రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్రంలో రైతుల పక్షాన పోరాటంలో భాగంగా అర్హులైన రైతులకు రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం

కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ర్యాలీ స్థానిక ఇందిరా భవన్, నుండి బయలుదేరి తహసీల్ చౌరస్తా వరకు నాయకులు వెళ్లి రాస్తారోకో చేశారు.

జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారిని మాధురి కి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమములో DCC అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి ఆది శ్రీనివాస్ ,

మరియు వివిధ హోదాల్లో వున్నా పట్టణ రాష్ట్ర నాయకులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు,సర్పంచ్ లు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి దేశానికే తెలంగాణ దిక్సూచి-జడ్పీ చైర్పర్సన్

కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి దిక్సూచి అని జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
బుధవారం ప్రగతి కార్యక్రమం పై జిల్లా స్థాయి అధికారులు మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో చైర్ పర్సన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ:
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరంగా గ్రామాల్లో అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణంలో నివసించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాలలో నిరంతరం శానిటేషన్ పనులు చేపట్టాలని, త్రాగు నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచి స్వచ్ఛమైన త్రాగు నీరు సరఫరా చేయాలని ఆదేశించారు.
తడి చెత్త పొడి చెత్త ను విధిగా సేకరించి డంప్ యార్డ్ లకు తరలించి తద్వారా గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాలని తెలిపారు
రాబోయే హరితహారం కార్యక్రమంలో ఔషధ మొక్కలను మరియు నీడ ను ఇచ్చే మొక్కలను నర్సరీల్లో పెంచాలని, ఇండ్లలో పంచే మొక్కలు ప్రజలకు అవసరమైన వాటినీ మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు.


పల్లె ప్రగతి కార్యక్రమం ను జగిత్యాల జిల్లా గ్రామీణ ప్రాంతంలో విజయవంతం చేసినందుకు గాను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు,DRDO,DFO మరియు DPO లను శాలువాలతో సన్మానించారు, .ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుందర వరదరజన్,DRDO వినోద్, DPO హరి కిషన్,DFO వెంకటేశ్వర్లు, DLPO మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు


.

చెరుకు రైతు అరెస్టు అమానుషం !
బిజెపి ఎంపీ, ఎమ్మెల్యే ధ్వజం!


జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విలేకరుల సమావేశంలో . బుధవారం మాట్లాడారు..కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ., మాజీఎమ్మేల్యే బొడిగే శోభ. బిజేపి అధ్యక్షుడు సత్యనారాయణ రావు, తదితర నాయకులు. పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మెటుపల్లి లో చెరుకు రైతుల అక్రమ అరెస్ట్ లని ఖండించారు. రైతు అరెస్ట్ అమానుషమని వారన్నారు. అగ్నిపత్ పై మంత్రి KTR గారికి అవగాహన లేదనీ, కొంచెం KTR కి దేశభక్తి ఉంటే తెలుస్తోందనీ, అగ్నిపథ్ అంటే ఏంటో మొదలు KTR అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు, జగిత్యాల జిల్లా లో రైతుల అరెస్ట్ ల ను తీవ్రంగా కండిస్తున్నాం దీనిని బట్టి తెలుస్తుంది రైతుల పై తెలంగాణ ప్రభుత్వం కు కేసీఆర్ కి ఎంత ప్రేమ ఉందొ తెలుస్తోందని మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మెరకు, స్పైస్ బోర్డ్ తెచ్చామని, మీరు షుగర్ ఫ్యాక్టరీ తెర్పిస్తాను అన్నారు కనీసము ఇథనల్ ఫ్యాక్టరీ ని తెప్పించండని రైతుల పక్షన మేము నిలబడుతము రైతుల కి అండగా ఉంటామని అన్నారు ,
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశం లో మొట్ట.మొదటి సారి ఆదివాసి బిడ్డ ను రాష్ట్రపతి నియామకం చేయడంతో నే బిజేపి పార్టీ అర్థమవుతుందని, కేంద్ర ప్రభుత్వము దళితుల గిరిజన ఆదివాసి లపై ప్రేమ ఎంతో తెలుస్తుందని, తెలంగాణ సీఎం దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ తన మంత్రి వర్గం లో ఒక దళితుడిని మాత్రమే మంత్రిని చేసి దళితులను మోసం చేశారని Sc, st జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ప్రణాళికలు చేస్తున్నారు.
చేసే పనికి చెప్పే మాటకి పొంతన లేకుండా కేసీఆర్, షుగర్ ఫ్యాక్టరీ ని నిర్వీర్యం చేశారని, రైతులకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అన్యాయం ను రైతులు తగిన సమయంలో తగిన ఈ విధంగా బుద్ధి చెప్తారని,. ఆయన అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన లో మీ ఇంటలిజెన్స్ పనితనం ఏమైందని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏమిపని చేస్తోందని ప్రశ్నించారు.


ఈ నెల 28 నుండి రైతుబంధు !
ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్టు ప్రకటనలో . పేర్కొన్నారు.


మంత్రి పరామర్శ !
ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ జోగినిపెల్లి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ప్రభాకర్ రావు మృతి చెందారు.