జగిత్యాల జులై 9:- జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల కలెక్టర్ శనివారం జిల్లా ఎస్పీతో కలిసి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఓవర్ ఫ్లో అవుతున్న రోడ్డులు, బ్రిడ్జిలను గుర్తించి వెంటనే మూసివేయాలని, వాహనాల రవాణా జర్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాల వల్ల పడిపోయే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలని, ట్రాఫిక్కు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
భారీ వర్షాల వల్ల విద్యుత్ తీగలు స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని, ఆ పరిస్థితులలో విద్యుత్ సరఫరా నిలిపివేసి త్వరితగతిన విద్యుత్ రిస్టోర్ పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో 2,3 రోజులపాటు నిరంతరం వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మట్టి నిర్మాణాలు, బలహీనంగా ఉన్న నిర్మాణాలలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లాలో బ్రిడ్జిలు, రోడ్లపై ఊర్లో అవుతున్న నీటిలో యువత చేపలు పట్టడానికి వెళ్లే అవకాశం ఉందని, దీనివల్ల తీవ్ర ప్రమాదాలు జరిగే నేపథ్యంలో నిరోధించడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని చెరువులో నీటి వనరుల వద్ద అవసరమైన రోప్, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న చెరువుగట్టులను, వాగులో నీటి ప్రవాహాలను నిరంతరం పరిశీలించి సమాచారం అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గత సంవత్సరం భారీ వర్షాల వల్ల ప్రమాదవశాత్తు కొంత ప్రాణ నష్టం జరిగిందని, ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రతి గంటకు పరిస్థితులపై నివేదిక తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలో 4 కంట్రోల్ రూమ్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
కలెక్టరేట్ జగిత్యాల — 918724222841,.
ఆర్ డి.ఓ. జగిత్యాల—7702492610,.
ఆర్ డి.ఓ. మెటపల్లి—9000068092,.
ఆర్.డి.ఓ. కొరుట్ల 9985252016
టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ చేపల వేటకు ప్రస్తుత పరిస్థితిలో అనుమతించవద్దని అధికారులకు సూచించారు. జిల్లాలోని నేటి ప్రవాహం ఉన్న వంతెనల వద్ద ఎట్టి పరిస్థితిలో వాహనాల రవాణాకు అనుమతించవద్దని , నేటి ప్రవాహం అధికంగా ఉన్న వంతెనలు రోడ్ల వద్ద భారీ తేటలను ఏర్పాటు చేసి రవాణా నిలిపివేయాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఏ.సి.ఎల్.బి. అరుణశ్రీ, ఆర్.డి.ఓ.లు , జిల్లా అధికారులు, తసీల్దార్లు, తదితరులు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఉధృతిని పరిశీలిస్తున్న కలెక్టర్ ఎస్పీ
నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలతో ధర్మపురి ప్రధాన రహదరిపై అనంతారం రొడ్డం బ్రిడ్జి వద్ద వరద నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రవి, జిల్లా ఎస్పీ సింధూ శర్మ, ఆర్డీవో మాధురి ఇతర అధికారులు,
భారీ వర్షాల కారణంగా
ఈద్గా,ఖిలా ఈద్గా లో బక్రీద్ నమాజు రద్దు
సెంట్రల్ ముస్లిం కమిటీ తీర్మానం
జగిత్యాల జిల్లా.
సెంట్రల్ ముస్లిం కమిటీ సమావేశం శనివారం మధ్యాహ్నం నిర్వహించారు ,ఈ సమావేశంలో ముస్లిం కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బారి అధ్యక్షతన వహించారు,
భారీ వర్షాల కారణంగా ఈద్ ఉల్ అజహ బక్రీద్ పండగ సందర్భంగా కమిటీ సభ్యులతో చర్చలు జరిపారు
ఈ సందర్భంగా ఈద్ ఉల్ అజహ నమాజు జమే మసీద్ లో ఉదయం 7.00 గంటలకు మత గురువు ముస్తాక్ అహ్మద్ ప్రత్యేక నమాజ్ నిర్వహిస్తారు, రెండవసారి 8 గంటలకు నమాజు నిర్వహించాలని నిర్ణయించారు,
భారీ వర్షాల కారణంగా జిల్లా కేంద్రంలోని ఆయా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని సెంట్రల్ కమిటీ నిర్ణయించారు,
ఈ సమావేశంలో సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు భారీ, ప్రధాన కార్యదర్శి మంజూర్, ఈద్గా కమిటీ అధ్యక్షుడు జుల్ఫిహాఖర్, ఉపాధ్యక్షుడు జమీర్, ఖిల్లా ఈద్గా అధ్యక్షుడు యూనిస్ నదీమ్ ఉపాధ్యక్షుడు జహీర్ఉద్దీన్ కమిటీ ప్రధాన కార్యదర్శి సఫీ ఉద్దీన్, ఇర్ఫాన్ జాఫర్ రషీద్ ,సాజిద్ ,జిల్లా కేంద్రంలోని మసీద్ అధ్యక్షులు, సెంట్రల్ ముస్లిం కమిటీ సభ్యులు పాల్గొన్నారు,