ధర్మపురి మండలం పట్టణ కేంద్రంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల పండుగకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి సతీమణీ ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్ కొప్పుల స్నేహలత మంత్రి కుమార్తె నందిని హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.

తల్లిని దర్శనం చేసుకొని తల్లి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులందరికీ మంచి పాడి పంటలు రావాలని వేడుకున్నారు.
వీరి వెంట మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యేరి రాజేష్, తెరాస టౌన్ ప్రెసిడెంట్ ఆకుల రాజేష్, వార్డు కౌన్సులర్లు, శ్యామ్ మరియు నాయకులు తదితరులు ఉన్నారు.

స్తంభం పెళ్లి లో ఘనంగా పోచమ్మ బోనాలు!
వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి గ్రామం లో ఎలనంపుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా మొదటిరోజు గ్రామంలో గల మహిళలందరూ నెత్తిన బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ళ మధ్య ఊర పోచమ్మ, ఆలయం వద్దకు తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చల్లూరరి రూపారాణి, ఎంపీటీసీ పోడేటి సత్తయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లిని ప్రత్యేక పూజలు !

ధర్మపురి పట్టణ కేంద్రంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి బోనాల పండుగ కు హాజరై పెద్దమ్మ తల్లిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం దర్శించుకున్నారు..
పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ధర్మపురి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పడి రైతులందరు మంచి పంటలు పండించి రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు..
