రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్, పీసీ మోదీకి ఆమె నామనేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో ,పాటు కేంద్ర మంత్రులు

రాజ్ నాథ్ సింగ్ , నితిన్ గడకారీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, వైయస్సార్సీపి రాజ్యసభ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి, భాజపా, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత నామినేషన్ పత్రాలను 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరిచారు.

ఎంపీలకు శుభాకాంక్షలు!
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన దామోదర్ రావు , పార్థసారధి రెడ్డి, లను పార్లమెంటు లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారికి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

గాంధీనగర్ 4 లైన్ల బ్లాక్ స్పాట్ రోడ్డు !
ఎమ్మెల్యే సంజయ్!
జగిత్యాల పట్టణ మంచి నీళ్ల బావి వద్ద నుండి గాంధీనగర్ మీదుగా చల్గల్ వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును నాలుగు లైన్ల బ్లాక్ స్పాట్ రోడ్డుగా మంజూరు తోపాటు,₹ 17 కోట్ల 73 లక్షల నిధుల మంజూరుకు కృషి చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిసి గాంధీనగర్ 11వ,12వ వార్డు ప్రజలు, కుల సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ
1956 లో మున్సిపల్ గా ఏర్పడ్డ తర్వాత 1969 సం,లో మాస్టర్ ప్లాన్ ఉండాలని,100 ఫీట్ల రింగు రోడ్డు ఉండాలని అప్పటి నాయకులు ఆకాంక్షించారు అని,1989 లో అధికారికంగా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం పొందడం జరిగిందని,గత నాయకులు నిర్లక్ష్యం వల్ల మాస్టర్ ప్లాన్ అమలు కాలేదు అని అన్నారు ..తాటి పల్లి నుండి ధరూర్ బైపాస్ సైతం రైల్వే లైన్ వల్ల ప్రయాణికులకు 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారని, ఎమ్మెల్సీ కవితక్క దృష్టికి తీసుకురాగా వారి కృషి వల్ల రహదారి సమస్య తీరిందని అన్నారు.
జగిత్యాల నుండి ధరూర్ మరియు తిప్పన్ పెట్ వరకు బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరుకు కృషి చేస్తున్నామని అన్నారు,గాంధీనగర్ ప్రాంతంలో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, గత నాయకులు పట్టించుకోక పోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. నేడు రోడ్డు రహదారి నిర్మాణానికి నిధుల మంజూరు పలించినందున జిల్లా ప్రజలందరికీ శుభ వార్త అని ఈసందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు అని అన్నారు ,ప్రజలందరి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ భోగ శ్రావణి ప్రవీణ్,పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, నాయకులు అల్లాల దామోదర్ రావు, బాలే శంకర్,ఆనంద్ రావు, సుధాకర్ రావు,కౌన్సిలర్ లు బోడ్ల జగదీష్,పంబాల రామ్ కుమార్,నాయకులు తదితరులు పాల్గొన్నారు



మైనార్టీ ల అభివృద్ధికి పెద్దపీట...
జగిత్యాల పట్టణ 11వ వార్డ్ అమీనా బాద్ లో శుక్రవారం , సిడీపీ నిధులు ₹ 8లక్షలతో షాది ఖానా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ లు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. అనంతరం 4 లైన్ల బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరుకు కృషి చేసినందుకు ఎమ్మేల్యే,ఛైర్మెన్ గారికి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపిన మైనార్టీ నాయకులు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలే లత శంకర్, ,టీఆరెఎస్ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ మూజాహిధ్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్,మైనార్టీ పట్టణ అధ్యక్షులు బారి,AMC వైస్ చైర్మన్ అసిఫ్, అమీన్ ఉల్ హాసన్,రియాజ్ ఖాన్,మజీద్ కమిటీ అధ్యక్షులు రహీమ్,టీఆరెఎస్ మైనార్టీ యూత్ అధ్యక్షుడు ముకీం, నాయకులు రిజవాన్, తయ్యభ్,జకీర్,అమీర్,జబ్బార్,అబ్దుల్లా,ఫర్ఖన్,క్రాంతి,గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఉర్దూ జర్నలిస్టులకు శిక్షణ తరగతులు !
తెలంగాణ ప్రభుత్వ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టులకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కార్యదర్శి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాదులోని ‘urdhu maskhan khilwatha’ లో 25/06/2022 నుంచి 25/06/2022 వరకు నిర్వహించనున్నట్టు కార్యదర్శి ప్రకటనలో పేర్కొన్నారు .

రేపు యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు!
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో ‘భరణి’ నక్షత్రమును పురస్కరించుకొని రేపు25/06/2022 శనివారం ఉదయం 8- 30 గంటలకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించబడును. మనీ కార్యనిర్వాహణాధికారి సంకటల శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు!
జిల్లా బిసి సంక్షేమ సంఘం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కు ఎంపీ సీటు ఇచ్చిన సందర్భం లో జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు .ఈరోజు ఢిల్లీలో పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీ నారాయణ ,జగిత్యాల జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జాజాల రమేష్ హర్షం వ్యక్తం చేశారు ,.

ఎమ్మెల్సీ జీవన్ పూజలు!
పట్టణంలోని తులసీనగర్ గంగ పుత్ర సంఘం మహిళల ఆధ్వర్యంలో జరిగిన గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమంలో పాల్గొని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.