క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి – ఎస్ పి సింధు శర్మ !

    తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 17   ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు అయ్యేలా చూడాలని మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నేర విచారణలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కన్విక్షన్ రేటుని పెంచాలని, జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని  పోలీస్ అధికారులను  జిల్లా ఎస్పీ సింధూ శర్మ ఆదేశించారు.


  స్థానిక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో  పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు., అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని  సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.

పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు  పని చేయాలన్నారు. SC/ST కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా లో మిస్సింగ్ అయన మహిళలు, చిన్న పిల్లలు  కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని ట్రేస్ చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 17   ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు   మెరుగైన సేవలు అందించాలని సూచించారు.


          ఈ సందర్బంగా విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 17  ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ  ఉత్తమ ప్రతిభను కనబరిచిన 64 మo ది అదికారులకు మరియు సిబ్బందికి యస్.పి  ప్రశంశ పత్రం అందజేశారు.
ఈ సమావేశంలో  అదనపు ఎస్పీ శ్రీ రూపేష్  డీఎస్పీలు  ప్రకాష్, రవీంద్ర రెడ్డి , రవీంద్ర కుమార్, SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ దుర్గ,  ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్,  మరియు  సి.ఐ లు రాజశేఖర్ రాజు, కిషోర్, రమణమూర్తి, శ్రీను, DCRB, ఐటీ కోర్ సిబ్బంది  పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కేంద్ర క్వాలిటీ కంట్రోల్ టీం సభ్యులు


జగిత్యాల అర్బన్ & రూరల్ మండలాలకు చెందిన గోపాల్ రావుపేట,అనంతారం ఐకేపీ కొనుగోలు కేంద్రాలను కేంద్ర క్వాలిటీ కంట్రొల్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ చెందిన అధికారులు పరిశీలించారు., ధాన్యం కొనుగోలు ప్రక్రియ,రైతు నమోదు,చెల్లింపు విధానం, నాణ్యత ప్రమాణాలు, కనీస మద్దతు ధర, ట్రాన్స్ పోర్ట్,గన్ని సంచుల సప్లయ్,తూకం విధానం, టాబ్ లో నమోదు, రిజిస్టర్ లో నమోదు ప్రక్రియ తదితర అంశాలను పరిశీలించి, స్థానిక రైతుల అభిప్రాయం, కేంద్రంలో కావలసిన ఇతర వసతుల గూర్చి అడిగి తెలుసుకొన్నారు.
కేంద్ర పరిశీలకులు అనాలలిస్ట్
అసుతోష్ పాండే ప్రాజెక్ట్ అసిస్టెంట్ రచిత్ శ్రీవాస్తవ, జిల్లా DM రజనీకాంత్, జిల్లా Dpm మల్లేష్, APM వి.గంగాధర్, Cc లు సత్యం, విద్యాసాగర్,సంతోష్,సిబ్బంది గోవిందా, గంగా భవాని, కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

జగిత్యాల జిల్లా లో శుక్రవారం మంత్రి  కెటిఆర్ పర్యటన.


మెట్టుపల్లి మండలం గండి హన్మాన్ దేవాలయం వద్ద 56 అడుగుల భారి శ్రీరాముని విగ్రహాన్ని తేది 10-06-2022 శుక్రవారం రోజున రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మాత్యులు  కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించనున్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అథితులుగా మంత్రివర్యులు  కొప్పుల ఈశ్వర్,  వేముల ప్రశాంత్ రెడ్డి, మరియు ఇంద్రకరణ్ రెడ్డి లు పాల్గొననున్నారు.