నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్లైన్తో పాలన- మంత్రి కేటీఆర్!

జగిత్యాల జూన్ 10:- జీవితంలో మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలని, ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి పై యువత ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఐటి పరిశ్రమలు మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మెట్ పల్లి పట్టణంలో యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర రోడ్డు బోనాల శాఖ మంత్రి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని వెంకట్ రెడ్డి గార్డెన్స్ లో విద్యార్థులతో మంత్రి సమావేశమయ్యారు. స్టడీ మెటీరియల్ అందచేశారు.


మెట్ పల్లి మండలంలోని గ్రామాల్లో యువతకు ,రైతులకు ఉపయోగపడే విధంగా దాత్రి బయో సంస్థ రూ.160 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉపాధి, భువి బయో సంస్థ రూ.1060 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని మంత్రి అన్నారు.
వివి5 అనే ఐటి సంస్థ కోరుట్ల ప్రాంతంలో 200 మందికి ఉపాధి కల్పిస్తూ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు.
పరిశ్రమల స్థాపనకు దేశాలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, పంజాబ్ చత్తీస్గడ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వం అందించిన విశ్వాసంతో కోరుట్ల ప్రాంతాన్ని పెట్టుబడులకు ఎంచుకున్నందుకు కంపెనీల ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. .


నీళ్లు , నిధులు, నియామకాల ప్రాతిపదికన

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచిందని, నీళ్లు రంగంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఏ రికార్డు సమయంలో పూర్తిచేశామని మంత్రి అన్నారు. 82 మీటర్ల ఎత్తునుంచి 600 మీటర్ల ఎత్తయిన ప్రాంతానికి 165 టీఎంసీల నీటి లిఫ్ట్ చేసి పంటకు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
15 ఆగస్టు 2022 నాటికి రాష్ట్రంలో కోటి ఇండ్లకు మిషన్ భగీరథ కింద త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేశామని మంత్రి అన్నారు. కోరుట్ల ప్రాంతంలో వరద కాలువ సంవత్సరంలో 300 రోజులకు పైగా నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్ధర్ కాటన్ ను ప్రతి సంవత్సరం స్మరిస్తామని, ఒక రోజు దేశం మొత్తం సీఎం కేసీఆర్ నీటి రంగంలో చేసిన కృషి ప్రశంసిస్తూందని మంత్రి అన్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం

29 లక్షల మందికి 200 పెన్షన్ అందించే వారిని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి 2016/- పెన్షన్ అందిస్తున్నామని, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఆడపిల్ల పెళ్ళి రూ.1,00,116/-, రూ.7300/- కోట్లతో మన ఊరు మన బడి, రూ.18000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య అభ్యసించే వారికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటిఆర్ అన్నారు.
భౌగోళికంగా 11వ స్థానం, జనాభా ప్రకారం 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆర్థికంగా దేశంలో 4వ స్థానంలో నిలిచిందని ఆర్బీఐ ప్రకటించిందని మంత్రి పేర్కొన్నారు.


సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత కు నిదర్శనం

గా ఐటి ఎగుమతులు 57000 కోట్ల నుంచి 1.83 లక్షల కోట్లు, దాదాపు 300% పెరిగాయని, టీఎస్ ఐపాస్ కింద దాదాపు 2.32 లక్షల కోట్ల పెట్టుబడితో 19000 పరిశ్రమల ఏర్పాటు అవుతున్నాయని, వీటి ద్వారా 16 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
నూతన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం 1.31 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించిందని, మరో 90 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ల ను ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఖాళీలు స్థానిక యువతకు దక్కే విధంగా సీఎం కేసీఆర్ 95% రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన జోనల్ విధానం ఆమోదింపజేసారని మంత్రి అన్నారు.

జగిత్యాల జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ

అందించేందుకు చర్యలు చేసుకుంటున్నామని, 350 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని, వీరికి 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందజేస్తామని అన్నారు.
విద్యార్థులు 3 నెలల పాటు సెల్ ఫోన్లు పక్కనపెట్టి పూర్తి ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు. పెద్దపల్లి జిల్లా కు చెందిన యువకునికి 8 రకాల ఉద్యోగాలు వచ్చాయని , ఎంపిక చేసుకునే ఛాయిస్ అతని వద్ద ఉందని, అలా తయారు కావాలని మంత్రి అన్నారు.


యువత విజయం తో పాటు పరాజయాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసం పెంచుకోవాలని, వినూత్న ఆలోచనలు కలిగిన యువ ఔత్సాహితీవేత్తలను ప్రోత్సహించేందుకు టీ హబ్, వీ- హబ్ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.
మన ప్రాంతంలో చాలామంది అరబ్ దేశాలలో పని చేస్తున్నారని, వారికి అవసరమైన పని తెలంగాణ ప్రాంతంలో అందుబాటులో ఉందని మంత్రి అన్నారు. అబద్ధం గారు చేసే పని చిన్నది కాదని మంత్రి అన్నారు.


యువత స్కిల్,

అప్ స్కిల్, రి స్కిల్ సూత్రాన్ని పాటించి తమ కెరీర్లో విజయం సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో మనకు ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న సమయంలో మన ప్రాంతానికి పెద్ద పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాను మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మంత్రి కేటీఆర్ చొరవతోనే పరిశ్రమ స్థాపన
మెట్ పల్లి మండలంలో
రూ.1040 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న ఇత్తనాల్ తయారీ పెట్టుబడి రావడానికి ముఖ్య కారణం మంత్రి కేటీఆర్ చొరవ మాత్రమేనని భూమి బయోకెమికల్ ప్రతినిధి డాక్టర్ నాగ వర్ధన్ పేర్కొన్నారు. తమ పరిశ్రమ ద్వారా యువతతో పాటు 2 లక్షల ఎకరాల వరి సాగుచేసే రైతులకు సైతం లాభం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో సంపూర్ణ సహకారం అందజేసిన మంత్రి కేటీఆర్, స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం భూవి బయో కెమికల్స్, దాత్రి బయో కెమికల్స్, వివి5 ఐటీ సంస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావా వసంత , జిల్లా కలెక్టర్ జి.రవి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, జగిత్యాల ఎస్ పి సింధు శర్మ, ఆర్డిఓ వినోద్ కుమార్, మున్సిపల్ ఛైర్పెర్సన్లు , సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
నియోజకవర్గం మెట్పల్లి లో విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి, అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
మెట్ పల్లి మండలంలోని గ్రామాల్లో యువతకు ,రైతులకు ఉపయోగపడే విధంగా దాత్రి బయో సంస్థ రూ.160 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉపాధి, భువి బయో సంస్థ రూ.1060 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని మంత్రి అన్నారు.
విఫై అనే ఐటి సంస్థ కోరుట్ల ప్రాంతంలో 200 మందికి ఉపాధి కల్పిస్తూ కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు.
పరిశ్రమల స్థాపనకు దేశాలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని, పంజాబ్ చత్తీస్గడ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వం అందించిన విశ్వాసంతో కోరుట్ల ప్రాంతాన్ని పెట్టుబడులకు ఎంచుకున్నందుకు కంపెనీల ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
నీళ్లు , నిధులు, నియామకాల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిచిందని, నీళ్లు రంగంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఏ రికార్డు సమయంలో పూర్తిచేశామని మంత్రి అన్నారు. 82 మీటర్ల ఎత్తునుంచి 600 మీటర్ల ఎత్తయిన ప్రాంతానికి 165 టీఎంసీల నీటి లిఫ్ట్ చేసి పంటకు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
15 ఆగస్టు 2022 నాటికి రాష్ట్రంలో కోటి ఇండ్లకు మిషన్ భగీరథ కింద త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేశామని మంత్రి అన్నారు. కోరుట్ల ప్రాంతంలో వరద కాలువ సంవత్సరంలో 300 రోజులకు పైగా నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించిన బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్ధర్ కాటన్ ను ప్రతి సంవత్సరం స్మరిస్తామని, ఒక రోజు దేశం మొత్తం సీఎం కేసీఆర్ నీటి రంగంలో చేసిన కృషి ప్రశంసిస్తూందని మంత్రి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 29 లక్షల మందికి 200 పెన్షన్ అందించే వారిని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి 2016/- పెన్షన్ అందిస్తున్నామని, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఆడపిల్ల పెళ్ళి రూ.1,00,116/-, రూ.7300/- కోట్లతో మన ఊరు మన బడి, రూ.18000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య అభ్యసించే వారికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటిఆర్ అన్నారు.
భౌగోళికంగా 11వ స్థానం, జనాభా ప్రకారం 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, ఆర్థికంగా దేశంలో 4వ స్థానంలో నిలిచిందని ఆర్బీఐ ప్రకటించిందని మంత్రి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత కు నిదర్శనంగా ఐటి ఎగుమతులు 57000 కోట్ల నుంచి 1.83 లక్షల కోట్లు, దాదాపు 300% పెరిగాయని, టీఎస్ ఐపాస్ కింద దాదాపు 2.32 లక్షల కోట్ల పెట్టుబడితో 19000 పరిశ్రమల ఏర్పాటు అవుతున్నాయని, వీటి ద్వారా 16 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
నూతన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం 1.31 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించిందని, మరో 90 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ల ను ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఖాళీలు స్థానిక యువతకు దక్కే విధంగా సీఎం కేసీఆర్ 95% రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన జోనల్ విధానం ఆమోదింపజేసారని మంత్రి అన్నారు. జగిత్యాల జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు చర్యలు చేసుకుంటున్నామని, 350 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని, వీరికి 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందజేస్తామని అన్నారు.
విద్యార్థులు 3 నెలల పాటు సెల్ ఫోన్లు పక్కనపెట్టి పూర్తి ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు. పెద్దపల్లి జిల్లా కు చెందిన యువకునికి 8 రకాల ఉద్యోగాలు వచ్చాయని , ఎంపిక చేసుకునే ఛాయిస్ అతని వద్ద ఉందని, అలా తయారు కావాలని మంత్రి అన్నారు.
యువత విజయం తో పాటు పరాజయాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కొనే విశ్వాసం పెంచుకోవాలని, వినూత్న ఆలోచనలు కలిగిన యువ ఔత్సాహితీవేత్తలను ప్రోత్సహించేందుకు టీ హబ్, వీ- హబ్ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.
మన ప్రాంతంలో చాలామంది అరబ్ దేశాలలో పని చేస్తున్నారని, వారికి అవసరమైన పని తెలంగాణ ప్రాంతంలో అందుబాటులో ఉందని మంత్రి అన్నారు. అబద్ధం గారు చేసే పని చిన్నది కాదని మంత్రి అన్నారు.
యువత స్కిల్, అప్ స్కిల్, రి స్కిల్ సూత్రాన్ని పాటించి తమ కెరీర్లో విజయం సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో మనకు ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు