విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా 
నామినేషన్ దాఖలు హాజరైన మంత్రి  కేటీఆర్!

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా  నామినేషన్ సందర్భంగా ఢిల్లీ పార్లమెంట్ లో టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్. ఎంపీలతో కలిసి నామినేషన్ దాఖలుకు హాజరయ్యారు. 

అనంతరం విపక్షాల  రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు శుభాకాంక్షలు తెలిపారు

.
ధివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానం
ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్


జిల్లామహిళలు, శిశు, దివ్యంగుల. మరియు .వయో వృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఆర్థిక పునరావాస పథకం కింద ఎంపికైన జగిత్యాల నియోజకవర్గ లబ్దిదారులకు సోమవారం  ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దివ్యంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని,  మంత్రి కొప్పుల ఈశ్వర్  దివ్యాంగుల శాక మంత్రి గా ఉండడం వల్ల అనేక విధాలుగా జిల్లా ప్రజలు లబ్ది పొందుతున్నారని,  మంత్రి కెటిఆర్,  కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ  కవిత ల చొరవతో జిల్లా కు అధిక సంఖ్యలో,త్రీ వీలర్  స్కూటర్, కవితక్క సహకారం తో బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేశామని అన్నారు., ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరాలనే లక్ష్యం గా క్యాలండర్, పుస్తకాలు ముద్రణ చేపట్టడం జరిగిందని,  టి ఆర్ నగర్ వృద్ద ఆశ్రయం ఏర్పాటు, బాల సదన్ కూడా పూర్తి కావచ్చింది అని, సఖి కేంద్రం ఇలా మహిళల, వృద్ధుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని, జిల్లా గా ఏర్పడ్డ తర్వాత తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రం, రేడియాలజీ, నర్సింగ్ కాలేజీ,  మెడికల్ కాలేజీ  ఇలా వైద్య పరంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు, మహిళల, తల్లి,పిల్లల రక్షణకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, దివ్యాంగులు సకలంగుకు వివాహం చేసుకుంటే ప్రోతహకంగా లక్ష రూపాయలు అందజేస్తూన్నమని అన్నారు., ఉమ్మడి రాష్ట్రంలో₹ 500 పెన్షన్ ఉంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత  ముఖ్యమంత్రి కేసీఆర్ ₹3016/- చేశారని ,బడ్జెట్ లో సైతం అధిక నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా దివ్యాంగుల పక్షాన ధన్యవాదాలు అని,అభివృద్ధి,సంక్షేమం రాష్ట్రంలోనే అగ్ర భాగాన తెలంగాణ ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో DSWO డా.నరేష్, ఎంపీపీ లు రాజేంద్ర ప్రసాద్, సంధ్యారాణి సురేందర్ నాయక్,రైతు బందు మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దొంతి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కు సన్మానం!
జగిత్యాల పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, టి.అర్. నగర్, ఇస్లాంపుర లో బస్తీ దవాఖాన మంజూరు, పట్టణంలో మైనార్టీ కమ్యూనిటీ హాల్,పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ను  సన్మానించిన MIM పట్టణ అధ్యక్షులు యునిస్ నదీమ్, జగిత్యాల సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షులు బారి , సభ్యులు మరియు ముస్లిం మైనార్టీ సంఘాలు.
ఈ కార్యక్రమంలో పట్టణ టీఆరెఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్,కౌన్సిలర్ లు రజీయుద్దిన్,షకీల్ పట్వారీ,మైనార్ట నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సీజనల్ వ్యాధుల నియంత్రణ, మన ఊరు మన బడి కార్యక్రమం అమలు , దళిత బంధు   మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్


జగిత్యాల జూన్ 27:- జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి  సంబంధించిన అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ,
మన ఊరు మన బడి, దళిత బంధు పథకం,  సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం,  మొదలైన ప్రభుత్వ కార్యక్రమాల పై కలెక్టర్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 
సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో తీసుకుంటున్న చర్యల పై కలెక్టర్ చర్చించారు.  జిల్లాలో గ్రామాల్లో, పట్టణాల్లో డ్రైయినేజి లేని ప్రాంతాల్లో  నీరు నిల్వ అధికంగా ఉండటం వల్ల సమస్య ఉత్పన్నమవుతుందని, జిల్లాలో ఇప్పటి వరకు 5  డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. 
దోమల నియంత్రణ ద్వారా సీజనల్ వ్యాధుల వ్యాప్తి తగ్గిపోతుందని కలెక్టర్ పేర్కొన్నారు. దోమల నియంత్రణకు మున్సిపాలిటీలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రతి గ్రామం, ప్రతి మున్సిపల్ వార్డు లో ఇంటిటటి సర్వే నిర్వహించి సెప్టిక్ పైప్ లైన్ వద్ద దోమలు నివాసం వుండకుండా జాలీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మన ఊరు మన బడి కింద క్షేత్రస్థాయిలో గ్రౌండ్ అయిన పనుల వివరాలు అప్ లోడ్ కాకపోవడం కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 25 పాఠశాలలకు సంబంధించి పనులు గ్రౌండ్ అయినప్పటికీ ఫోటోలు అప్ లోడ్ చేయలేదని తెలిపారు.
జిల్లాలో ఉపాధి హామీ పనుల కు సంబంధించి 6.9 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఉపాధి హామీ పథకం కింద ప్రణాళిక సిద్ధం చేసిన పనుల ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
దళిత బంధు కింద మండలాల వారీగా క్షేత్రస్థాయిలో సర్వీస్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ , వ్యవసాయ సెక్టార్ లో గ్రౌండ్ పురోగతిపై ప్రతిరోజు నివేదికలు తెప్పించుకోవాలని, బ్యాంకుల నుండి నిధుల ఉపసంహరణకు ఎప్పటికప్పుడు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి వారం జిల్లాలో భవన నిర్మాణ అనుమతుల పై పర్యవేక్షించాలని, అక్రమ లే అవుట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కింద జిల్లాలో గుంతల తవ్వకాల పురోగతి పెరగాలని, వర్షాలు ప్రారంభమైన నేపధ్యంలో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించిన పీట్టింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణాల్లో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనులను ప్రతి రోజూ పర్యవేక్షించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కోరుట్ల మున్సిపాలిటీ లో మార్కెట్ నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణ పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో వైకుంఠ దామాలలో నీటి సరఫరా విద్యుత్ సరఫరా పనుల, కాంపౌండ్ వాల్ పురోగతి పై కలెక్టర్ చర్చించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్ .లత , ఇంచార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  వినోద్ కుమార్, ఆర్.డి.ఓ. జగిత్యాల మాధురి , జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


ప్రజావాణిలో 30 వినతులు!
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక  IMA హాల్ నందు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై 30 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ జి రవి స్వీకరించారు