ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.Surender Kumar,
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ. ప్రధానంగా ఈ అంశాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలంటూ పలు అంశాలు డిమాండ్ చేశారు.
- ధరణి లోపల అనేక పొరపట్లు ఉన్నాయి
- భూ యజమాన్యపు హక్కుల ను నైజాం పాలన లో చట్టలు గా రూపొందించి కాలక్రమేణా మార్పులు చేసుకుంటు వచ్చాం
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టాల ను సరళీకృతం చేసే ఉద్దేశ్యం తో కొత్త పాస్ బుక్ ల ని రూపొందించింది
- ధరణి అమలు లో కి వచ్చిన తర్వాత జరిగిన పొరపట్లని సరిదిద్దే అవకాశం పూర్తిగా రెవెన్యూ అధికారులు కోల్పోయారు
- ధరణి లో చాలా పొరపట్లు ఉన్నాయి
- ధరణి లో జరిగిన పొరపట్ల కు 90 శాతం సంబంధిత రెవెన్యూ అధికారులే బాద్యులు
- రైతులకు ధరణి లో జరిగిన తప్పుల కు సరిదిద్దునే ఎలాంటి అవకాశం లేదు
- గతంలో భూ యాజమాన్య హక్కులలో ఎలాంటి పొరపట్లు జరిగిన రెవెన్యూ అధికారులు పరిష్కారించే వారు
- భూ అక్షాంశా- రేఖాంశాలతో భూ యాజమాన్య సమస్యలు పరిష్కరిస్తామని కనిసమ ఒక సేర్వేయర్ ను నియమించలేదు కేసీఆర్
- ధరణి లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాడానికి కొత్తగా రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
- రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిర్వహించడానికి చట్టం లో ఏమైనా మార్పులు తెచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
- మీరు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో జిల్లా పాలన అధికారికి, రెవెన్యూ డివిజనల్ అధికారుల కు ధరణి లో జరిగిన తప్పుల సరిదిద్దుకునే అధికారలు ఇవ్వండి
- ధరణి లో జరిగిన తప్పుల ను సరిద్దిదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 రెవెన్యూ కోర్ట్ ల ను ఏర్పాటు చేయండి
- ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారుల, యంత్రాంగం చేసిన తప్పుల ను ఒప్పుకొని రెవెన్యూ సదస్సుల ను నిర్వహించడం సంతోషం
- వివాదాస్పద భూ సమస్యల ను పరిష్కరించడానికి రెవెన్యూ కోర్ట్ ల ను 33 జిల్లాల్లో ఏర్పాటు చేయండి.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం నాయకులు బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు.