కలెక్టర్ ఎస్పీలు,
వరద ప్రాంతాల పర్యటన!


జగిత్యాల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలు, వరదల నేపథ్యంలో సోమవారం పలు లోతట్టు ప్రాంతాలను జగిత్యాల కలెక్టర్ రవి, ఎస్పి సింధు శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద గోదావరి నీటి ఉద్రితిని జగిత్యాల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సింధు శర్మ తో పాటు ఆర్డీవో మాధురి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. వర్షాలకు ధర్మపురి మండలం నాగారం గ్రామంలో లో పాత పెంకుటిల్లు కూలిపోగా ఇంటిని కలెక్టర్ పరిశీలించారు.


ఎమ్మెల్యే సంజయ్ పర్యటన !
బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన కలమడుగు చిన్న చంద్రయ్య గారి ఇల్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కులిపోగా వారిని పరామర్శించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తామని, ధైర్యంగా ఉండాలని తెలిపి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామానికి చెందిన అల్లకొండ మహేష్ కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹ 60,000/- రూపాయల చెక్కును వారి ఇంటికి వెళ్లి స్వయంగా అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్


ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ కొల్ముల రమణ, గ్రామ సర్పంచ్ గర్శకుర్తి శిల్ప-రమేష్, ఉపసర్పంచ్ హరీష్, వార్డ్ సభ్యులు మరియు ,గ్రామ శాఖ అధ్యక్షులు పుడురి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.


ప్రజా ప్రతినిధులకు చెక్ పవర్ !
జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ మరియు ఎంపీపీ లకు చెక్ పవర్ వచ్చిన సందర్భంలో వారి వివరములు ఆన్లైన్ లో పొందుపరచిన తర్వాత వారికి డిజిటల్ టోకెన్స్ నీ అందజేసిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ . అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ మరియు ఎంపీపీ లు చెక్ పవర్ ఇచ్చినందుకు ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి, జిల్లాలోని

శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, మరియు ప్రత్యేక కృషి చేసిన నిజాంబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు కృత్ఞతలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు Dpo హరి కిషన్, జెడ్పీ సీఈవో సుందర వరధరజన్, తదితులున్నారు.
ఎమ్మేల్యే క్వార్టర్స్ లో జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ ,మరియు జిల్లా ఎంపిపిలకు, చెక్ పవర్ వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ను కలిశారు.

సంజయ్ మౌనధీక్ష 10నిమిషాలు కూడా కొనసాగలేదు మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: మౌనధీక్ష అంటూ హడావుడి చేసిన సంజయ్ పట్టుమని 10నిమిషాలు కూడా కూర్చోలేదని, కేసీఆర్ పై నోరు పారేసుకుని ప్రజల ఛీదరింపులకు గురయ్యారని ఈశ్వర్ వ్యాఖ్యానించారు
బిజెపి నాయకులు ఎప్పుడేం మాట్లాడుతరో, అసలెందుకు మాట్లాడుతరో,ఎవరేమి మాట్లాడుతరో బోధపడ్తలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించారు. సోమవారం పత్రికా ప్రకటనలో మంత్రి ఈశ్వర్ బిజెపి పై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా బదులివ్వకుండా, అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వీళ్లకు క్షుద్ర రాజకీయాలు చేయడం తప్ప, రాష్ట్ర బాగోగుల గురించి ఏ మాత్రం కూడా పట్టింపు లేదని, ప్రకటనలు పేర్కొన్నారు. కేంద్రం నుంచి రూపాయి కూడా తెచ్చే తెలివి లేదని ఆయన మండిపడ్డారు. తమకు గిట్టని నాయకులపై ఐటి, ఇడి, ఐబి, సిబిఐలను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసి లొంగదీసుకోవడం..ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను పడగొట్టడమే ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఒక పనిగా పెట్టుకున్నదని నిశితంగా దుయ్యబట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి, ఇప్పుడు తాజాగా గోవాలో కాంగ్రెసు లెజిస్లేటివ్ పార్టీని నిలువునా చీల్చినది మీరు కాదా?.అని బిజెపి నేతలను కొప్పుల నిలదీశారు. .ప్రజాస్వామ్యమంటే బిజెపి నాయకులకు కనీస గౌరవం లేదని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. సంజయ్ మాటలు, చేష్టలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రజలేమనుకుంటారన్న కనీస జ్ఞానం లేకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారని ఈశ్వర్ ప్రకటనలో పేర్కొన్నారు. . బిజెపికి తెలంగాణ ప్రజల కనీస మద్దతు లేదని,.గత అసెంబ్లీ ఎన్నికల్లో 107సీట్లలో డిపాజిట్లు కోల్పోవడమే ఇందుకు ప్రబల నిదర్శన అని పేర్కొన్నారు. బిజెపి నాయకులు పగటి కలలు కనొద్దని, రాష్ట్రంలో ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా మీ పార్టీ అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. బిజెపి నాయకులు టిఆర్ఎస్ ను, కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత ధూషణలకు పాల్పడుతున్నారన్నారు. దేశకాల పరిస్థితులు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల పట్ల లోతైన అవగాహన ఉన్న దార్శనికులు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టున్న కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని, యావత్ దేశమిప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నదని మంత్రి కొప్పుల వివరించారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్ వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలి.
సి ఐ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి
1కతెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (CITU) దేశ వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు చేసిన పోరాటాలు ఫలించాయి. అంగన్వాడీలు కార్మికులేనని, చట్టబద్ద సౌకర్యాల పరిధిలోకి వస్తారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే వీరికి గ్రాట్యుటీ వర్తింప చేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమలు కోసం దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. సుప్రీం కోర్టు తీర్పు అమలుతో పాటు 45వ IL.C | ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు అమలు చేయాలని, రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సి ఐ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి డిమాండ్ చేశారు .సోమవారం జూలై 11న ఆలిండియా డిమాండ్స్ డే సందర్బంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రజిత ,ప్రధాన కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి పాల్గొన్నారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
2022 ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు అంగన్వాడీ ఉద్యోగులకు అనుకులంగా తీర్పునిచ్చింది. గ్రాట్యుటీ చట్టంలోని “వేతనాలు” నిర్వచనం చాలా విశాల ప్రాతిపదికలో ఉన్నదని, డ్యూటీలో ఉన్న ఉద్యోగికి వచ్చే ప్రతిఫలం వేతనం కిందికి వస్తుందని చెప్పింది. అందువల్ల అంగన్వాడీలకు చెల్లించే గౌరవవేతనం కూడా వేతనం నిర్వచనం. కిందికే వస్తుందని చెప్పింది.

కావున వేతనాలు పొందుతున్న అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని చెప్పింది. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 1(3)(సి)ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 1997 ఏప్రిల్ 3న విద్యా సంస్థలను ఎస్టాబ్లిష్మెంట్లుగా పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది అని తెలిపారు .
. ఐసిడిఎస్ ప్రైవేటీకరణ ఆపాలి., ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లత కు వినతి పత్రాన్ని అందచేశారు .ఈ కార్యక్రమంలో అసోసియేన్ జిల్లా అధ్యక్షురాలు ,రజిత ,ప్రధానకార్యదర్శి శైలజ ,ఉపాధ్యక్షురాలు మాధవి ,నిర్మల స్వరూప రాణి ,సులోచన ,జిల్లా కన్వీనరు తిరుపతి నాయక్ ,కో కన్వీనర్ రాజలింగం , మణెమ్మ ,నాగమణి ,భాగ్యలక్షిమీ ,వనిత ,శారదా ,సౌజన్య ,సత్తమ్మ ,రజిత తో పాటు పెద్ద మొత్తంలో అంగన్వాడీ టీచర్లు ,ఆయాలు ,తదితరులు పొల్గొంన్నారు .