2004 నుంచి 2014 వరకు పది సంవత్సరాలు పవర్ లో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరేం చేశారు ? మీరు ప్రజా సంక్షేమ పథకాలు ఎందుకు చేపట్టలేదు. వరంగల్ డిక్లరేషన్ అంటూ, కాంగ్రెస్ పార్టీ, దాన్యం కొనకుండా కేంద్రంలోని 8 సంవత్సరాల పాలనలో బిజెపి పార్టీ ప్రజలను రైతులను దగా చేస్తున్నారని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.

ధర్మపురి మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, పదవీ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ బిజెపి పార్టీల పై ఆయన ధ్వజ మెత్తారు.

చైర్మన్ గా రాజేష్ కుమార్, వైస్ చైర్మన్ గా సునీల్ కుమార్, మరియు పాలకవర్గ సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు,

బుగ్గారం ఎంపీపీ ,జెడ్ పి టి సి సభ్యులు బాదినేని రాజమణి రాజేందర్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రామయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు యస్. భీమయ్య, నియోజకవర్గం కు చెందిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

ఈ-యాప్ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ధర్మపురి నియోజకవర్గంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సిద్దమవుతున్న విద్యార్థులు ధర్మపురి ఈ-యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం ధర్మపురి లో షాది ఖానా మరియు టి.టి.డి మందిరంలో గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మంత్రి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎస్సి శాఖ మరియు ఎల్.ఎం.కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో 850 రైటింగ్ ప్యాడ్స్ అందచేశారు.
నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ 1.31 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో భర్తీ చేశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 90 వేల ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, స్థానికులకు 95% ఉద్యోగ అవకాశాలు దక్కేలా నూతన జీవన విధానం ఆమోదింపజేసుకున్నామని మంత్రి తెలిపారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కెందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు.
పోలీసు ఉద్యోగాలు, గ్రూప్స్ కొరకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నూతన యాప్ సైతం రుపోందించామని మంత్రి అన్నారు.
ధర్మపురి ఈ క్లాస్ రూమ్ యాప్ ను విద్యార్థులు ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థుల కోసం యాప్ లో ఆంగ్ల మాధ్యమం, తెలుగు మాధ్యమ కోర్సులు ప్రవేశ పెట్టామని మంత్రి అన్నారు.
ఆంగ్ల మాధ్యమం కోర్సులో 4 సబ్జెక్ట్ లు ఉంటాయని, రాష్ట్రస్థాయి పోటీలతో పాటు 57 రకాల కేంద్ర పరీక్షలు రాయడానికి సైతం ఉపయోగ పడతాయని మంత్రి తెలిపారు. తెలుగు మాధ్యమ కోర్సులో రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షల సిలబస్ సంబంధించిన సబ్జెక్టు ఉంటాయని అన్నారు.
రేపు మధ్యాహ్నం వరకు యాప్ లో విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని, వారు పరీక్ష లకు సన్నద్ధం కావాలని సూచించారు.

కలెక్టర్ మాట్లాడుతూ…
కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు.
పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, మనకు ఉద్యోగం లభిస్తుంది అనే నమ్మకంతో విద్యార్థులు కృషి చేసి పూర్తి ఏకాగ్రతతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.
విద్యార్థులు శిక్షణ సమయంలో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, పూర్తి ఏకాగ్రత ప్రిపరేషన్ పై కేటాయించాలని కలెక్టర్ సూచించారు. సాధారణ పరీక్షలకు పోటీ పరీక్షలకు చాలా తేడా ఉంటుందని, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అందరి కంటే మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉందని , పేద విద్యార్థులు వెనకబడ్డ కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎందుకు విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్, రైటింగ్ ప్యాడ్ పంపిణీ చేశామని, యాప్ సైతం రుపోందించామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ విజయం సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు
మున్సిపల్ చైర్ పర్సన్ , ఎస్.సత్తెమ్మ, జగిత్యాల ఆర్ డి ఓ మాధవి డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఎస్సి వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మి పూర్, తిమ్మ పూర్,వంజరు పల్లి,నర్సింగా పూర్,చల్ గల్,మోర పల్లి,తాటి పల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి, వైకుంటధామం,కంపోస్ట్ షేడ్లను ప్రారంభించి గ్రామానికి చెందిన లబ్ది దారులకు సీఎం సహాయ నిది,కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ , పాక్స్ చైర్మన్ సందీప్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,ఎస్సీ కార్పొరేషన్ ఈడి లక్ష్మీనారాయణ, ఎంపిడిఓ రాజేశ్వరి,ఎమ్మార్వో నవీన్,ఎంపీవో రవి బాబు,MEO గాయత్రి,ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసి లు,ఉపసర్పంచ్లు,అధికారులు,నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

మన ఊరు మన బడి !
మన ఊరు మన బడి మొబైల్ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం బీర్పూర్ మండలం లోని ఫేస్ వన్ లో సెలెక్ట్ కాబడిన 11 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మన ఊరు మన బడి మొబైల్ యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమం దీనిలో సైట్ నుండి MOU జనరేషన్ అప్లోడ్ గురించి Resolution copy’s అప్ లోడ్ గురించి వర్క్ ప్రోగ్రాం జరిగినప్పుడు వివిధ స్టేజీల లో ఫోటోలు capture గురించి vouchers బిల్స్ యాప్ లో అప్ లోడ్ గురించి మరియు ఇతర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వాసం భీమయ్య గారు ప్రధానోపాధ్యాయులు మరియు సీఆర్పీలు పాల్గొన్నారు

భూమి పూజ !
ధర్మపురి పట్టణం లో 25 లక్షల తో నూతనంగా నిర్మించే ప్రైమరీ వెటర్నరీ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
