జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గంలో శనివారం సుడిగాలి పర్యటన జరిపారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ , సమీక్ష సమావేశాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు
రాయికల్ మండల అయోధ్య లో ₹40లక్షలతో, కుమ్మరి పల్లి ₹17.52 లక్షలతో, భూపతి పూర్ ₹ 31.74 లక్షలతో,కొత్త పెట్ ₹15.25 లక్షలతో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాటశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. పిదప చింతలూరు గ్రామంలో ₹6.5 లక్షలతో D53, 7L1R ,8R సబ్ మైనర్ రేపైర్స్ కి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జాదవ్ అశ్విని, AMC ఛైర్మెన్ రాజిరెడ్డి, పాక్స్ ఛైర్మెన్ లు రాజ లింగం, ముత్యం రెడ్డి, ,వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, రైతు బందు మండల కన్వీనర్ మోహన్ రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, మండల కో ఆప్షన్ ముఖేధ్, AMC వైస్ చైర్మన్ వేణు, ఎంపీటీసీ ల ఫోరం నాగరాజు, సర్పంచుల ఫోరం శ్రీనివాస్,సర్పంచులు జీవన్ రెడ్డి,స్వప్న వెంకటేశ్వర్ రెడ్డి,చంద్ర శేకర్,పాలకుర్తి రవి,,రాజేశం,ఎంపీటీసీ లు భారతి,పి స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ!
రాయికల్ మండలానికి చెందిన 14 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 14లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ అందించారు..అనంతరం మహితపూర్ గ్రామానికి చెందిన మహేష్ గేదె ఇటీవల ప్రమాద వశాత్తూ మరణించగా వారికి ప్రభుత్వం ద్వారా మంజూరైన ₹ 30 వేల రూపాయల విలువగల చెక్కును కుమ్మరి పెళ్లి లో ఎమ్మెల్యే అందజేశారు.

సీఎం సహాయనిధి, చెక్కులు దళిత బంధు ప్రాజెక్ట్ ల ప్రారంభం!
కుమ్మరి పల్లి గ్రామానికి చెందిన పి అంజన్న కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹48వేల రూపాయల విలువగల చెక్కును లబ్దిదారుకు ఎమ్మేల్యే అందించారు.
రాయికల్ పట్టణంలో 4వ వార్డ్ లో దులురి ప్రసాద్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన సెంట్రింగ్ యూనిట్ ను ప్రారంబించి, రాయికల్ మండల ఒడ్డె లింగా పూర్ గ్రామంలో ఈదుల లక్ష్మణ్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ప్రదాత జనరల్ స్టోర్స్ మరియు ల్యాబ్ ను ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ప్రారంభించారు.
:రాయికల్ మండల అయోధ్య గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దుగ్గిళ్ల ఎర్రయ్యా ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించగా వారికి పశు సంవర్డక శాక ద్వారా మంజూరైన లక్ష రూపాయల విలువగల చెక్కును వారి కోడలు కావ్య కు అందజేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సురేందర్,నాయకులు ప్రేమానందం,రాజేందర్ తదితరులు ఉన్నారు.

నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలి.!
హైదరాబాద్ లో జూలై 3 న జరిగే భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నీ విజయవంతం చేయాలని స్థానిక కర్నె అక్కపెళ్లి కల్యాణ మండపం శనివారం బిజేపి కార్యకర్తల సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కన్నం అంజన్న పాల్గొని మాట్లాడుతూ శక్తి కేంద్రాలు, ,బూత్ కమిటీలకు జన సమీకరణ భాద్యతలు అప్పగించి దేశంలో ఎక్కడ జరగని విధంగా 10 లక్షల మందితో జరిగే సభ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంగేపు గంగారాం, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, తుమ్మెనాల ఎంపీటీసీ అకుబత్తిని తిరుపతి, ఉప సర్పంచ్ అప్పాల మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి కోరుట్ల మల్లికార్జున్, సీనియర్ నాయకులు నలమాసు వైకుంఠం, గాజుల రామదాసు, జిల్లా sc మోర్చ కోశాధికారి వెలుగు గంగాధర్, కడారి గంగాధర్, నార్ల విజయ్, కోల రామన్న, మైధం మల్లేశం, రాయిల్ల రవి కుమార్, శ్రీనివాస్, మహేష్, శంకర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు

ధర్మపురి మండల కేంద్రం లో LM కొప్పుల షోషల్ సర్వీస్ అర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్స్, పోలీసు ఉచిత శిక్షణ కేంద్రలను , నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ధర్మపురి CI బిల్లా కోటేశ్వర్ SI కిరణ్ కుమార్ అన్నారు. శనివారం తన కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులు కోచింగ్ సెంటర్ల కు, డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉన్న వాటి అన్నిటిని దుష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులకు ఉద్యోగాల్లో ఉండాలి అని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేవారిగా తీర్చిదిద్దే విదంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ చేపట్టిన కార్యక్రమం అందరూ వినియోగించుకోవాలని వారు కోరారు.

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎన్ఆర్ఐ
జగిత్యాల పట్టణంలో శనివారం స్థానిక ఓల్డ్ హై స్కూల్ లో అమెరికాలో స్థిరపడిన జగిత్యాల వాసి జేశెట్టి రాధాకృష్ణ ₹ 30000/- విలువగల 1500 నోట్బుక్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో చదివి అవకాశాలను, సద్వినియోగం చేసుకొని ,జీవితంలో ఉన్నత స్థానంలో ఉండడానికి కష్టపడి చదువుకోవాలని అన్నారు. ప్రధానోపాధ్యాయులు రామానుజం మాట్లాడుతూ విద్య ను, ఎవరు దొంగలించ లేరని పంచేకొద్దీ పెరిగే ధనం విద్య అని అన్నారు. PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి ఆనందరావు మాట్లాడుతూ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను, ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. తపస్ ప్రధాన కార్యదర్శి భోనగిరి దేవయ్య మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావంతో చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాంపట్టి రజనీకాంత్, ఎన్నారై యాంసాని అశోక్ ,ఉపాధ్యాయులు రజిత, విద్యా దేవి, శ్రీనివాస్ , మల్లికార్జున్, పద్మ , సురేందర్, హరిత, అరుణ ,అనిత తదితరులు పాల్గొన్నారు.

ఇరిగేషన్ అధికారులతో ఎమ్మేల్యే రివ్యూ !
జగిత్యాల నియోజకవర్గ చివరి ఆయకట్టు ప్రాంతాలు కట్కాపుర్, ధావన్ పల్లి, చింతలురు, మంగేల, కమ్మునూరు, గుట్రజ్ పల్లి, బట్టపల్లి,పొతారం గ్రామాలకు నీరు అందించడం లక్ష్యం గా, చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు, రోల్ల వాగు ప్రాజెక్ట్ పూర్తి చేయటం గురించి, రాయికల్ పెద్ద చెరువు, మినీ ట్యాంక్ బండ్, అభివృద్ధి పనులు, రాయికల్ మాదిగా కుంట మిషన్ కాకతీయ తో ఇష్టారీతిన మట్టి తీయడం వల్ల మురుగు ఏర్పడ్డది అని, నీరు నిలువకుండ కొంత అభివృద్ది చేయాలని ,వరద కాలువ నుండి అంతర్గం కు వేసిన పైప్ లైన్ పనుల పూర్తి గురించి మరియు రాం పూర్ పంప్ హౌజ్ దగ్గర 0.5 టిఎంసి నీళ్లు వదిలి గేట్లు ఎత్తడం వల్ల అంతర్గం చెరువు నీళ్లు నింపడం అవకాశం ఉంటుందని, కొత్త చెక్ డ్యాం , కొత్త పెట్, ఇటిక్యాల దగ్గర ప్రపోజల్స్ తయారీ పై తదితర అంశాలపై SRSP CE సుధాకర్ రెడ్డి మరియు EE,DE లతో జిల్లా కేంద్రంలో అర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమావేశంలో సమీక్షించారు.

28న బుగ్గారం లో 15 పిర్యాదులపై విచారణ!
పోలీస్ బందోబస్తు కోరిన పిర్యాదుదారుడు!
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై ఈ నెల 28 మంగళవారం ఉదయం 11-00గంటలకు విచారణ చేపట్టనున్నట్లు జగిత్యాల డివిజనల్ పంచాయతీ అధికారిణి కనకదుర్గ నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణ సమయంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి శనివారం బుగ్గారం ఎస్సై తీగల అశోక్ ను కోరారు.