రాజ్యాంగ నిర్మాత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.. బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో బుధవారం మంత్రి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

గ్రామంలో.₹ 36 లక్షల తో సిసి రోడ్లు, యాదవ సంఘం కంఫౌడ్ వాల్, పల్లె ప్రకృతి వనం. తదితర అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీర్ సాని గ్రామంలో పలు అబివృద్ధి కార్యక్రమంలో భాగంగా 43 లక్షల రూపాయలతో పలు. C.C రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాన్ని, పల్లె ప్రకృతి వనం తదితర అభివృద్ధి పనులను మంత్రి . కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.

చేరికలు !
బీర్సాని గ్రామం లో పలు పార్టీల నుండి మహిళలు, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరడం జరిగింది.

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి !
ధర్మపురి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, బాబు జగ్జీవన్ రావ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఎడ్ల చిట్టిబాబు , జడ్పిటిసి శ్రీమతి బత్తిని అరుణ , పిఎసిఎస్ జైన సింగిల్ విండో చైర్మన్ సౌల్ల నరేష్ , అధికారులు , మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఐనాల ప్రవీణ్ కుమార్ , మండల పంచాయత్ అధికారి ఉప్పారపు నరేష్ కుమార్ , మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.