిత్యాలలో ఆయుష్, జిల్లా యువజన ,మరియు క్రీడల శాఖ ,సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీమతి డాక్టర్ కృష్ణవేణి, నోడల్ ఆఫీసర్ ఆయుష్ అధ్యక్షతన నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమములో జగిత్యాల పట్టణములోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థినిలు యోగ గురువుల సమక్షంలో యోగాసనాలు వేయడము జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టి.వినోద్ కుమార్ , జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. పుప్పాల శ్రీధర్ , జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి డా. బోనగిరి నరేష్, వాకర్స్ అసోసియేషన్ సెక్రెటరీ టీవీ సూర్యం  యోగ గురువులు, ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ సీనియర్ సహాయకులు లోకే రమేష్ కుమార్  మరియు పి.డిలు, పీఈటీలు పాల్గొన్నారు.


స్వరూప్ రావు ను అభినందించిన  కలెక్టర్ రవి!
యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో జగిత్యాల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బోయినపల్లి ప్రసాదరావు – మనోజ దంపతుల కుమారుడు స్వరూప్ రావు పరీక్షలలో విజయం సాధించిన 8 వేల మంది కి ఇంటర్వ్యూ నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరచి 213వ ర్యాంకు సాధించాడు., ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో స్వరూప్ రావు ను కలెక్టర్ రవి అభినందించారు.,
ఈ కార్యక్రమంలో స్వరూప్ రావు కుటుంబ సభ్యులు, తెరాస పట్టణ కార్యదర్శి బోయినపల్లి ప్రశాంత రావు లు వున్నారు.


జిల్లా కోర్టులో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవం-ధ్యాన శిక్షణ కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కోర్ట్ భవనంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా తో పాటుగా, ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహించారు.  శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ నిర్వహణలో జరిగిన  ఈ కార్యక్రమంలో ధ్యాన శిక్షకులు మంచాల కృష్ణ, యోగా శిక్షకులు విజయకృష్ణలు  న్యాయమూర్తులకు, న్యాయవాదులకు  యోగా, ధ్యాన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.,
ఈ కార్యక్రమంలో ఒక్వ అదనపు న్యాయమూర్తి జితేందర్, రెండవ అదనపు న్యాయముర్తి వినిల్ కుమార్, ప్రిన్సిపల్ జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ .నిహారిక లతో  పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం ప్రభాకర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

రాయపట్నం లో డ్రైనేజీ పనులు !
మంత్రి  కొప్పుల ఈశ్వర్   సోమవారం రాయపట్నం పర్యటనలో భాగంగా వెళ్లగా అక్కడ sc కాలనిలో డ్రైనేజి ప్రాబ్లమ్ ఉంది అని . మంత్రికి వివరించారు.. మంత్రి ఆదేశాల మేరకు అక్కడి డ్రైనేజీ క్లిన్ చేయించి మరియు నూతన డ్రైనేజీ కొరకు ఈ రోజే పనులు మొదలు పెట్టడం జరిగింది . అని ధర్మపురి మండల పరిషత్ అధ్యక్షులు చిట్టిబాబు వివరించారు.ఈ కార్యక్రమంలో  జడ్పీటిసి అరుణ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ ఎంపీడీఓ  ప్రవీణ్  గ్రామ కార్యదర్శి, వార్డ్ సభ్యులు,  తదితరులు పాల్గొన్నారు