J.Surender Kumar,
కేంద్రంలో బిజెపియేతర నాన్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి., బిజేపి వాళ్లకు కళ్ళు నెత్తికెక్కయి, బిజేపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దేశం పరువు తీస్తున్నారు, అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో కెసిఆర్ మాట్లాడారు.
ప్రెస్ మీట్ లో ఎప్పటిలాగే సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ ను ఏం రాహుల్, అని పలకరించిన సీఎం కేసీఅర్
అందరూ అనుకున్నట్లు గానే మోదీ పై సెటైర్స్ తోనే ప్రెస్ నీట్ మొదలు పెట్టిన సీఎం కేసీఅర్,
కొన్ని రాష్ట్రాల్లో బిజేపియేతర ప్రభుత్వాలు అభివృద్ధి పతం లో దూసుకుపోతున్నారు., యూపీ తలసరి ఆదాయం 71 వేలు, ఈ సీఎం వచ్చి తెలంగాణ ప్రజలకు నీతులు చెబుతున్నాడు , తెలంగాణ ప్రభుత్వానికి స్పీడ్ ఎక్కువ, కేంద్ర ప్రభుత్వానికి స్పీడ్ తక్కువ, తెలంగాణ ఇంజిన్ 100 HP ఇంజిన్, కేంద్ర ప్రభుత్వం 50 HP ఇంజిన్, కర్ణాటకలో న్యాయమూర్తులను బెదిరిస్తారా.? సుప్రీం కోర్టు ను విమర్శిస్తారు మీరు, ఇదేనా మీకు న్యాయ వ్యవస్థ పై వున్న గౌరవం , నేడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది., తెలంగాణలో ఏక్నాథ్ షిండే లని, సృష్టిస్టామని ప్రకటిస్తారా, ఇలా ఇష్టమొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నారు, అని సీఎం కేసీఆర్ అన్నారు.
మోడీ ఏదో చెప్తాడు అనుకుంటే !
మోదీ సభలో ఏదో చెప్పుతాడు అనుకుంటే ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయాడని అన్నారు, ఇది రాజకీయాలు మాట్లాడే టైం కాకున్న మాట్లాడే పరిస్తితి వచ్చింది., దేశాన్ని బిజేపి జలగ లాగా పీడిస్తుంది., నా 9 ప్రశ్న లకు మోదీ ఏమి సమాధానం చెప్పలేదు, బిజేపి జాతీయ కార్యవర్గ సమావేశంలో మంత్రులు, మిగతావారు నన్ను తిట్టడం తప్ప వేరే ఏమీ మాట్లడకుండానే సభ ముగించారు,
డొల్లతనం బయటపడింది ,!
సభతో బిజేపి డొల్లతనం బయట పడింది , కేంద్రంలో ఇంత అసమర్థ పాలన ఎప్పుడు చూడలేదు,
ఈ దేశంలో పతనం కానీ కరెన్సీ విలువ భారత్ లో పతనం అయింది., దేశానికి మోదీ చేసిన ఒక మంచి పని లేదు , కనీసం దేశ రాజధాని ఢిల్లీ లో మంచి నీరు లేదు., ఇది సిగ్గు చేటు., విద్యుత్ పాలసీ ఓ చెత్త పాలసీ, మీ చెత్త విధానం వల్లే ఢిల్లీలో కరెంట్ కోతలు, 2014 కు ముందు మోదీ ప్రసంగాన్ని మీడియా కు వినిపించిన సీఎం కేసీఅర్, 8 ఏళ్ల పాలనలో దేశానికి మీరు చేసిన అభివృద్ధి ఏది., దేశంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది., జిజేపి వాళ్లకు లొడ లొడ లొల్లి పెట్టుడే తెలుసు, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని దించి తీరుతాం అని, కేసీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో బుల్లెట్ పాయింట్స్బజెపి కొనసాగిస్తున్న విధ్వంసంతో దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది
* కాంగ్రెస్ పాలనలో బ్రెయిన్ డ్రెయిన్.. మోదీ పాలనలో క్యాపిటల్ డ్రెయిన్
* భారతదేశచరిత్రలో అత్యంత అసమర్థమైన ప్రధాని మోదీ
* ఈడీలు, సీబీఐలు బ్యాంకు దొంగల్ని ఎందుకు పట్టుకోవట్లేదు
* దేశంలో బ్యాంకులు లూటీ అవుతున్నయ్
* ఎన్పీఎ కింద దేశంలో రూ.12 లక్షల కోట్లను దోపిడీ దొంగలకు దొచిపెట్టిండ్రు
* మోదీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు
* మోడీ పాలనలో బ్యాంకులకు భారీగా ఎన్పీఎలు పెరిగాయి
* కరెంటు కోతలతో దేశంలో ఇంకా
* దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగింది
* చరిత్రలో ఎన్నడూ లేనంతగా గ్యాస్ ధరలు పెరిగిపోయినయ్
* బ్యాంకులను దోచుకున్నవాళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నరు
* దేశంలో 38 శాతం పరిశ్రమలు మూతపడినవి వాస్తవం కాదా?
* కుట్రలు, కుతంత్రాలతో కాదు ప్రజాస్వామ్యయుతంగా పాలించాలి
* మోదీ విశ్వ గురువు కాదు.. విష గురువు
* దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిండ్రు
* గుజరాత్ మోడల్ అని డూప్లికేట్ వి చూపించి వచ్చిండు..
* ఎందుకు చేయోద్దు జాతీయ రాజకీయాలు.. బరాబర్ చేస్తం..
* మోదీ సర్కార్ రైతులను, దేశాన్ని మోసం చేస్తోంది
* ప్రధాని మాటల్లో సరుకూ లేదు.. సబ్జెక్టూ లేదు
* విదేశాల నుంచి బొగ్గు కొనుగోళ్లలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది
* బీజేపీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది వాస్తవం కాదా?
* తెలంగాణలో అమలవుతున్న వాటిలో కనీసం 20 శాతమైనా బీజేపీ రాష్ట్రాల్లో అమలవుతున్నయా?
* బీజేపీయేతర రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది
* రావణుడు, దుర్యోధనుడి లాంటి వాళ్లే
* రాష్ట్రంలో పండించిన పంటలను కొనలేని
* కేంద్రంలో పనిచేసే డబుల్ ఇంజిన్ కావాలె
* బీజేపీలో చేరితే అందరూ నిష్కళంకులు అయిపోతరు
* మేకిన్ ఇండియా ఘోర వైఫల్యం
* వచ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తం
* తెలంగాణ ఇంజన్ స్పీడ్ ఎక్కువ.. బీజేపీ సర్కార్ ఇంజన్ స్లో
* తెలంగాణది 100 హెచ్పీ ఇంజన్ అయితే బీజేపీది 50 హెచ్పీ..
* యూపీ ఎన్నికల కోసం నట్లు, బోల్టులతో కాశీలో మందిరం కట్టిండ్రు. ఇది దేశానికి మంచిది కాదని పండితులు, ప్రజలు అంటున్నరు.
* మోదీకి వ్యతిరేకంగా శ్రీలంకలో కూడా ఆందోళనలు చేస్తున్నరు
* కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి గోల్ మాల్ చేస్తామనుకుంటుండ్రు
* వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడం ఖాయం
* ఎన్టీఆర్ ని గద్దె దించితే ఏం జరిగిందో దేశం చూసింది
* పరస్పర నిందారోపణలే కాంగ్రెస్, బీజేపీ విధానాలు
* అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుంది
* భారతదేశంలో కురిసే వర్షపాతం ఒక లక్షా 40 టీఎంసీలు.. కొంత ఆవిరైతది.. కొంత భూమిలోకి పోతది.. నదుల నుంచి డైరెక్ట్ గా తీసుకోవల్సింది 70 టీఎంసీలు.. ఇప్పటికీ దేశం తీసుకుంటున్నది జస్ట్ 22 టీఎంసీలు.. మిగిలిందంతా సముద్రం పాలవుతున్నది..• భాదే భూవిస్తీర్ణం 83 వేల కోట్ల ఎకరాలు
* ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ మన దేశానికి ఉంది. యాభై శాతం అంటే 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలమైనది…
* అమెరికా పెద్దది అయినప్పటికీ 29 శాతమే వ్యవసాయానికి అనుకూలమైనది.
* చైనా కూడా భౌగోళికంగా పెద్దదైనప్పటికీ కేవలం 16 శాతమే వ్యవసాయానికి అనుకూలమైనది
* ఇండియాలో దమ్మున్న ప్రభుత్వమే ఉంటే దేశంలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వవచ్చు. గుణాత్మకమైన మార్పు అంటే ఇదే. దీనికోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలను మార్చాలంటున్నడు
* దేశంలో మేజర్ ప్రాజెక్టులు ఎందుకు కట్టడం లేదు?
* కేసీఆర్ కేసులకు భయపడడు..
* తెలంగాణ మోడల్ దేశానికి అవసరం
* ఈ దేశంలోని రయితలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఈ దేశం మీది.. కాపాడుకోండి
* దేశంలో రూ.3 వేలకే టన్ను బొగ్గు దొరుకుతుంటే.. విదేశాల నుంచి రూ.30 వేలకు టన్ను బొగ్గును దిగుమతి చేసుకుంటున్నరు
* వ్యాపారవేత్తలను వేధించి మోదీ వారి సన్నిహితులకు ఆస్తులను కూడబెడుతున్నరు
* సైన్యంలో యంగ్ బ్లడ్ కావాలంటున్నరు.. దేశంలో మోదీ కూడా వృద్ధుడయ్యాడు.. ఆయనను కూడా దించేయండ్రి
* దేశంలో 52 శాతం యువశక్తి ఉంది
దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నయ్
* ఇక్కడ నన్ను దించాలని చూస్తే.. ఢిల్లీలో బీజేపీని దించడం ఖాయం
* దేశ ప్రజలు జాగృతమైతే.. నాయకులు వాళ్లే కలిసివస్తరు
* 6500 టీఎంసీల అతిపెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో ఉంది. 4 వేలకు పైగా టీఎంసీలు గల రిజర్వాయర్లు రష్యాలో ఉన్నయ్. 1400 టీఎంసీలకు పైగా ఉన్న రిజర్వాయర్ చైనాలో ఉంది. 1200 టీఎంసీల రిజర్వాయర్ అమెరికాలో ఉంది.. మరి మనదేశంలో అలాంటి రిజర్వాయర్ లు ఎందుకు కట్టడం లేదు.
* తెలంగాణ రైతులకు ధరణి ద్వారా భరోసానిస్తున్నం
* తెలంగాణ రైతులకు ఉచిత విద్యుతుత, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నం
* సంవత్సరానికి 11 వేల కోట్ల సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నది
* దేశంలో ఏ ప్రభుత్వం ఇస్తున్నది ఇవన్నీ
* నన్ను కదిలిస్తే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు..
* బీజేపీ వాళ్ల పిట్ట బెదిరింపులకు భయపడం
* ఆశలు ఉడిగిపోయి.. అసహాయతలో మునిగిపోయి.. ఇంకెక్కడి తెలంగాణ అనుకుంటున్న సమయంలో.. ఇక్కడ ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నం
* ప్రజలను జాగృతం చేయడం.. మాస్ ను లేపడం ముఖ్యం. కొంతమంది నాయకులు నిరాశ పడ్డంత మాత్రాన నిరాశపడకూడదు..
* తెలంగాణలో ఏ ఒక్క సామాజిక వర్గాన్ని వదిలివేయకుండా వేల కోట్ల రూపాయల ఆత్మ గౌరవ భవనాలను ఇచ్చినం. దేశంలో ఎవరన్నా ఇచ్చిండ్రా.. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప
* కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఎక్కడన్నా కట్టిండ్రా.. దిక్కుమాలిన ఆరోపణలు చేస్తరా?
* తుంగతుర్తిల, మెదక్ లో, మంజీరా తదితర ప్రాంతాలలో పారేవి కాళేశ్వరం నీళ్లు కావా?
* దేశంలో పరిపాలిస్తున్నది బ్లాక్ మెయిల్ ప్రభుత్వమా? ప్రజా ప్రభుత్వమా? ఎంత
దివాళాకోరుతనం ఉన్న ప్రభుత్వం అది?
విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు
తెలంగాణలో రేపటి నుండి వచ్చే మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం వుందని మాకు సమాచారం వుంది, అందుకే స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవులు. ఇస్తున్నట్టు కెసిఆర్ వివరించారు. ఎస్సారెస్పీ కి భారీగా 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది., రాత్రికి రాత్రే ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నిండినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నారు. అందుకే గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి., ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోడానికి అయిన ప్రభుత్వం సిద్దంగా వుంది , ప్రజలంతా స్వీయ జాగ్రత్త లు పాటించాలి, వర్షంలో,వరద ప్రవాహం లో సాహసాలు చేయొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు