వృద్ధుల సంరక్షణకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రంగారెడ్డి, కరీంనగర్ లలో 2 ఆశ్రమాలు నడుస్తున్నాయని, మరో 11మంజూరు చేశామని తెలిపారు.
సేవా దృక్పథంతో నడిపిస్తున్న ఆశ్రమాలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోస్సానిచ్చారు.
జూన్15.న ప్రపంచ వయో వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉప్పల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రంలో 2 వేల 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సుమారు 11లక్షల మందికి ప్రతి నెల రూ.2వేల 16చొప్పున అందజేస్తున్నామని కొప్పుల వివరించారు.

ఈ ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన కారణంగా వృద్ధులలో చాలా మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు 2007లో చేసిన చట్టాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, కోవిడ్ బారిన పడిన వారిని అన్ని విధాలా అందుకున్నాము అని మంత్రి ఈశ్వర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అసోసియేషన్ ప్రముఖులు నర్సింహారావు, వెంకటయ్య గౌడ్, నర్సింహారెడ్డి, ప్రతాపరెడ్డి, నర్సయ్య,హరి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి దేశానికి ఆదర్శం
అధ్బుతమైన ఫలితాలిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
బుధవారం కోడీమ్యాల మండలంలోని తూర్కాశీనగర్ గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి అనంతరం నమిలికొండ, నల్లగొండ గ్రామాల్లో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా జడ్పీ చైర్పర్సన్ ప్రజాప్రతినిధులతో పాల్గొన్నారు.

ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రత తో కళకలాడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో పాయనిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామాల ప్రగతి కి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల ఆభివృద్దే లక్ష్యంగా పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాబోయే వానాకాలం వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి కృష్ణారావు,ఎంపీపీ మేనేన్ని స్వర్ణలత రాజ నర్సింగారావు,ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపిటిసిలు,మల్యాలAMC ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, ఎంపిడిఓ పద్మజరాణి మరియు ఇతర ప్రజాప్రతినిధులు,అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

జైన సర్పంచుకు కన్నీటి వీడ్కోలు !
ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ జోగినిపల్లి ప్రభాకర్ రావు కు ప్రజలు, ప్రజా ప్రతినిధులు , అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు,అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. బీర్పూర్ ధర్మపురి సారంగాపూర్ మండలం నుంచి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, భారీగా తరలి వచ్చారు. ప్రభాకర్ రావు కుమారుడు సాయి కృష్ణ గోదావరి నది తీరంలో అంతిమ సంస్కారం నిర్వహించి చితికి నిప్పంటించారు.

అంత్యక్రియల్లో బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్ , డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి , టిఆర్ఎస్ నాయకుడు బండి మురళి, ప్రముఖ న్యాయవాది కొండపలకల వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
జగిత్యాల్ జిల్లా ధర్మపురి మండలంలోని జైన గ్రామ సర్పంచ్ జోగినపెళ్లి ప్రభాకర్ రావ్ కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కుమార్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ లను వేధిస్తున్న తీరు దారుణం అన్నారు. ప్రభుత్వ వేధింపులు తాళలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సర్పంచ్ ప్రభాకర్ రావు మృతి చెందాడని. లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.

గ్రామం లోని (చెరుకుపల్లె) చెరుకు శ్రీను,మల్లేష్ తండ్రి చెరుకు బోజయ్య ఇటీవల చనిపోవడం తో వారి
కుటుంబాన్ని లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.

ఎల్లమ్మకు పూజలు !
ధర్మపురి మండలంలోని దమ్మన్న పేట గ్రామంలో శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి కల్యాణం మరియు బోనాల పండుగ సందర్భంగా జగిత్యాల్ డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ స్థానిక రేణుక ఎల్లమ్మ దేవి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.
లక్ష్మణ్ కుమార్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగనభట్ల దినేష్, వేముల రాజేష్, ఎంపీటీసీ గంగాధర్, సతన్న, చిలుముల లక్ష్మణ్,.సీపతి సత్యనారాయణ, రఫియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు

రాయికల్ మండల అల్లి పూర్,కుర్మా పల్లి,ఉప్పు మడుగు,రాజ్ నగర్,అలియా నాయక్ తాండా,వస్తా పూర్, ఒడ్డెలింగాపూర్,చింతలూరు,మంత్యా నాయక్ తాండా,వడ్డెర కాలని,మూట పల్లి,రామోజీ పెట్,మహితా పూర్ గ్రామాల్లో పల్లె ప్రకృతి, వైకుంటధామం,కంపోస్ట్ షేడ్లను ప్రారంభించి గ్రామానికి చెందిన నర్సరీలు లను పరిశీలించి,అనంతరం గ్రామాలకు చెందిన 61 మంది లబ్ది దారులకు సీఎం సహాయ నిది ద్వారా 23లక్షల18 వేల రూపాయల విలువగల చెక్కులను,29 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 29లక్షల 3 వేల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమం లో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్ ,AMC ఛైర్మెన్ రాజీ రెడ్డి,.PACS ఛైర్మెన్ లు రాజ లింగం, ఏనుగుమల్లారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, మండల పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్, మండల కో ఆప్షన్ ముఖీధ్, ఎంపీడీవో సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పరామర్శ !
బీర్పూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మ్. రమేష్ సమీప బంధువు, భూదేవి శంకరయ్య బుధవారం మృతిచెందగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజిరెడ్డి, సుభాష్ ల ను పరామర్శించి ఓదార్చారు.

ప్రోత్సాహకాలు అందజేత !
జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 4 గురు కులాంతర వివాహం చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రోత్సహక బాండ్ 2.5 లక్షలను ఈరోజు లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ భోగ శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,.DSDO రాజ్ కుమార్, కమిషనర్ స్వరూప రాణి, అధికారులు అంజయ్య, కృష్ణ ,కౌన్సిలర్ లు బాలే లత శంకర్, రజీయొద్దిన్,నాయకులు ఆనంద్ రావు,రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
