J. Surender Kumar,
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డా:వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాల్గొన్న పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి.,.తదనంతరం ప్రభుత్వ హాస్పిటల్ కు కాంగ్రెస్ శ్రేణులతో వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు పండ్ల పంపిణీ చేశారు.
పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

దివంగత మాజీ ముఖ్యమంత్రి మంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం ఉమ్మడి రాష్ట్రానికి తీరని లోటని,వైస్ రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్య సంభందంముతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధితో పాటు జగిత్యాల జిల్లాలో ఎక్కడ లేని విదంగా ప్రతి పల్లెను అనుసంధానం చేస్తు రహదారులు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అని,

ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ వేసిన రహదారులే తప్ప TRS పార్టీ ఒక్కటంటే ఒక్కటి కొత్తగా రహదారి వేయలేదని,ఆఖరుకు కాంగ్రెస్ పార్టీ వేసిన రహదారులపై రీ ప్యాచ్ వర్క్ కూడా చేయలేని దుస్థితి నెలకొందిఅని, వైస్ రాజశేఖర్ రెడ్డి గారితో నాకు ఉన్న అనుభందంతో జగిత్యాల జిల్లాలో ఎక్కడలేని విదంగా JNTU కళాశాల,పొలాస అగ్రికల్చర్ కళాశాల, వెటర్నరీ కళాశాల,నిరుద్యోగ సమస్యకు న్యాక్ ట్రేనింగ్ సెంటర్ , మరియు ఆదిలాబాద్ జగిత్యాల మధ్య వ్యాపార నిమిత్తం కోసం కమ్మునూర్ వంతెన,ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగినవి.వైస్ రాజశేఖర్ గారి

హయాంలోనే ఫీజ్ రియంబర్ మెంట్, ఆరోగ్యశ్రీ,104,108,మరియు ఒక్క కలం పోటుతో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ , రైతులకు ఉచిత విద్యుత్, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని.పేదల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పతకాలను Trs పార్టీ నిర్వీర్యం చేయాలని చూస్తుందని అన్నారు.ఒకపక్కtrsపార్టీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే,ఇంకోపక్క బీజేపీ యువతపై మతోన్మాదం రెచ్చగొట్టి దేశాన్ని నిర్వీర్యం చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో Trs,bjp పార్టీలను ఓడించడం ఖాయమని అన్నారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో నాకు ఉన్న అనుబంధం మరువలేనిది అని, ఆయన లేని లోటు ఇప్పటికీ నన్ను కలిచివేస్తుందని ఆవేదన చెందిన పట్టభద్రులMlC జీవన్ రెడ్డి

ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, మాజీ మున్సిపల్ చెర్మన్ గిరి నాగభూషణం, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు జున్ను రాజేందర్ గాజెంగి నందయ్య, మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష్మీపూర్ లో….
రూరల్ మం. లక్ష్మిపూర్ గ్రామంలో YSR జయంతి కార్యక్రమంలో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి., బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు. గాజంగి నందయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు. జున్ను రాజేందర్, పోరండ్ల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి . వివిధ హోదా లో ఉన్న నాయకులు పాల్గొన్నారు…