చిన్నారుల బాల్యాన్ని కాపాడుదాం -ఎస్పీ శ్రీమతి సింధు శర్మ!

జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్- 8 విడతలో భాగంగా జిల్లాలకు చెందిన పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ ప్రోటక్షన్, రెవన్యూ, విద్యా, వైద్యా, లేబర్, పరిశ్రమలు మరియు ఏన్.జి.ఓ విభాగాలకు అధికారులతో జిల్లా ఎస్పీ గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2015 సంవత్సరం నుండి విడతలుగా జనవరి, జులై నెలలో ఆపరేషన్ స్మైల్ , ముస్కాన్ నిర్వహిస్తునమని తెలుపారు. ఆపరేషన్ ముస్కాన్ కి సంబదించి నోడల్ ఆఫీసర్ గా అదనపు ఎస్పి వ్యవహరిచడం జరుగుతుంది అని, ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించి, చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నామని వివరించారు. తప్పిపోయిన, వదిలేయబడిన, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న, బాల కార్మికులుగా పనిచేస్తున్న 18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఎక్కడైన బాలకార్మికులను గుర్తిస్తే పోలీస్ లేదా 1098 నంబర్ కు సమాచారాన్ని అందించే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు., ముఖ్యంగా ఆయా రంగాల్లో పనిచేసే బాలకార్మికులను గుర్తించి వారిని వెట్టిచాకీరి నుండి విముక్తి కలిగించాలని, ముఖ్యంగా చిన్నారులతో వెట్టిచాకిరి చేయించుకోవడం చట్యరీత్యానేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు


అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడుతూ, బాలల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణంలో సమాజంలోని ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలను పనిలో పెట్టుకోవడం చట్టవ్యతిరేకమని అవగాహన కల్పించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాని పోలీస్ శాఖ వారితో సమన్వయము చేసుకుంటూ వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడాలి సూచించారు. బాల కార్మికుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడం ఒక ప్రధాన అంశముగా చేసుకోవాలని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా రెస్క్యూ చేసిన పిల్లలకు ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న చూసుకోవాలని DM &HO గారి కి సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ B.S లత, అదనపు ఎస్పి రూపేష్ , బాలల సంక్షేమ సమితి చైర్మన్ ధనలక్ష్మి DM &HO శ్రీధర్, DCPO హరీష్ , DWO నరేష్ DCRB DSP రవీంద్ర కుమార్ , CCS ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ IT కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, ఉమెన్ డెవలప్మెంట్&చైల్డ్ వెల్ఫేర్ హరీష్ లేబర్ డిపార్ట్మెంట్ నుండి రాజేశ్వరి,ఎస్.ఐ సుదీర్ రావు, రహీమ్, రవీందర్ , చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నుండి శ్రవణ్ అండ్ టీం, జగిత్యాల, మెట్పల్లి సబ్ డివిజన్ల ఆపరేషన్ ముస్కాన్ బృందాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


జగిత్యాల కు చెందిన PFI నాయకుడి అరెస్ట్ !
నిషేదిత సీమి ఉగ్ర సంస్థకు ప్రతిరూపంగా భావించే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు నిజామాబాద్‌ ను అడ్డాగా చేసుకున్నారు. అమాయక యువతకు కరాటే పేరుతో శిక్షణ ఇస్తున్నారు.
దాదాపు 200 మందికి ఈ ముఠా శిక్షణ ఇచ్చిందని తేలింది. ముగ్గురు పీఎఫ్‌ఐ సభ్యులను నిజామాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేలా మతోన్మాదాన్ని నూరిపోస్తోంది ఈ ముఠా. ఈ మేరకు నగర సీపీ నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.
మత కల్లోలాలు సృష్టిస్తూ దేశాన్ని అస్థిర పరిచేందుకు తెలుగురాష్ట్రాల్లోని యువతకు శిక్షణ ఇస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా కన్వినర్ షాదుల్లా, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ అబ్ధుల్ మోబిన్‌ లను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ఈనెల 4న జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతానికి చెందిన అబ్ధుల్ ఖాదర్‌ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఖాదర్ కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి తిరిగి వచ్చి నిజామాబాద్ ఆటో నగర్‌ లో ఇంటిని నిర్మించి దానిపై భాగంలో యువతకు కరాటే శిక్షణ పేరిట ఈ శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. దీనికి షాదుల్లా నిధులు సమకుర్చాడని, నలుగురిని కోర్టు అనుమతితో విచారణ నిర్వహించి మరిన్ని వివరాలు రాబడుతామని తెలిపారు. ఖాదర్ ఇప్పటి వరకు ఆంధ్ర, తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన యువతకు శిక్షణ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో ఈ ముఠా కార్యకలపాల వెనుక ఎవరి హస్తం ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు సీపీ అన్నారు.
ఎంపీ ఆగ్రహం!
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీపీ నాగరాజుపై ఫైరయ్యారు. కేంద్ర నిఘావర్గాలు సమాచారం ఇస్తేనే పీఎఫ్ఐ సభ్యుల అరెస్టులను తప్పక చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో దాడులు చేయించేందుకు సీపీ.. వీటి వెనుక ఉండి నడిపిస్తున్నారని అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం అతన్ని నిజామాబాద్‌ కు తీసుకొచ్చిందని విమర్శించారు.


గోరింట వేడుకలు!
రాయికల్ మం. ఇటిక్యాల గ్రామంలో మహిళా సంఘం అధ్వర్యం నిర్వహించిన ఆషాడ మాసం గోరింటాకు వేడుకల్లో హాజరైన రాయికల్ జెడ్పీటీసీ జాదవ్ అశ్విని మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ ధరల పెంపును నిరసనలు !

పెగడపల్లి లో…
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ.. పెగడపల్లి మండల కేంద్రంలో తెరాస మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెగడపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లోకమల్లారెడ్డి , వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్ , మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలని పీల్చి పిప్పి చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. అన్ని విధాలుగా అస్త వ్యస్థ జీవనాన్ని అనుభవిస్తున్నారు. అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మెరుగు శ్రీనివాస్ .కె రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు


వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి.!
జగిత్యాల – పెద్ధపెల్లి రహదారి పై కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంపుకు నిరసనగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం మానవత్వం లేని మోడీ ప్రభుత్వమని, నేడు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.50 కు పెంచిందని విమర్శించారు. మోడీ అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న వంట గ్యాస్ ధర ఇప్పుడు రూ. 1105 పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈకార్యక్రమంలో అర్బన్ జెడ్పీటీసీ మహేష్ రూరల్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,పాక్స్ చైర్మన్ సందీప్ రావు,రైతు బంధు కన్వీనర్లు నక్క రవీందర్ రెడ్డి,జుంబర్తి శంకర్,రూరల్ మరియు అర్బన్ మండలాల సర్పంచ్లు,ఎంపిటిసిలు,ప్రజా ప్రతినిధులు,నాయకులు,యువజన విభాగం నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


జగిత్యాల పట్టణంలో !
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద జగిత్యాల జిల్లా తెరాస ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్.
చైర్పర్సన్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలని పీల్చి పిప్పి చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. అన్ని విధాలుగా అస్త వ్యస్థ జీవనాన్ని అనుభవిస్తున్నారు. మొన్నటికి మొన్న పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రబవం రవాణా వ్యవస్థ మీద పడి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్స్,కో అప్సన్ సభ్యులు,పార్టీ ఉపాధ్యక్షులు ఓల్లే మల్లేశం,ధూమల్ల రాజుకుమార్, ఆనందరావు, మహిళలు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


బుగ్గారంలో….
బుగ్గారం ఎక్స్ రోడ్ వద్ద పెరిగిన సిలిండర్ ధరలు సామాన్యుడు తట్టుకునే సరిచేయలని తగ్గించాలని ధర్నా కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించడం జరిగింది. కావున మండల వైస్ ఎంపీపీ జోగినిపెళ్లి. సుచిందర్ గారు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు, ఎంపిటిసి లు,కార్యకర్తలు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


ధర్మపురిలో..
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు టిఆర్ఎస్ శ్రేణులుధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ, ఎంపీపీ చిట్టిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యో రాజేష్ కుమార్, రైతు సమన్వయ కమిటీ నాయకుడు సౌల భీమయ్య, టిఆర్ఎస్, నాయకులు కౌన్సిలర్లు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్,


బాబాజీ పల్లె పాఠశాలకుడ్యూయల్ డేస్కుల పంపిణీ!
జగిత్యాల మండలం బావాజీ పల్లె ,ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు అదే పాఠశాలలో పనిచేయుచున్న ప్రధాన ఉపాధ్యాయులు వొడ్నాల రాజశేఖర్ మరియు సహోపాధ్యాయురాలు బుర్ర రేఖ- కిషోర్ లు ₹ 40 వేల విలువ గల10 డ్యూయల్ డెస్కులు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుర్ర ప్రవీణ్, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ తూర్పాటి రవి, యూత్ అధ్యక్షులు నరేష్ గ్రామ పెద్దలు గంగ నీలయ్య, ప్రకాష్ ,రాజన్న ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.,