జిల్లాలో జూన్ 12 న టెట్ పరీక్ష రాయడానికి పదివేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు,. వీరికోసం యంత్రాంగం 40 పరీక్షా కేంద్రాలను, 500 మంది ఇన్విజిలేటర్లు,,120. మంది హాల్ సూపరిండెంట్ లు 42 మంది చీఫ్ సూపరింటెండెంట్లను కలెక్టర్ నియమించారు.
కలెక్టర్ ముందస్తు సమీక్ష !
టెట్ పరీక్షలను ను కట్టుదిట్టంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పద్మనాయక కల్యాణ మండపంలో టెట్ ఎగ్జామ్ నిర్వహణ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ అవగాహన సదస్సులు నిర్వహించారు.

జగిత్యాల జిల్లాలో దాదాపు 10,000 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారని, వీరి కోసం 40 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేసే డి ఎస్ సి లకు టెట్ పరీక్ష ద్వారా 20% వెయిటేజ్ విద్యార్థులకు యాడ్ అవుతుందని, దీనిలో అర్హత సాధించడం చాలా కీలకమని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా టెట్ పరీక్ష నిర్వహిస్తోందనే అంశాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
టెట్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో ఇతర శాఖల అధికారుల నుంచి 500 పైగా ఇన్విజిలేటర్ లను, 120 హల్ సూపరింటెండెంట్లను, 42 చీఫ్ సూపరింటెండెంట్లను నియమించామని కలెక్టర్ అన్నారు.
జూన్ 12న నిర్వహించే టెట్ పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు తరలించే సమయంలో అవసరమైన బందోబస్త్ కల్పించాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని కలెక్టర్ పోలీస్ అధికారుల ను ఆదేశించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష లకు హాజరయ్యేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని కలెక్టర్ సూచించారు.
పరీక్ష నిర్వహణ సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇన్విజిలేటర్లు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ముందుగానే పరీక్ష కేంద్రం చూసుకోవాలని, సకాలంలో పరీక్షకు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు , సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి !
– ప్రజల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి కోరారు. మంగళవారం జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఉన్న రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా సమస్య పరిష్కారానికి వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఆస్పత్రి నిర్వహణ సంతృప్తికరంగా ఉందని కలెక్టర్ వైద్యాధికారులను అభినందించారు. ఆస్పత్రి పరిసరాలలో పారిశుద్ధ్య పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. .ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మహిళా డిగ్రీ కళాశాల సందర్శించిన కలెక్టర్
జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి గారు సందర్శించి కళాశాల అభివృద్ధి ప్రణాళిక ను సమీక్షించి, విద్యార్థుల అభివృద్ధి నివేదిక ను పరిశీలించారు., కళాశాల విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించే టాయిలెట్స్ బ్లాక్స్ ను స్థలాన్ని పరిశీలించి తగు నిధులు మంజూరు చేశారు. కళాశాలలో గల వసతులను పరిశీలించి ప్రిన్సిపల్ గారితో సమీక్షించి ఈ మధ్యకాలంలో కళాశాల అత్యుత్తమ న్యాక్ గ్రేడ్ సాధించినందుకు ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మరియు కళాశాల సిబ్బందిని అభినందించారు.సమావేశ మందిరంలో తగు వసతులు కల్పించడానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మస్రూర్ సుల్తానా, అకాడ మిక్ కోఆర్డినేటర్ ఏ శంకరయ్య, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ శ్రీ ఎం సత్య ప్రకాష్,వృక్షశాస్త్ర విభాగాధిపతి జి చంద్రయ్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, శ్రీ మల్లారం శ్రీనివాసరెడ్డి, శ్రీమతి ఏ రజిని, డాక్టర్.హరిజ్యోతికౌర్, శ్రీ ఎస్ సత్యం, గ్రీన్ ఆడిట్ సెల్ కన్వీనర్ డాక్టర్ ఏ జ్యోతి లక్ష్మి, డాక్టర్ కె కిరణ్మయి,రాపర్తి శ్రీనివాస్, స్వరూపరాణి, మానస, జమున, జోత్స్న, మాధవి, సునీత, గొల్లపెల్లి తిరుపతి, యాస్మిన్ సుల్తానా, ఆసియా సుల్తానా, ఎదునూరినవీన్, రశ్మిత, వీణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు

మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సు!
మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సమీప గ్రామ పంచాయితీల సందేహాల నివృత్తికి రీజినల్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ & కంట్రీ ప్లానింగ్ అధికారి మైఖేల్ గారితో అవగాహన సమావేశం
ఇట్టి సమావేశములో గ్రామ సర్పంచ్లు మరియు పంచాయితీ సెక్రెటరీ లకు మాస్టర్ ప్లాన్ ఏర్పాటు యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలను మైకేల్ గారు వివరించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పన అనేది జగిత్యాల మున్సిపాలిటీ తో పాటుగా సమాంతరంగా సమీప గ్రామ పంచాయితీలు కూడా ప్లానింగ్ లో అభివృద్ధి చెందుటకు మాత్రమేనని, మున్సిపాలిటీల్లో విలీనము కోసం కాదని వివరించారు.
ఇట్టి సమావేశములో మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, డి.టి.సి.పి. ఒ శ్రీనివాస్ రావు, డి.యల్.పి.ఒ కనక దుర్గ, యం.పి.ఒ రవి బాబు, టి.పి.యస్ శ్యామ్ సుందర్ మరియు గ్రామ సర్పంచ్లు, పంచాయితీ సెక్రటరీలు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్మపురి మున్సిపాలిటీలో 03 & 04 వార్డులు సందర్శించడం జరిగింది. మరియు మురికి కాలువలు శుభ్రం చేయడం జరిగింది పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది పైప్ లైన్ లీకేజ్ గుర్తించి రిపేరు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గౌరవ చైర్ పర్సన్ మరియు గౌరవ సభ్యులు సిబ్బంది పాల్గొనడం జరిగింది

బీర్పూర్ లో..
మండల కేంద్రమైన బీర్పూర్ లో BJYM ఆధ్వర్యంలో కేద్రంలో నరేంద్ర మోడీ తన పదవి కాలం 8సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో బిజెపి బీర్పూర్ మండల్ ప్రెసిడెంట్ మ్యాడా జనార్దన్, మండల్ ఇంచార్జ్ ,పిల్లి శ్రీనివాస్,జిల్లా అధికారప్రతినిధి చిలుకమర్రి మదన్ మెహన్, జిల్లా ఇంచార్చ్ శేఖర్ , జిల్లా కార్యవర్గ సభ్యుడు బూట్లు మార్కండేయ, ప్రధాన కార్యదర్శులు రమేష్, కిషన్, bym అధ్యక్షుడు జూటా నరేందర్ కార్యకర్తలు భాస్కర్,కంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురిలో…
బిజెపి ప్రభుత్వం,నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మపురి పట్టణ/మండల యువమోర్చా BJYM అధ్వర్యంలో ధర్మపురి పట్టణం లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భం లో BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ మాట్లాడుతూ ఈ 8 సం” లో బీజేపీ నరేద్ర మోడీ అనేక చట్టాలు సంస్కరణలు చేపట్టి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నాయకుడు మన నరేద్ర మోడీ గారు ,8 సం” క్రితం ప్రజలు సురక్షితం గా లేరు ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు తో దేశ ప్రజలు బయ బ్రాంతులు లో జీవించేవారు కానీ మోడీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి బాంబు పేలుళ్లు లేక దేశ ప్రజలు చాలా సురక్షితం గా ఉన్నారు ,370 ఆర్టికల్,అయోధ్య రామ మందిర్,మేక్ ఇన్ ఇండియా ,భేటి పడవ్ భేటి బచావ్,ఆయుష్మాన్ భారత్ ,సుకన్య యోజన పథకం .అలాగే మఱిఎన్నో చట్టాలు ,సంస్కరణం తో విజయవంతం గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోడీ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం, ఈ కార్యక్రమంలో మండల/పట్టణ BJYM అధ్యక్షులు నార్ల విజయ్,గాజు భాస్కర్,బీజేపీ పట్టణ/మండల అధ్యక్షులు సంగెపు గంగారాం,బెజ్జరపు లావణ్,జిల్లా obc మోర్చా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్,నరెడ్ల శంకర్,దివిత్తి శ్రీధర్ ,సీనియర్ నాయకులు నలుమసు వైకుంఠం,స్తంభాకది శ్యామ్,పల్లర్ల సురేందర్, రాయల్లా రవి కుమార్ షిండే bjp/bjym నాయకులు కసెట్టి హరీష్ అప్పం శ్రీనివాస్, తౌటం మహేష్ ,అసం సురేష్,సంగి రాజేష్, మెరుగు శేఖర్ ,ఆనందస్ నవీన్,అయ్యోరి మల్లేష్ ,అప్పం మల్లేష్,బండారు గణేష్,కొరిగంటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

బుగ్గారం లో అంగన్వాడి బడిబాట.!
బుగ్గారం మండల కేంద్రంలో మరియు గోపులాపూర్ గ్రామంలో మన ఊరు మన బడి సర్కారు బడి చదువులమ్మ ఒడి కార్యక్రమంలో బుగ్గారం మండల ఎంపీపీ బాదినేని రాజమణి మాట్లాడుతూ ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించండి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనే కోరికతో ఆర్థిక భారం మోస్తూ ప్రైవేటు పాఠశాలలకు వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ ప్రయాస పడి చదివిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మన గ్రామములో మన స్కూల్లో కొత్తగా ఇంగ్లీష్ మీడియం ను ప్రభుత్వమే ప్రవేశ ప్రవేశపెట్టిందని తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు మూల సుమలత శ్రీనివాస్ కొమ్మినేని సుశీల వైస్ ఎంపీపీ సుచెందర్ మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ రెహమాన్ ఏఎంసి మార్కెట్ డైరెక్టర్ జంగ శ్రీనివాస్ గోపులాపూర్ ఉపసర్పంచ్ మరిపెళ్లి రాజేశ్వర్ రెడ్డి మేడిపెల్లి గంగాధర్ ఎరవేణి వినోద్ ఎమ్మార్వో ఫార్క్ ఎంపీడీవో తిరుపతి ఆర్ఐ తిరుపతి వివిధ హోదాల్లో ఉన్న అధికారులు అంగన్వాడీ టీచర్లు నాయకులు పాల్గొన్నారు

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి !
మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మిని ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీతూ డిసౌజా
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు ప్రకటన జారీ చేశారు. వనపర్తి , పెద్దపల్లి, హైదరాబాద్ ,నిర్మల్, రంగారెడ్డి జిల్లాల మహిళా విభాగం అధ్యక్షులు సైతం ఆమె నియమించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా విభాగం కార్యదర్శి ఫాతిమా రోషన్ పత్రికా ప్రకటన జారీ చేశారు.
