J.Surender Kumar,
ఉత్తరాఖండ్ రాష్ట్రం గంగోత్రి-యమునోత్రి, జాతీయ రహదారిపై కొన్ని గంటల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 20 మంది యాత్రికులు మృతి చెందినట్లు పిటిఐ సంస్థ వార్తా కథనం. జాకీ చెట్టి నుంచి వినాయక నగర్ గుండా ప్రైవేట్ బస్సు వెళ్తుండగా, దాదాపు 150 మీటర్ల లోతు గల లోయలో బస్సు పడిపోయింది. బస్సు లో 40 మంది ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం

. లోయలో యమునా నది కి కొద్ది దూరంలో బస్సు ఆగి ఉంది. పరిసర ప్రాంత ప్రజలు పోలీసులు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు . కొందరు క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించారు. డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆశిష్ చౌహాన్ , రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర యంత్రాంగం ,పోలీస్ ప్రాంత ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎం రావత్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులను, మృతదేహలను తరలించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతూ, కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు, మృతుల సంఖ్య పెరగవచ్చని యంత్రాంగం భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.