తిరుమల శ్రీవారి సన్నిధిలో కళ్యాణం ఉచితం!


హిందువులెవరైనా తిరుమల కళ్యాణ వేదిక లొ ఉచితంగా పెళ్లి చేసుకోవచ్చు.ఇందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన వారందరికీ తిరుమల కళ్యాణ వేదిక లొ పెళ్లి తంతు నిర్వహించడంతోపాటుగా నూతన వధువరులతొపాటు మరొ నలుగురికి శ్రీవారి దర్శనం,₹50 వసతి గది, పసుపు కుంకుమ, శ్రీవారి ప్రసాదం కూడా ఉచితంగా లభిస్తుంది.
మీకు నచ్చిన తారీఖున (వెబ్సైట్ లొ అందుబాటులో ఉన్న) తేదీన అవసరమైన వివరాలు వెబ్సైట్ లొ నమోదు చేసి రిసిప్ట్ పొందవచ్చు.
కళ్యాణ వేదిక గైడ్ లైన్స్ స్క్రీన్ షాట్ లొ ఉన్నాయి చూడండి.
వెబ్సైట్ లొ కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
కల్యాణ వేదిక…


మార్గదర్శకాలు


1. వధువు మరియు వరుడు తప్పనిసరిగా
హిందూ మతానికి చెందినవారై ఉండాలి.
2.పెళ్లి తేదీ నాటికి వధువు వయస్సు 18
సంవత్సరాలు మరియు వరుడికి 21
సంవత్సరాలు నిండి ఉండాలి.
3.పెళ్లికి ముందు వధూవరుల వయస్సు సర్టిఫికెట్లు
తప్పనిసరిగా TTD అధికారులకు సమర్పించాలి:
(పాఠశాల సర్టిఫికేట్/బర్త్ సర్టిఫికేట్/పాన్ కార్డ్/
పాస్పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్లో ఏదైనా ఒకటి).
4. వధువు మరియు వధువు వరుడి నివాస
చిరునామా రుజువుకు సంబంధించిన సర్టిఫికేట్
(ఆధార్ కార్డ్ లేదా సంబంధిత తాసిల్దార్ నుండి
పొందిన నివాస ధృవీకరణ పత్రం) తప్పనిసరిగా
సమర్పించాలి.
5.పెళ్లి సమయంలో వధువు మరియు వధువు
వరుడి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఉండాలి.
ఒకవేళ తండ్రి లేదా తల్లి మరణించి ఉంటే, మరొకరు
తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రంతో పాటు
ఆధార్ కార్డుతో హాజరు కావాలి. ఒకవేళ
తల్లిదండ్రులిద్దరూ మరణించి ఉంటే,
తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రంతో పాటు
గుర్తింపు (ఆధార్ కార్డ్) యొక్క సాక్ష్యాధారాలను
సమర్పించడానికి సంరక్షకులు
అనుమతించబడతారు.
6.ప్రేమ వివాహాలు మరియు రెండవ వివాహాలు
అనుమతించబడవు.
7.సంబంధిత అధికారుల నుండి పొందిన
అవివాహిత సర్టిఫికేట్ [MRO/Thasildhar]
సమర్పించాలి.
8. నిర్దిష్ట ముహూర్తం రోజున డిమాండ్ను బట్టి,
వివాహాలు సాముహికంగా నిర్వహించబడతాయి.
9.కళ్యాణ వేదిక వద్ద వివాహం జరిగిన తర్వాత,
TTD దర్శన రశీదును జారీ చేస్తుంది . ప్రత్యేక
ప్రవేశ దర్శనం (ఉచిత 300) ‘Q’ లైన్ ఎంట్రీ, తిరుమల
ద్వారా ఆరుగురు వ్యక్తులు ఉచితంగా దర్శనానికి
అనుమతించబడతారు. వధువు, వరుడు
మరియు మరో నలుగురు వ్యక్తులు (జంట
తల్లిదండ్రులు/సంరక్షకులు).
10. ఒక రూ.50/- గది 24 గంటల పాటు
ఉచితంగా అందించబడుతుంది మరియు రెండవ
రోజు చెల్లింపుపై పొడిగింపు ఉంటుంది. లభ్యతకు
లోబడి చెల్లింపుపై మరొక గది
అందించబడుతుంది.
11. తిరుమలలో ఉన్న ప్రభుత్వ రిజిస్ట్రేషన్
కార్యాలయం నుండి వివాహ ధృవీకరణ పత్రాన్ని
పొందడానికి యాత్రికులు అదే దర్శన రశీదును
ఉపయోగించవచ్చు.
12. టీటీడీ దంపతులకు పసుపు, కుంకుమ,
కంకణాలు, ప్రసాదాలు అందజేస్తుంది..


13.దయచేసి ఏదైనా విచారణల కోసం కాల్
సెంటర్: +91-877-2233333/77777 లేదా
హెల్ప్ డెస్క్ నంబర్: +91-8772263433 లేదా
ఇమెయిల్:helpdesk@tirumala.orgని
https://tirupatibalaji.ap.gov.in/#/vedika

లైన్స్ క్లబ్ అధ్యక్షుడిగా డాక్టర్ రామకృష్ణ !

ధర్మపురి పట్టణం లో మొదటి ఉప గవర్నర్ లయన్ రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో  కొత్తగా ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు.. కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు లయన్ Dr ఇందరపు రామకృష్ణ గారిని,  సెక్రటరీ  లయన్ పైడి మారుతి, ట్రెసరర్ లయన్ సిరుపతి రాజయ్య , జిల్లా నుండి వచ్చిన మొదటి ఉప గవర్నర్ లయన్ రాజిరెడ్డి  డిస్ట్రిక్ట్  సెక్రటరీ లయన్ నారాయణ రావు , డిస్ట్రిక్ట్  జాయింట్ సెక్రటరీ లయన్ సుదర్శన్ , GLT  కోఆర్డినేటర్ లయన్ మధుసూదన్ , GST కోఆర్డినటర్ లయన్ కోదండ రాములు  రీజియన్ చైర్మన్ లయన్ సమ ఎల్లారెడ్డి , జోన్  ఛైర్మన్ లయన్ చుక్క భీమరాజు , DC  (డిస్ట్రిక్ ఛైర్పర్సన్)లు  లయన్ జక్కు రవీందర్ ,లయన్ సంగి ఆనంద్ , లయన్ భీమనతి అశోక్ సన్మానించారు. 

ధర్మపురి క్లబ్ నుండి మొట్టమొదటగా నియమితులైన జోన్ ఛైర్మెన్ లయన్ చుక్క భీమరాజు  మరియు కొత్తగా ఎన్నికైన నూతన సభ్యులకు స్వాగతం పాలికినరు . ప్రోగ్రాం చైర్మన్ గా లయన్ జక్కు రవీందర్ నిర్వహించినారు.


చెక్కుల పంపిణీ లు, ప్రారంభోత్సవాలు !


జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన  11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 6 లక్షల 81 వేల రూపాయలను, ,8 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 8లక్షల   రూపాయల విలువగల చెక్కులను  ఆదివారం దానికి ఎమ్మెల్యే లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి  అందజేశారు.
అర్పపల్లి,కొనాపుర్,పెంబట్ల,లచ్ఛక్కపెట్,నాగునూర్, లక్ష్మిదేవి పల్లి ,రెచపళ్లి, భీమ్ రెడ్డి గూడెం ,నాయకపు తాండా, బట్టపళ్లి, పోతారం గ్రామాల్లో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లేలకు మహర్దశ వచ్చిందని,పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి సాధిస్తున్నాయి అని పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్  నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.దేశంలో లక్ష కు పైగా గ్రామాలు ఉంటే రాష్ట్రంలో 12697 గ్రామాలు ఉన్నాయి అని,దేశంలో ఉత్తమ గ్రామాల సర్వే లో మొదటి పది గ్రామాలు తెలంగాణ వేనని అన్నారు.8వేల నుండి 12 వేలకు గ్రామ పంచాయతీ లు పెరిగాయి అని,అందులో 4 వేలు కొత్తగా గ్రామ పంచాయతీ లుగా ఏర్పడ్డాయి అని అన్నారు.ప్రతి గ్రామానికి కార్యదర్శిని నియామకం చేసి 15 వేల నుండి 22 వేలకు జీతాలు పెంచి  గ్రామఅభివృద్ధిలోభాగస్వామ్యులను చేశామని గ్రామంలో పల్లే ప్రకృతి వనం , వైకుంఠ ధామం,కంపోస్టుషెడ్డు,ట్రాక్టర్ ,ట్యాంకర్,హరిత హరం ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు. పల్లే ప్రకృతి వనం లో దాతల సహకారంతో ఉయ్యాల, జారుడు బండ ఏర్పాటు పై దృష్టి పెట్టాలని,అందరినీ భాగస్వామ్యులను చేయాలని కోరారు.తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని,ఎరువుగా మార్చ వచ్చని,ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని,వాటి నివారణకు నడుం బిగించాలని అన్నారు. నియోజక వర్గం లో 172 చెరువులను బాగు చేశామని, తుమ్ లు ఏర్పాటు చేశామని,చెక్ డ్యాం నిర్మాణం చేపట్టామని ,రోల్ల వాగు నిర్మాణం తుది దశకు చేరుకుందని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరగడం జరిగిందని అన్నారు.దేశంలో 24 గంటల కరెంట్ ఎక్కడా లేదని రాష్ట్రంలో కరెంట్ పోతే వార్త అని అన్నారు.సంక్షేమ పథకాల అమలులో రాష్టం ముందు వరుసలో ఉందని సీఎం సహాయ నిధి,కల్యాణ లక్ష్మి చెక్కులను,ఆసరా, గీతా కార్మిక,చేనేత,వృద్ధాప్య,ఒంటరి మహిళ పెన్షన్ ఇలా అందిస్తున్నాము అని,రైతు బందు,రైతు భీమా దేశానికే ఆదర్శమని అన్నారు.రాష్ట్రం లో క్రీడల అభివృద్ధికి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామని,దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని,క్రీడల ద్వారా పిల్లల మానసిక వికాసం,శరీర దారుఢ్యం మెరుగు అవుతాయని,స్నేహ భావంతో ఉంటారని అన్నారు.క్రీడల్లో రాణించదానికి మైదానాలు దోహద పడతాయి అని,చదువు తో పాటు ఆటలు అవసరం అని అన్నారు.తెలంగాణ క్రీడా కారులు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారు అని అన్నారు.
నాగునుర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడడం మాని పేపర్,ఇస్తార్ ప్లేట్స్ వాడాలని ఎమ్మెల్యే అన్నారు. నాగునుర్ గ్రామంలో ఇస్తరాకులు విక్రయిస్తున్న మహిళ వద్దనుండి ఇస్తారాకులు కొనుగోలు చేశారు. ఎమ్మేల్యే వెంట ఎంపీపీ కొల జమున శ్రీనివాస్,  జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ,PACS ఛైర్మెన్ లు నరసింహరెడ్డి, మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి శేకర్ గౌడ్ ,కో ఆప్షన్ అమీర్, తదితరులు పాల్గొన్నారు.


ధర్మపురి లో  రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు!


ఆదివారం ధర్మపురి లోని నంది చౌక్ వద్ద మాజీ ఏఐసీసీ అధ్యక్షులు ఎంపీ  రాహుల్ గాంధీ  52 వ పుట్టినరోజు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సంగనభట్ల దినేష్, వేముల రాజేష్, సింహరాజు ప్రసాద్, సిపతి సత్యనారాయణ,  ఎండీ రఫీయోద్దీన్, ,జె. సుముఖ్, రందేని మోగిలి, అప్పం తిరుపతి, ,పోచమల్లు, నీలం రాజేందర్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


బుగ్గారంలో ….
జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు,  రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను బుగ్గారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, ఆధ్వర్యంలో ఆదివారం  జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, వేముల సుభాష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడ్డదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దనవేణి శంకర్, నగునూరి నర్సాగౌడ్,  కైలాసం, చారీ, నగునూరి వెంకన్న, రామాగౌడ్, మాజీ ఎంపిటిసి నగునూరి రామాగౌడ్, లక్ష్మణ్, రాజన్న, శంకర్, రమేష్ తదితరులున్నారు.