ప్రైవేటు బడులను……
సవాల్ చేస్తున్న సర్కార్ బడులు!


J.Surender Kumar,
ప్రభుత్వ పాఠశాలల పనితీరు ప్రజానీకం ప్రశంసలు పొందుతున్నది, గతంలో వాటిపై ఉన్న అరకొర ఆరోపణలు అదృశ్యం అవుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కార్ బడులు సవాలు చేస్తున్నాయి,

ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం తగ్గిపోయి, హంగు, ఆర్భాటాలుండే ప్రైవేట్‌, కార్పోరేట్‌ పాఠశాలల వైపు పరుగులు పెట్టడం నేటి సమాజంలో మనం చూస్తున్న వాస్తవం. అప్పూ సొప్పో చేసి పిల్లల్ని ప్రైవేటుకి పంపినా తల్లిదండ్రుల ఆశలు తీరుతాయన్న నమ్మకం లేదు. ఇటువంటి సమయంలో ప్రజలకు ప్రభుత్వ బడులపై నమ్మకాన్ని కల్గిస్తున్నాయి

దోనూర్ బడి

ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా పెరిగిన విద్యార్థుల నమోదే ప్రత్యక్ష నిదర్శనం. . వివరాల్లోకి వెళితే. మన ఊరు మనబడి కింద జిల్లాలో మొదటి విడతగా 274 పాఠశాల ప్రభుత్వం ఎంపిక చేసి మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయలను కేటాయించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు, ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల నమోదు, తదితర గణాంకాల వివరాలు డీఈవో కార్యాలయంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి.

ధర్మపురి బాలికల పాఠశాలలో.


ధర్మపురి మండలంలో 37 ప్రాథమిక, 15 ఉన్నత పాఠశాలలుండగా, దమ్మనపేట, వాటర్ ట్యాంక్, మగ్గిడి, నక్కలపేట, రాజారం పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ప్రభుత్వ బడులలో వసతులకు, విద్యాబోధన చేసే గురువులకు కొదువ లేదు.

దమ్మన్నపేట పాఠశాల.

ఇప్పుడు కావల్సిందల్లా నమ్మకం. భరోసా. అటువంటి నమ్మకాన్ని కలిగిస్తూ ఇక్కడి ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు పోటీగా ధీటుగా రాణిస్తూ, అడ్మిషన్లలో పోటీ పడుతున్నారు.

అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు!


125కి పైగా అడ్మిషన్
ధర్మపురి పట్టణంలో జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, సుమారు 40 సంవత్సరాల క్రితం, ప్రాథమికోన్నత పాఠశాలగా, మండల కేంద్రంలో ప్రారంభించబడి, అనేక మార్పులకు లోనై ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్‌లతో కో-ఎడ్యుకేషన్‌ పాఠశాలగా కొనసాగుతున్నది. మండల కేంద్రంలో బస్టాండుకు అతి సమీపంలో ఉండటం, అన్ని సామాజిక వర్గాల పేద విద్యార్థులకు, అందుబాటులో హాస్టల్‌ వసతి ఉండటం,, ఈ పాఠశాలకు విద్యార్థులు రావడానికి ఆసక్తి చూపడానికి ఒక కారణమైతే, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, చెరుకు రాజన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం చేపట్టిన బడి బాట కార్యక్రమంలో మారుమూల గ్రామాలకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి విజయవంతం చేయడం మరో కారణం, విద్యాబోధనతో పాటు, సైన్సు ప్రయోగశాల, 3000 పుస్తకాలతో లైబ్రరీ వంటివి విద్యార్థులకు అందుబాటులో ఉండగా, పేద విద్యార్థులకు ప్రభుత్వం నుండి రావలసిన స్కాలర్‌షిప్‌ల విషయంలో ఉపాధ్యాయులు 100 శాతం కృషి చేయడం జరుగుతున్నది. దీనికితోడు
ఉపాధ్యాయులు చొరవ తీసుకుని పాఠశాలకు, కావలసిన వసతులను ఎన్నారైలు, దాతల ద్వారా సమకూరుస్తున్నారు. ‘విద్యార్థి దత్తత” వంటి వినూత్న కార్యక్రమాలతో దాతల ద్వారా, నిరుపేద విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు, అందించడంతో పాఠశాల పట్ల విద్యార్థులు ఆకర్షితులైతున్నారు. క్రమశిక్షణ, పచ్చదనం-పరిశుభ్రత, విషయాలలో వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాఠశాలను సందర్శించిన తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్య సంవత్సరం ప్రారంభం నుండే ఈ పాఠశాలకు తల్లిదండ్రులు క్యూ కట్టడంతో ఇప్పటికే 125 కి పైగా అడ్మిషన్లు రావడం, అందులో సుమారు 30 స్థానిక ప్రైవేట్‌ పాఠశాలల నుండి రావడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య 200 వరకు చేరుకుంటుందని, మన ఊరు మన బడి ద్వారా మరిన్ని సౌకర్యాలు పాఠశాలకు సమకూర్చేలా కృషి చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు రాజన్న తెలిపారు.


మూతబడే పాఠశాలకు మళ్ళీ జీవం
నాలుగు సంవత్సరాల క్రితం దొనూర్‌ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కేవలం 18. అక్కడికి బదిలీపై వెళ్ళిన ధర్మపురికి చెందిన ఉపాధ్యాయుడు కాశెట్టి రమేశ్‌, చొరవతో పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభించి, తల్లిదండ్రులకు నమ్మకాన్ని కల్గించారు. స్థానిక దాతల సౌజన్యంతో పాఠశాలను అందమైన బొమ్మలతో రంగులమయం చేసి విద్యార్థులకు కావలసిన ఆటవస్తువులు, సామాగ్రిని కొనుగోలు చేశారు. క్రమంగా ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగి 161 కి చేరుకోవడంతో జిల్లా విద్యాధికారి ఆదేశాలతో మరో ముగ్గురు ఉపాధ్యాయులను విద్యాశాఖ సమకూర్చింది. ప్రైవేటుకు ధీటుగా తల్లిదండ్రుల సహకారంతో టీషర్టులు ,మొదలైనవి అందజేస్తూ, సైన్సు ఫేర్‌, కల్చరల్స్‌ వంటివి నిర్వహిస్తున్నారు. నవోదయ, గురుకులాల వంటి వివిధ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు కోచింగ్‌నిస్తూ, సెలవు రోజుల్లో సైతం ఇక్కడి ఉపాధ్యాయులు , విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నారు. 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు వెళ్ళిపోవడంతో ప్రస్తతం ఈ పాఠశాలలో 123 మంది విద్యార్థులుండగా ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కొంచెం చొరవ, కొంచెం సమాజ తోడ్పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందిస్తే, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటుకు ధీటుగా రాణిస్తాయని ఈ రెండు పాఠశాలలు నిరూపిస్తున్నాయి. వీరిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని ప్రభుత్వ ప్రాఠశాలలు విద్యార్థులతో కళకళలాడాలని ఆశిద్దాం…

అభివృద్ధి పనులపై కలెక్టర్ తో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ చర్చలు

జిల్లా కేంద్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో కలెక్టర్ తో సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలువంశాలపై చర్చించారు . వివరాలు ఇలా ఉన్నాయి.
▪️ జగిత్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ లో శానిటేషన్,ఇతర అవసరాల దృష్ట్యా లేబర్ నియామకం చేపట్టడం
▪️స్థానిక అవసరాల కోసం ఇసుక,మట్టి నీ ఆయా గ్రామాలలో అందుబాటు లో ఉంటే వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించడం,
▪️ ప్రైవేట్ భూమి లో నుండి సైతం మట్టి నీ తీసుకొని వాడుకోవడానికి అభ్యంతరం లేకుండా చూడాలని,
▪️ గ్రామాల్లోనీ చెరువులు ఇంకా పూర్తిగా నీటితో నిండనందున ఆయా గ్రామ అవసరాలకు చెరువు మట్టి తీసుకునే వారికి అవకాశం కల్పించాలని,
▪️టి ఆర్ నగర్ లో నిర్మించనున్న వేర్ హౌస్ కార్పొరేషన్ మరియు ఆగ్రో గోదాం కు స్థలం అప్పగించడం.
తదితర అంశాలపై కలెక్టర్ తో ఎమ్మెల్యే చర్చించారు. అదనపు కలెక్టర్ బిఎస్ లత సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు..


నిజామాబాద్ జిల్లా వేల్పూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం!
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఆగిఉన్న లారీని, కారు ఢీ కొట్టిన సంఘటనలలో ఇద్దరు మృతి చెందారు.

ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం అయ్యింది., కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. నిజామాబాద్ -జగిత్యాల జాతీయ రహదారిపై ఘటన చోటు చేసుకుంది.
మృతి చెందిన వారు ఒకరిది కోరుట్ల కాగా, మరొకరిది మెట్ పల్లి మం.వెల్లుల కు చెందిన యువకుడిగా భావిస్తున్నారు.


మృతి చెందిన వ్యక్తులు జగిత్యాల జిల్లాకు చెందిన వారు , కోరుట్ల మం. కాల్వగడ్డ కు చెందిన బెజ్జారపు సుమంత్, మెటుపల్లి మం. వెల్లుల్ల కు చెందిన మండలోజు అనిల్ లు గా పోలీస్ వర్గాలు ప్రాథమికంగా గుర్తించాయి.