గోదావరినది, తెలంగాణ జీవనరేఖ! ధర్మపురి సభలో డిక్లరేషన్ ?

జూలై 9 , 10 తేదీలలో…

. J. Surender Kumar,
గోదావరి మహా హారతి, ప్రజ్ఞ భారతి.ఆధ్వర్యంలో పవిత్ర గోదావరి నది నీ  “గోదావరి తెలంగాణ జీవనరేఖ”. డిక్లరేషన్ ను ఈ నెల 9 ,10 తేదీలలో ధర్మపురిలో నిర్వహించనున్న’ చింతన్ బయటక్ ‘ లో. ‘గోదావరి తెలంగాణ  జీవన రేఖ’ అంటూప్రకటించనున్నట్లు  విశ్వసనీయవర్గాల కథనం. గోదావరి హారతి వ్యవస్థాపక అధ్యక్షులు బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు, ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక రచించినట్టు సమాచారం.

మానవాళి మనుగడతో ముడిపడి ఉన్న నదీజలాలు ప్రత్యేకంగా తెలంగాణా ప్రాంతం లో గోదావరి నది జలాల వినియోగం పవిత్ర పుణ్యక్షేత్రాలు తదితర అంశాలపై ధర్మపురి క్షేత్రంలో రెండు రోజులపాటు  చింతన్ బైఠక్ ,సమ్మేళనాలు, ప్రముఖ ప్రొఫెసర్ల తో ప్రసంగాలు, సాగు, తాగు నీటి అవసరాలు, పారిశ్రామిక వృద్ది, నదీ తీరాలు పర్యాటక క్షేత్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా, నదీజలాల వినియోగం విశిష్టత, తదితర అంశాలతో పాటు కలుషితం కాకుండా చూడడం , పరిశుభ్రత పచ్చదనం తదితర అంశాలపై ఈ సమ్మేళనాలలో   చర్చలు, ప్రసంగాలు, మేధో మధనం, జరుగనున్నట్లు సమాచారం. 

విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందుత్వ సంఘాలు,  బజరంగ్ దళ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు, పీఠాధిపతులు , సాధువులు, బిజెపి శ్రేణులు, ఈ సమ్మేళనంకు హాజరు కానున్నట్టు తెలిసింది. ‘ గోదావరి పిలుస్తుంది రా కలిసి రా’ అనే నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.


ప్రజ్ఞ భారతి, గోదావరి మహారతి కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు, సమ్మేళనాలు, జరగనున్నట్లు సమాచారం.


బిజెపి పార్టీకి అచ్చి వచ్చిన గోదావరి మహారతి !
బిజెపి జాతీయ నాయకుడు మురళీధర్ రావు యూపీఏ ప్రభుత్వంలో 2012 లో గోదావరి నదికి కార్తీక మాసంలో హారతి పూజా కార్యక్రమం  సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గోదావరి మహారతి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మురళీధరరావు ధర్మపురిలో మొట్టమొదటిసారి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి  స్వాది ఉమా భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రమం తప్పకుండా గోదావరి నది తీరాన గల క్షేత్రాలు మురళీధర్ రావు ఆధ్వర్యంలో హారతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

2014 సంవత్సరంలో UPA ప్రభుత్వం పై NDA గెలిచి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.  మొదటి దఫా మోడీ ప్రభుత్వం లో ఉమా భారతి, కేంద్ర మంత్రి పదవి అలంకరించారు. 2016- 17 లో  అప్పటి గోరక్ పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ధర్మపురి గోదావరి హారతి కి వచ్చారు ప్రస్తుతం ఆయన  ఉత్తర ప్రదేశ్ సీఎం పదవిని అలంకరించారు. 2022 కార్తీక మాసంలో నిర్వహించనున్న పదవ వార్షికోత్సవ పురస్కరించుకొని ఈ సమ్మేళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.


కేంద్ర మంత్రులు బీజేపీ అగ్రనేతలు రాక !
కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మెగా వాలా, రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, అరవింద్, బాబురావు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు,  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బిజెపి రాష్ట్ర జాతీయ నేతలు మేధావులు నీటి సంఘం నిపుణులు, తదితరులను బిజెపి నాయకుడు మురళీధర్ రావు ఆహ్వానించినట్టు సమాచారం

కొందరి మంత్రుల ఎంపీల పర్యటన అధికారికంగా ఖరారు అయ్యాయి. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ముగిసిన వెంటనే ధర్మపురి క్షేత్రానికి చేరుకొని   సభ స్థల , సమావేశ వేదికను  గోదావరి మహారథి ప్రజ్ఞాభారతి సంఘ సభ్యులు ,బీజేపీ శ్రేణులు పరిశీలించనున్నట్టు   సమాచారం. గోదావరి మహా హారతి రాష్ట్ర కోకన్వీనర్  దామెర రామ సుధాకర్ రావు, ప్రజ్ఞాభారతి ప్రధాన కార్యదర్శి రఘు, తదితర నాయకులు నిర్వహణ  భోజన వసతి సమావేశ మందిరం తదితర అంశాల బాధ్యతలు చేపట్టిన సమాచారం. గత నెల రోజులుగా  కసరత్తుతోపాటు, ఢిల్లీలో కేంద్ర మంత్రులను ఆహ్వానించడం, కార్యక్రమ రూపొందించడంలో  వీరు  కీలక భూమిని పోషిస్తున్నారు.