ప్రజావాణి కార్యక్రమాలు రద్దు కలెక్టర్ జి రవి

జగిత్యాల, జూన్ 5 :-. జిల్లా లో పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి.రవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా అధికారులు అందరూ పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వామ్యులు గా ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ముగిసేవరకు నిర్వహించబడదని ఈ నేపథ్యంలో కలెక్టర్ హనుమాజీపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు .


పట్టణ ప్రగతి లో ఎమ్మెల్యే సంజయ్!


జగిత్యాల పట్టణ 40,46,29 వార్డులలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని పట్టణంలో వార్డులను సందర్శించి పారిశుధ్య, వాల్ పోస్టర్ అతికించి, పట్టణ ప్రగతి ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొని, అభివృద్ధి పనులను పరిశీలించి, పారిశుధ్యం పై ప్రజల్లో అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ , ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లు అవారి శివ కేసరి బాబు, ములస్తంలలిత, ,పంబాల రామ్ కుమార్, కమిషనర్ స్వరూప రాణి, ,DE రాజేశ్వర్ , నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


పల్లె ప్రగతి లో..


రాయికల్ మండలం లోని భూపతిపూర్, ఒడ్డె లింగాపూర్ మరియు చింతలూరు గ్రామాలలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాలల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరియు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ . అనంతరం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ చేసి, లబ్ధిదారుల సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 6 లబ్ధిదారులకు రూ.300,000/-విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఒరుగంటి మోహన్ రావు కు రైతు బంధు మండల కన్వీనర్ ప్రొసీడింగ్ కాపీ ను అందజేసి సన్మానించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్, జడ్పిటిసి అశ్విని జాదవ్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, సర్పంచులు చంద్ర శేకర్,పాలకుర్తి రవి,శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, ఉపఅధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎంపిడిఒ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

జగిత్యాల లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్


5 గురిని అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు
15 లక్షల దొంగ నోట్లు స్వాధీనం
3 లక్షల అసలు నగదు స్వాధీనం
జగిత్యాల లో నోట్లు మారుస్తూ వుండగా పట్టుకున్న జగిత్యాల టౌన్ పోలీసులు
వరంగల్ కు చెందిన ఇద్దరు జన్నారం చెందిన ఒకరు, గోదావరి ఖని కి చెందిన ఒకరు అరెస్ట్..


ధర్మపురి లో పట్టణ ప్రగతి !


పట్టణ ప్రగతి లో భాగంగా ధర్మపురి మున్సిపాలిటీ నందు వైకుంఠ దామం, మరియు వెజ్ ,నాన్వెజ్ , మార్కెట్ మరియు ట్రీ పార్క్, మొదలగునవి శుభ్రపరచారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ మరియు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది , పాల్గొన్నారు.

కాగడాల ప్రదర్శన ర్యాలీ విజయవంతం చేద్దాం!


ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళల్లో కొనసాగుతున్నాయని రాష్ట్ర కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్ అన్నారు..
మోడీ ప్రభుత్వం 8 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ధర్మపురి అసెంబ్లీ కేంద్రంలో Srr గార్డెన్ లో. ఆదివారం అం జిల్లా అధ్యక్షులు అలాగుర్తి లక్మి నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడారు.
మోడీ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో ఎన్నో సంస్కరణలతో ‘టీం ఇండియా’ స్ఫూర్తితో సబ్​కా సాత్– సబ్​కా వికాస్– సబ్ కా ప్రయాస్​ నినాదంతో ముందుకు వెళ్తోందన్నారు..
సేవా, సుపరిపాలన, పేదరిక నిర్మూలన లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు..
కరోనా భారత ఆర్థిక వృద్ధిని నిలిపివేసినా…ఉచిత టీకాలు, రేషన్ పంపిణీ ద్వారా మోడీ ప్రభుత్వం 135 కోట్ల భారతీయుల సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రత కోసం పని చేసిందని గుర్తు చేశారు..
కరోనా కష్టకాలంలో 2020 మే12న రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పేరుతో భారీ ప్యాకేజీని ప్రకటించారు అంటూ తదితర అంశాలను ఆయన వివరించారు.
అనేక సంక్షేమ అభివృద్ధి పనుల సాక్షిగా జూన్ 8వ తేదీన సాయంత్రం 7 గంటలకి కరీంనగర్ లో జరుగు కాగడాల ప్రదర్శన ర్యాలీలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి మద్దతు నిలవటంలో మనమంతా భాగస్వాములవుదామని చంద్రశేఖర్ కోరారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్,మండల,పట్టణ అద్యక్షులు సంగెపు గంగరాము, బెజ్జరపు లవన్, నలమసు వైకుంఠం, జిల్లా కోశాధికారి వెలుగు గంగాధర్,కదారి గంగాధర్,అంజన్న తదితరులు పాల్గొన్నారు..

పల్లె ప్రగతి లో క్రీడా ప్రాంగణాలు!


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి లో భాగంగా క్రీడా ప్రాంగాణ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా నేరెళ్ల, నాగారం గ్రామాలను సందర్శించడం జరిగింది నాగారం గ్రామంలో పనుల పర్యేవేక్షణ మరియు నేరెళ్ళ గ్రామంలో క్రీడా స్థలం పరిశీలించనైనది.ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎడ్ల చిట్టిబాబు, వైస్ ఎంపిపి గడ్డం మహిపాల్ రెడ్డి, ,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ,ఎంపివో నరేష్ కుమార్, ఎపివో సుజన్, గ్రామాల సర్పంచ్ లు, ,గ్రామాల స్పెషల్ ఆఫిసర్లు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కు సతీవియోగం


మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కు సతీ వియోగం
మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సతీమణి సుద్దాల లత గారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరబాద్ లో వారి నివాసం లో తుది శ్వాస విడిచారు.
సుద్దాల లత అంత్యక్రియలు స్వగ్రామం రూరల్ మం. అంతర్గాం లో రేపు ఉ. 10 గం. లకు నిర్వహించారు కుటుంబ సభ్యులు తెలిపారు.


సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ అకాల మరణం !

ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ అకాలమరణం చెందారు. ఆదివారం స్వగ్రామం పరకాల ఆయన పెళ్లి క్రికెట్ మ్యాచ్ నీరసపడిపోతారు టీచర్ ఆస్పత్రికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. IJU జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం శేఖర్ వీర హత్ అలీ, జగిత్యాల జిల్లా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, ప్రదీప్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.


డాక్టర్ ప్రసాద్ రావు అకాల మరణం !


ధర్మపురి పట్టణ పరిసర గ్రామాల ప్రజలకు సుపరిచితులు డాక్టర్ బెజ్జంకి శివప్రసాదరావు ఆదివారం తెల్లవారుజామున హైదరాబాదులో అకాల మరణం చెందారు.
ప్రజావైద్యులు ,మృధుస్వభావులు ,నిరాడంబరులు ,నిగర్వులు! అందరికీ స్నేహహస్తం అందించి ,హస్తవాసిగల వైద్యుడని పేరు గడించారు. ఆనాటి “వైద్యత్రయంలో “ఒకరిగా భాసిల్లి ,రోగుల జీవితాలో వెలుగులు నింపిన “వైద్య భాస్కరులు! చిన్నవారి దగ్గర నుండి పెద్దవారి వరకు ఏమోయ్ అని చిరునవ్వుతో పలుకరించి ,ప్రతివారి గుండెల్లో గుడికట్టుకున్నారు!
ఎన్నో దశాబ్దాల పాటు ధర్మపురి చుట్టుప్రక్కల వారి గరీబు డాక్టర్గా ఘనుతికెక్కినారు! ధర్మపురి ప్రభుత్వ దవాఖానకు మెడికల్ ఆఫీసర్ విధులు నిర్వహించే హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్ లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ గా సేవలందించారు. డాక్టర్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


రిసెప్షన్ కు హాజరైన మంత్రి !

జగిత్యాలలో శుభం గార్డెన్ లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత భద్రత అధికారి, ధ్రువ కుమార్ ,సోదరుడి రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను మంత్రి ఆశీర్వదించారు.