ధర్మపురి ఆలయం పేరిట ₹ 4 కోట్ల డిపాజిట్!       

J. Surender Kumar,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పేరిట  బ్యాంకుల్లో ₹ 4, కోట్ల 2లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్టు కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ₹ 1. కోటి 20 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయగా. మొత్తం డిపాజిట్ రూపాయలు ( జనరల్ మరియు అన్నదానం) కలుపుకొని  మొత్తం వివిధ బ్యాంకుల్లో ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 2019 నుంచి నేటి వరకు డిపాజిట్లు మొత్తం. అని ప్రకటనలో పేర్కొన్నారు.

అర్చకులు సిబ్బంది  పదవి విరమణ తరువాత  పెన్షన్ సౌకర్యం లేనందున 2015 సంవత్సరం నుంచి వారి. పేరున ఈపీఎఫ్ (EPF) డబ్బులు   జమ చేసినట్టు వివరించారు.  దీంతో పదవీ విరమణ తర్వాత వారికి పెన్షన్ లభిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తికానున్నట్టు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో శివాలయంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నట్టు  ప్రకటనలు కార్యనిర్వహణాధికారి వివరించారు.

అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు – కలెక్టర్ జి.రవి.

జిల్లాలో అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి.రవి చేశారు,,జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు  2022-24 సంవత్సరానికి గాను ప్రభుత్వం జర్నలిస్టులకు అందజేస్తున్న అక్రిడేషన్ కార్డులకు సంబంధించి మొదట విడత అక్రిడేషన్ కమిటి సభ్యులతో ఏర్పాటు వేసిన రెండవ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న  అక్రిడేషన్ కార్డులను జర్నలిస్టులందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.   సమాచార శాఖ అధికారులు, కమిటీ సభ్యుల సమన్వయం తో పారదర్శకంగా,  మొదట విడతలో *429* మంది అర్హులైన జర్నలిస్టులకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

మొదటి విడతలో ఎంపికైన జర్నలిస్టులకు త్వరలో కార్డులను అందచేస్తామని, రెండవ విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు..
అనంతరం కమిటీ సభ్యులు అందరూ కలిసి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా శాలువా మరియు పూల బొకేతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో పౌర సంబంధాల అధికారి వి.శ్రీధర్ , కమిటీ సభ్యులు పి.రంగారావు, జె. సురేందర్ కుమార్, జి.రాంగోపాల్, ఎం.డి. సాజిద్ అలీ, సోమా జీవం రెడ్డి,డి. అంజు గౌడ్, డి. శ్రీనివాస్, ఏ. జనార్దన్,  తదితరులు పాల్గొన్నారు.


రోడ్డు ప్రమాదం.,  ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి


బుగ్గారం మండలం వెల్గొండ  గ్రామానికి చెందిన పూదరి గంగాధర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ రోజు సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వెలుగొండ నుండి సాయంత్ర తన కొడుకుతో కలిసి ద్విచక్రవాహనంపై జగిత్యాల కు వెళ్తుండగా కల్లెడ శివారులో ఎదురుగా వస్తున్న మరొక మోటార్ సైకిల్ ఢీ కొట్టింది. దీనితో తీవ్ర గాయాలై గంగాధర్ మృతిచెందారు. కొడుకు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. వెలుగొండ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు పూదరి గంగాధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా బుగ్గారం మండలంలోని గోపులాపూర్ ప్రభుత్వ హై స్కూల్ లో పనిచేస్తున్నారు.