నిఘా వర్గాల సమాచారంతో ?
J.Surender Kumar,
నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న బిజెపి పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్ కు చేరుకోవాల్సిందిగా, బిజెపి పార్టీ కేంద్ర అధిష్టానం వారికి అత్యవసరంగా పిలుపు ఇచ్చినట్టు సమాచారం.
ధర్మపురి అసెంబ్లీ పరిధిలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్, వెలగటూర్లో నిర్వహిస్తున్న సమావేశం నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ధర్మపురి దేవస్థానం వసతి గృహంలో బస చేసిన కేంద్ర మంత్రి, శ్రీపాద నాయక్, షెడ్యూల్ ప్రకారం రేపు ధర్మపురి పట్టణంలో బిజెపి నాయకుడు సంగీ నరసయ్య ఇంట్లో అల్పాహారం చేయాల్సి ఉంది. శుక్రవారం తిమ్మాపూర్ లో బిజెపి సీనియర్ నేత నలమసు వైకుంఠం ఇంట్లో మంత్రి అల్పాహారం చేశారు. . శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. వెల్గటూర్ ప్రాంతంలో మంత్రి శ్రీపాద నాయక్ సహాయకుడికి ఫోన్ రావడంతో హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. జగిత్యాల నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఢిల్లీ పార్లమెంట్ సభ్యులు మనోజ్ తివారి, గురువారం రాత్రి దళిత కార్యకర్త అనుగుర్తి లక్ష్మీనారాయణ ఇంటిలో భోంచేశారు. కార్యకర్త వీరబత్తి అనిల్ ఇంటిలో కూడా స్వీకరించారు. శుక్రవారం ప్రముఖ న్యాయవాది మదన్ మోహన్ ఇంటిలో అల్పాహారం, చేసి సారంగాపూర్, బీర్పూర్ మండలం చిత్రవేణి గోండు గూడెం పర్యటించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకుని ముఖ్య కార్యకర్తలతో సమావేశం తర్వాత తమ క్యాడర్ కు ఫోన్ చేసి రావాల్సిందిగా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. శనివారం మధ్యాహ్నం వరకు జగిత్యాల నియోజకవర్గం లో పర్యటన చేయాల్సి ఉండే. శుక్రవారం సాయంత్రం ఫోన్ రావడంతో ఎంపీ తన పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ వెళ్లారు. ఇదే తరహాలో రాష్ట్రంలోనీ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న బిజెపి మంత్రులు, నాయకులు హుటాహుటిన శుక్రవారం రాత్రి వరకు హైదరాబాద్ కు చేరుకున్నారు.

రేపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక !
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి .యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్ కు రానున్నారు. ఈ మేరకు టిఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున స్వాగతం ఏర్పాట్లు చేపట్టినట్టు కేంద్రా.నిఘా వేగులు బిజెపి అధిష్టానంకు సమాచారం ఇచ్చినట్టు స్థానిక కార్యకర్తల చర్చల సారాంశం. వేలాది వాహాలతో భారీగా జన సమీకరణ, కాన్వాయ్ తో యశ్వంత్ సిన్హా స్వాగతించడానికి, ప్రణాళిక సిద్ధం చేసినట్టు, నిఘవర్గాల సమాచారంతో. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో, పర్యటనలో ఉన్న తమ మంత్రులు, ఎంపీలు ,జాతీయ కార్యవర్గ సభ్యులు, ట్రాఫిక్ అంతరాయం వాహనాలు జామ్ వల్ల సకాలంలో కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారో? లేదో? అని ముందస్తుగా వారిని అధిష్టానం అప్రమత్తం చేసినట్టు సీనియర్ బిజెపి నాయకులు వివరించారు. బిజెపి పార్టీ ఏర్పాటు చేయనున్న స్వాగత ఫ్లెక్సీ లకు అవకాశం లేకుండా హైదరాబాద్ పట్టణం యావత్తు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ఫ్లెక్సీలతో ముంచెత్తిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి కల్లా తమ శ్రేణులను, నాయకులను, హైదరాబాదుకు చేరుకునేలా బిజెపి అధిష్టానం ముందస్తు చర్యలు చేపట్టినట్టు స్థానిక బిజెపి నాయకు లు చర్చించుకుంటున్నారు.