విద్యా, వైద్య రంగాల పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ – మంత్రి కొప్పుల ఈశ్వర్! సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత ఏకగ్రీవ తీర్మానం!

జగిత్యాల , జూన్ 17:- రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
శుక్రవారం స్థానిక వీ.కే.బి. ఫంక్షన్ హాల్ లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు గురైన విద్యా, వైద్య రంగాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో వైద్య కళాశాల మంజూరు చేశామని, 150 ఎంబీబీఎస్ సీట్ల తో వైద్య కళాశాల ప్రారంభానికి అవసరమైన అనుమతులు లభించాయని మంత్రి తెలిపారు.
జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి, ఈ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జడ్పీ సమావేశ ఏకగ్రీవ తీర్మానం చేసింది.


హైదరాబాద్ మహానగరంలో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్ జిల్లాలో మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం హైదరాబాద్ మహానగరంలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ప్రస్తుతం ధర్మపురి, కోరుట్ల పట్టణాల్లో సైతం ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.


ప్రతి జిల్లా కేంద్రంలో గర్బీణి స్త్రీ లు, పిల్లల కోసం 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, డివిజన్ పరిధిలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య శాఖ మంత్రి గా హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత అందుబాటులో ఉన్న సౌకర్యాల తో మెరుగైన వైద్యం సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రిలో మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స సైతం పేదల కోసం ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 1000 గురుకులాలు ఏర్పాటు చేశామని, దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల పై 6 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రూ.7200 కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమం అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పూర్తి ధాన్యాన్ని మద్దతు ధర పై కోనుగోలు చేసామని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని , రైతు బంధు రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఎస్సారెస్పీ పునర్జీవన పథకంలో భాగంగా వరద కాలువ వినియోగిస్తు పనులు పూర్తి చేసామని, వరద కాలువ నుంచి నిర్మీంచిన తుముల ద్వారా 2962 ఎకరాల ఆయకట్టుకు సైతం సాగునీరందించామని తెలిపారు. జిల్లాలోని గ్రామాలో పల్లె ప్రగతి పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాలను హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. పారిశుద్ద్య నిర్వహణ పై అధిక శ్రద్ద వహించాలని సూచించారు. గ్రామాలో పచ్చదనం పెంపొందించే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 236 కోట్లకు పైగా మొక్కలను నాటామని, 7.7శాతం మేర గ్రీన్ కవర్ వృద్ది చేసుకున్నామని మంత్రి తెలిపారు. గ్రామాలో కనీస అవసరాలు అందించే దిశగా స్మశానవాటిక, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, నర్సరీ వంటివి సమకూర్చుకున్నామని మంత్రి తెలిపారు.


సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన చర్యలు పకడ్భందిగా చేపట్టాలని, నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చివేయాలని, లోతట్టు ప్రాంతాలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.


జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావా వసంత!


వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం తో పని చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందచేయాలని తెలిపారు.జిల్లాకు మొదటి విడతలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను మంజూరు చేసినందులకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియచేశారు.


కలెక్టర్ జి. రవి !
మన ఊరు మన బడి కింద జిల్లాలో 274 పాఠశాలలను మొదటి విడత మంజూరు చేసామని, వాటిలో 248 పాఠశాలలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. వీటిలో 22 పాఠశాలలకు ప్రతిపాదనలు రూ.30 లక్షలకు పైగా ఉన్నందున టెండర్లు పిలిచామని తెలిపారు. మిగిలిన 226 పాఠశాల నిర్వహణ కమిటీలకు అభివృద్ధి పనుల అప్పగించడం జరిగిందని ,వీటిలో 117 పాఠశాలల్లో 15% ప్రతిపాదిత నిధులు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు.
మన ఊరు మన బడి పనులు వేగవంతం చేయడంలో మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక చోరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనుల కోసం సంబంధిత ఇంజనీర్ల లాగిన్ అందించామని, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
సర్వ సభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాల పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం సదరు ప్రజాప్రతినిధులకు అందించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.!


మన ఊరు మన బడి కార్యక్రమం అమలు పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జగిత్యాల ప్రాంతంలో 150 ఎంబీబీఎస్ సీట్ల తో వైద్య కళాశాల ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.


కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు !


పాఠశాలల్లో అభివృద్ధి పనుల్లో భాగంగా విద్యార్థులకు అవసరమైన మేర అదనపు తరగతులను నిర్మించాలని సూచించారు. రైతులకు విద్యుత్ మోటార్ కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్సి ని ఆదేశించారు.
జడ్పీ సర్వ సభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ,ఉద్యాన శాఖ, సహకార శాఖ, పశుసంవర్ధక శాఖ, పల్లె ప్రగతి, విద్యా శాఖ వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ వంటి వివిధ శాఖలపై చర్చించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించుకునేందుకు సమావేశం కు హాజరైన ప్రజా ప్రతినిధులకు, అధికారులు కు, పాత్రికేయులకు జ్యూట్ బ్యాగులను అందచేశారు.


గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ సీఈఓ సుందర వరద రాజన్ ,జిల్లా అధికారులు జెడ్పీటీసీలు, ఎంపీపీలు , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, చిటి వెంకట్రావు, సంబంధిత అధికారులు తదితరులు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కిసాన్లకు.. జవాన్లకు వ్యతిరేకి.. బిజెపి..
సికింద్రాబాద్ కాల్పులు బాధకరం..
బండి సంజయ్ కి బుద్దుందా.
అల్లర్ల వెనుక టీఆర్ఎస్ హస్తం అనడానికి నోరెలవచ్చింది.
మంత్రి కొప్పుల ఈశ్వర్.!

రైల్వేస్టేషన్లో కాల్పుల సంఘటన చోటు చేసుకోవడం. యువకుడు మృతిచెందడం. మరికొందరు గాయపడిన అంశంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలో స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
ధర్మం కోసం దేశం కోసం అని చెబుతున్న బిజెపి వాస్తవికంగా కిసాన్లకు, జవాన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. దేశానికి రైతులు, సైనికులే నిజమైన నాయకులని నమ్మే ఈ దేశంలో ఈ రెండు వర్గాలను బిజెపి ప్రభుత్వం అపహస్యం పాలు చేస్తుందన్నారు.
వ్యవసాయ రంగంలో నల్లచట్టాలతో రైతులను వంచించిన బిజెపి ఇప్పుడు అగ్నిపథ్.. అగ్నివీర్లు అంటూ జవాన్లను బజారురులో పడేసేలా ప్రవర్తిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను, సంస్థలను, ఫ్యాక్టరీలను ప్రైవేటు రంగాలకు కట్టబెడుతూ, బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. బీమా నుండి మొదలు కొని రక్షణ రంగం వరకు అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తున్న బిజెపి. అత్యంత కీలకమైన రక్షణ విభాగానికి సంబంధించి.. అసంబద్దమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
అగ్నిపథ్.. అగ్నివీర్ లాంటి పథకాలను తెచ్చి దేశ రక్షణ రంగంలో నిపపుణులైన సైనికులు లేకుండా చేసేందుకు యత్నిస్తుందన్నారు.
యువతకు రక్షణ రంగంలో ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సిన ప్రభుత్వం అగ్నిపథ్ పథకంతో తక్కువ వ్యయంతో తాత్కాలిక రక్షణ సైనిక వ్యవస్థను రూపొందించుకోవాలని చూస్తుందన్నారు. నిండ పద్దెనిమిది సంవత్సరాల వారిని రక్షణ రంగంలోకి తీసుకొని నాలుగు సంవత్సరాలు పాటు ఉద్యోగం కల్పించడం, తదుపరి వారికి రిటైర్మెంట్ కల్పించేలా వ్యవస్థను రూపొందించడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఇలా అయితే రక్షణ రంగంలో పటిష్టమైన శ్రేణి ఎలా ఏర్పడుతుందన్నారు.
21 సంవత్సరాలకే మిలటరీ నుండి వచ్చిన యువకుడి జీవనోపాధి ఎలా సాగుతుందన్నారు. దేశ రక్షణలో ప్రాణం పెట్టే సైనికుల విషయంలో అసంబద్ధమైన నిర్ణయాలతో వారిని అవమానించడం సరికాదన్నారు.
దేశ వ్యాప్తంగా ఆగ్నిపథ్ పథకానికి నిరసనలు వెల్లువెత్తుతుంటే, తెలంగాణలో అల్లర్లకు టీఆర్ఎస్ కారణం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించడం అసహ్యంగా ఉందన్నారు. బండి సంజయ్ కి అసలు బుద్ధి ఉందా అని మంత్రి ప్రశ్నించారు. దేశ అగ్నిపథ్ కు వ్యతిరేఖంగా నిరసనలు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ యువత సైతం అగ్నిపథ్ విషయంలో సంయమనం పాటించాలి అనే మంత్రి విజ్ఞప్తి చేశారు.