అమర్నాథ్ లో ఆకస్మిక వరదలు., 10 మంది మృతి !

పలువురు గల్లంతు, మృతుల సంఖ్య పెరగవచ్చు!

జమ్మూకాశ్మీర్ లోని అమర్నాథ్ క్షేత్రంలో ఆకస్మిక వరదలు రాగ అందులో చిక్కుకుని ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్టు సమాచారం ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా లు అక్కడి లెఫినెట్ గవర్నర్ మనోజ్ సినహా పరిస్థితిని సమీక్షిస్తు సహాయక చర్యలకు పర్యవేక్షిస్తున్నారు

. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తుండగా.. హెలికాప్టర్ ద్వారా బాధితులను తరలించేందుకు ITBP, SDRF, NDRF తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. అనేకమంది ఆచూకీ తెలియడం లేదు. సాయంత్రం 5-30 నిమిషాలకు ఒకేసారి మేఘాలు పేలినట్టు కుండపోతవర్షం కురవడంతో పాటు, ఉదృతంగా వరదలు రావడంతో టెంట్లు, లంగర్లు కొట్టుకొని పోయాయి గుడారాల్లో ఉన్న పలువురు గల్లంతయినట్టు అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందించారు.

ఈరోజు భగవతీ నగర్ యాత్రిక నివాస, నుంచి సిఆర్పిఎఫ్ బలగాల మధ్య 249 భారీ వాహనాల కాన్వాయ్ ల లో. 6,159 మందు యాత్రికులు లోయలోకి చేర్చారు. వీరిలో 4,754 మంది పురుషులు, 1220. మంది మహిళలు, 35 మంది పిల్లలు, 139 మంది సాధువులు 12 మంది మహిళా సాధువులు, ఉన్నట్టు రికార్డులో నమోదు చేశారు. బాలతల్ ద్వారా 95 వాహనాలలో ఉదయం 3.30 నిమిషాలకు 2,037 మంధి యాత్రికులు ,భగవతీ నగర్ యాత్రిక నుంచి బయలుదేరారు.

రెండవ విడత 154 వాహనాల కాన్వాయ్ లో 4,122 మంది యాత్రికులు పలల్లవ్ కు చేరుకున్నారు. జూన్ 29 నుంచి మంచు లింగాన్ని 63,487 మంది భక్తు దర్శించుకున్నట్టు ఆయా బేసిక్ క్యాంపుల్లో నమోదైన రికార్డుల వివరాలు తెలియజేస్తున్నాయి. అమర్నాథ్ యాత్ర ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేశారు రేపు పరిస్థితిని అంచనావేసి ,వాతావరణ పరిస్థితి , సహాయక చర్యలు, తదితర రక్షణ చర్యలు అంచనావేసి కొనసాగించడం వాయిదా వేయడం అధికారికంగా ప్రకటన వెలబడుతుంది.
రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. వరదల సమయంలో గుహ పరిసరాల్లో 12వేల మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు గుహల్లో క్షేమంగా ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటవాలుగా ప్రవాహం ఉదృతం కావడంతో గుడారాలు లో ఉన్న భక్తులు భక్తులు కొంతమంది గల్లంతు అయినట్టు అధికారులు భావిస్తున్నారు .

వైద్యానికి ఐదు లక్షల ఎల్ఓసి అందజేత!

బీర్ పూర్ మండల కందేన కుంట గ్రామానికి బద్ధి సత్తవ్వ కు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వైద్య నిమిత్తం సీఎం సహాయం నుంచి ₹ 5 లక్షల LOC ని అందించారు. మెదడు సంబంధిత సమస్యతో శస్త్ర చికిత్స నిమిత్తం ఈ ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే .మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని,గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ఆరోగ్య సమస్యలతో శస్త్ర చికిత్స లు చేసుకొని,చేసుకున్న వారు ఆర్థికంగా నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి సహయనిధీ ఒక వరంలా మారిందని అన్నారు..విద్య వైద్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని అన్నారు.
LOCమంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపిన సత్తవ్వ కుటుంబ సభ్యులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


జగిత్యాల పట్టణంలో రానున్న బక్రీద్ పండుగ పర్వ దినం పురస్కరించుకొని ఖిల్లా లో ప్రార్థనల కోసం పారిశుధ్య పనులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు.
వారితో పాటు ఈద్గా కమిటీ చైర్మన్ MIM అధ్యక్షుడు , మజ్లిస్ నేత యూనుస్ నదీం, స్థానిక కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్, ,పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్,. మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్,మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


టిఆర్ఎస్ లో చేరికలు!
రాయికల్ మండల వీరాపుర్ గ్రామానికి చెందిన ఇంద్రాల నిశంత్ అధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆకర్షితులై పార్టీ లో చేరారని,పల్లె ప్రగతి ద్వారా పల్లెల రూపు రేఖలు మారాయని అన్నారు.
వీరా పూర్ గ్రామానికి చెందిన నల్ల వినోద్ కు దళిత బందు పథకం ద్వారా మంజూరు అయినా మారుతి కార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారునికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందించారు.
తాల్ల గంగుకు సీఎం సహాయ నిది ద్వారా మంజూరు అయిన 1 లక్ష రూపాయల చెక్కును కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్ ,జిల్లా ఎంపిటిసిల పోరం అధ్యక్షులు దొంతి నాగరాజు,సర్పంచ్ నీలి చిన్న మల్లయ్య,ఉప సర్పంచ్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.


బోనాల జాతర!
బీర్ పూర్ మండల రేకుల పల్లి గ్రామంలో గంగమ్మ బోనాల జాతర కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో
సర్పంచ్ లక్ష్మి,కోలుముల రమణ, మెరుగు రాజేశం,
శ్రీనివాస్ రావు, వంశీ, అజిత్ రావు, సుశీన్, గాజర్ల రామచంద్రం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామంలో గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, బోనం ఎత్తుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్ల గంగ నర్సు రాజన్న,ఉప సర్పంచ్ పద్మ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.


జగిత్యాల పట్టణంలో 26 మంది ఆడ బిడ్డలకు షాది మూభారక్ పథకం ద్వారా మంజూరైన ₹ 26 లక్షల 3వేల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి స్వయంగా అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి ఆనందరావు,ఉపాధ్యక్షులు దుమల రాజకుమార్, మైనార్టీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్,నాయకులు బాలే శంకర్,సమిండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు పంబల రాము, శివ కేసరి బాబు మేక పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులకు సన్మానం…
లయన్స్ క్లబ్ ధర్మపురి ఆధ్వర్యంలో 10GPA వచ్చిన ధర్మపురి మండల మరియు వివిధ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సన్మానం చేశారు. Dr రామకృష్ణ mjf గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిలుగా CI బిళ్ళ కోటేశ్వర ,మున్సిపల్ ఛైర్మెన్ సంగి సత్తమ్మ , వైస్ చైర్మన్ ఇందరపు రామన్న , ZPHS. హెడ్ మాస్టర్ చెరుకు రాజన్న ZC చుక్క భీమరాజు . ప్రోగ్రాం చైర్మన్ గా జక్కు రవీందర్ వ్యవహరించారు… CI బిళ్ళ కోటేశ్వర్ గారు 10GPA వచ్చిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, విద్యార్థుల గెలుపు వెనుక ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల కృషి చాలా ఉంది అని కొనియాడారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ వారి కృషిని గుర్తుచేసుకుంటు లయన్స్ క్లబ్ సేవలను కొనియాడారు. మరియు లయన్ సంగణబాట్ల దినేష్ ఒక విద్యార్థికి ₹ 5000 రూపాయలు ప్రోత్సాహకం అందించారు. ఇందులో అధ్యక్షుడు లయన్ Dr రామకృష్ణ mjf , ZC లయన్ చుక్క భీమరాజు , DC లయన్ జక్కు రవీందర్ సెక్రటరీ లయన్ పైడి మారుతి . ట్రెసరర్ లయన్ సిరుపతి రాజన్న , లయన్ జక్కు దేవేందర్ , లయన్ సర్జరావు లయన్ రంగ హరనాథ్ , లయన్ దినేష్ , లయన్ ఇంటారపు రామన్న , లయన్ కొండ వినయ్ , లయన్ సాయిని శ్రీనివాస్, లయన్ I రాంకిషన్ , లయన్ పెద్దిశివ పాల్గొన్నారు.