పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలి- ఎమ్మెల్యే -కలెక్టర్


జగిత్యాల, జూన్ 3:- పట్టణ ప్రగతి స్ఫూర్తి నిరంతరం మున్సిపాలిటీలలో కొనసాగించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం బి.డి.కాలనీ, 5,6 వార్డులలో స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తో కలిసి తో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
పట్టణాలలో పారిశుద్ధ్యం పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం  పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలు అందించాయని, ఈ స్పూర్తి నిరంతరం కొనసాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.


పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి మున్సిపాలిటీ లోని ప్రతి వార్డు లో పారిశుద్ధ్య నిర్వహణ, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్, విద్యుత్ వంటి అంశాలలోనూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలలో మురుగు కాలువలో చెత్త  పూర్తిగా తొలగించే కార్యక్రమం నెల రోజులుగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు.  మురుగు కాలువల్లో  ప్లాస్టిక్ బాటిల్ లు, చెత్త, ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల నీటి ప్రవాహం స్తంభించిపోయి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ అన్నారు.
వర్షాకాలంలో  నీరు స్తంభించడం వల్ల దోమలు అధికమై అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని కలెక్టర్ అన్నారు. పట్టణంలోని ప్రజలు చెత్తను తడి చెత్త,  పొడి చెత్త గా విభజించే ప్రతిరోజు వచ్చే వాహనాలకు మాత్రమే అందించాలని కలెక్టర్ కోరారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం మెరుగు పరిచేందుకు అవసరమైన వాహనాలు, సామాగ్రిని సమకూర్చుకోవడం జరిగిందని, ప్రజల సహకారంతో సంపూర్ణంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు.
మున్సిపాలిటీలలో నిర్మిస్తున్న సమీకృత వేజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు, వైకుంఠధామం నిర్మాణ పనులు వేగవంతం చేసే త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.  మెట్పల్లి మున్సిపాలిటీ లో విద్యుత్ సమస్య పరిష్కారానికి నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి అనువైన స్థలం సేకరించాలని, ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు పంపి వెంటనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
జూన్ 3 నుంచి జూన్ 18 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తి నిరంతరం ప్రజల్లో కొనసాగే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.


కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ
పరిసరాల పరిశుభ్రత నిరంతర ప్రక్రియగా కొనసాగాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం ప్రజలు నిలిపివేయాలని, స్వియ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఇంటికి మున్సిపాలిటీ తడి చెత్త పొడి చెత్త బుట్టలు పంపిణీ చేసిందని, వాటిని వినియోగించుకొని మున్సిపల్ చెత్త సేకరణ వాహనాలకు ప్రతిరోజు అందించాలని ఎమ్మెల్యే తెలిపారు.
జిల్లా ఇంఛార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  వినోద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ సుజాతమ్మ , అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

టిఎన్జీఓ మాజీ నాయకుడు స్వామినాథన్ కు ఘన నివాళి


గతంలో టిఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గా పని చేసిన కామ్రేడ్ స్వామినాథన్ ,అనారోగ్యం తో శుక్రవారం ఉదయం అకాల మరణం చెందిన సందర్భంగా, జగిత్యాల జిల్లా టిఎన్జీఓల సంఘ భవనం లో జిల్లా అద్యక్షులు భోగ శశిధర్, రెవెన్యూ సంఘం జిల్లా అధ్యక్షులు యం.డి.వకీల్, టిఎన్జీఓ జిల్లా కార్యదర్శి నాగేందర్ రెడ్డి, పెనషనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, మరియు నాయకులు పూల మాలల తో, కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు. శశిధర్ మరియు వకీల్  మాట్లాడుతూ స్వామినాథన్  ఉద్యోగుల ఎన్నో సమస్యలు పరిష్కరించేందుకు, ప్రయోజనాలు  కల్పించేందుకు ఎంతో కృషి చేశారని, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలుపుతూ  వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, టిఎన్జీఓల సంఘం జిల్లా కార్యదర్శి నాగేందర్ రెడ్డి, మామిడి రమేష్, సాహెద్ బాబు, రాజేందర్, మధుకర్, విజయ్ కుమార్, విశ్వనాథం, రఘుపతి, హనుమంతరెడ్డి, అశోక్ కుమార్, సంతోష్, చంద్రిక,  శైలజ, శ్రావణి, పాల్గొన్నారు.


శిక్షణ శిబిరం ప్రారంభం !


జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ మరియు ఉపాధి కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు,మున్సిపల్ చైర్మన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్ర శేకర్ రావు, జిల్లా జడ్పీ సీఈవో మరియు మైనారిటీ అధికారి సుందర వరధారజన్ తదితరులు.


పట్టణ ప్రగతి!


ధర్మపురి మున్సిపల్ లో పట్టణ ప్రగతి నాలుగో విడత కార్యక్రమం లో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో గౌరవ చైర్ పర్సన్ గారు మరియు డిసిఎంఎస్ చైర్మన్ గారు జెడ్పిటిసి గారు ఎంపిటిసి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరియు గౌరవ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది


పల్లె ప్రగతి


బీర్పూర్ మండలంలోని రేకులపల్లె గ్రామం లో  ఈ రోజు  సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్  మరియు గ్రామ ప్రత్యేకాధికారి వాసం బీమయ్యా(MEO) గార్ల ఆధ్వర్యంలో  5వ విడత పల్లె ప్రగతి లో భాగంగా గ్రామంలో గ్రామ సభ సమావేశం నిర్వహించారు ఉప సర్పంచ్ కాసారపు రమేష్ వార్డు సభ్యులు  పంచాయతీ కార్యదర్శి ఆరే రాణి కారోబర్ మ్యాడ గంగరెడ్డి పాఠశాల ఉపాద్యాయులు రాజేష్ శ్రావణ్  అంగన్వాడీ టీచర్లు సుమలత రేవతి గ్రామ పంచాయతీ సిబ్బంది గంగయ్య నర్సయ్య జాడి మల్లేష్ గ్రామ ప్రజలు ఎలగందుల అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


ప్రముఖ న్యాయవాది కి సన్మానం!


జగిత్యాల పట్టణ ప్రముఖ న్యాయవాది మాకు నూరి హనుమంతరావు గారు,గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయస్థాన అవరణ లో 62 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న సందర్భంగా జగిత్యాల బార్ అసోసియేషన్ తరపున బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముద్దం ప్రభాకర్, న్యాయమూర్తులు మరియు న్యాయవాదులు  మాకునురి హనుమంత రావు  ఘనంగా సన్మానించారు.


ప్రారంభోత్సవం!.


జగిత్యాల రూరల్ మండల మోర పల్లి గ్రామంలో 4.22 లక్షలతో నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణం ను  శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ప్రారంభించారు. మరియు గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 7 లక్షల నిధులతో పాటశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన  ఎమ్మెల్యే.అనంతరం గ్రామానికి చెందిన ఏ.లింగయ్య, ఏ.బుచ్చమ్మ ఇల్లు ఇటీవల వర్షాలకు పాక్షికంగా నష్టానికి గురి కాగా ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఒక్కొక్కరికి 5200 చొప్పున  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్  అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, Pacs ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, సర్పంచ్  బోల్లే సత్తమ్మా గంగారాం, ,ఎంపీటీసీ భూమా రెడ్డి, ఉప సర్పంచ్  లింగా రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు మధు,గ్రామ శాక రాజీ రెడ్డి,ఎస్సీ కార్పొరేషన్ ED లక్ష్మి నారాయణ,ఎంపిడిఓ రాజేశ్వరి,DE మిలింద్, MEO గాయత్రి ,MPO రవి బాబు,SMC ఛైర్మెన్ గంగారాం,నాయకులు కమలాకర్ రావు,వెంకటేష్,బీమారావు,బొనాగిరినారాయణ,రాజన్న,గంగాధర్, వేణు గోపాల్,తిరుపతి రెడ్డి,అర్ ఐ గంగారాం, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.