ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
మంచిర్యాల జిల్లా జడ్పీ సమావేశం వాయిదా !
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓ న్యాయము, దళిత బిడ్డ మంచిర్యాల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కి మరో న్యాయమా ? అంటూ పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వం తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.
బుధవారం మంచిర్యాల జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం కు సభ్యులు హాజరు కాకపోవడంతో చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి వాయిదా వేశారు. సమావేశంకు హాజరు అయిన జీవన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను గవర్నర్ వద్ద మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన సీఎం కేసీఆర్, దళిత బిడ్డ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి పార్టీ మారిందనే అక్క తోనే సభ్యులు సమావేశం కు హాజరు కాకుండా ఆదేశాలు జారీ చేశారు కావచ్చు అని జీవన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

. కానీ ఇది సరైన పద్ధతి కాదు అని అన్నారు. జిల్లా పరిషత్ లో ప్రజల సమస్యలను చర్చించాల్సింది పోయి, ఈ రకమైన చర్య సరి అయినది కాదు అన్నారు. ఈ రోజు మీరు చేసిన ఇలాంటి తప్పుడు ఆలోచన తో నష్ట పోయేది జడ్పీ చైర్మన్ కాదు, ఈ జిల్లా ప్రజలు అని అన్నారు. జిల్లాలో ప్రజల సమస్యల పై మాట్లాడే అవకాశం ఉన్న వేదికను హాజరు కాకపోవడం సరైనది కాదు అన్నారు. రైతులకు విత్తనాల సమస్యలు ఉన్నాయి. .విత్తన రాయితీ లేవు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటికి .ఒక్క రేషన్ కార్డు లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, . మన ఊరు మన బడి , గ్రామాల్లో కేవలం ఎనర్జీఎస్ నిధుల తోనే పనులు జరుగుతున్నాయి. అన్నారు. ఈ రోజు సమస్యలను చర్చించల్సిన సమయంలో వ్యక్తిగత ఆలోచన తో ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా
కలెక్టర్
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి గుగులోతు అన్నారు. బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా టి.యు.డబ్ల్యూ. జే (ఐజేయు) జిల్లా అద్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, ప్రదీప్ ల ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు జిల్లా కలెక్టర్ ను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పిల్లలకు, ప్రైవేటు బడుల్లో ఉచిత విద్యను అందించాలని, నివేశన స్థలాలు కేటాయించాలని, ప్రెస్ భవన్ కు స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని జర్నలిస్టులకు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకే దఫాలో జర్నలిస్టుల అక్రిడేషన్ జరిచేయడం శుభపరిణామమని, నివేశన స్థలాలపై, ప్రైవేటు బడుల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను కల్పించేందుకు, ప్రెస్ భవన్ కు తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించడం సంతోషకరమన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సభ్యులతోపాటు జగిత్యాల ప్రెస్ క్లబ్ కార్యవర్గము, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

నిరసన ప్రదర్శన!
ధర్మపురి లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీలో యూత్ అధ్యక్షుడు సింహారాజు ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది.
మోడీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నిరంతరం పెంచుతూనే ఉందని, ఈరోజు మళ్లీ LPG ధరలను పెంచడం వలన సామాన్యులకు భారంగా వంట గ్యాస్ అయింది అని దినివలన సామాన్యుడు బ్రతికే పరిస్థితి కనపడడం లేదు అని ధర్మపురి అసెంబ్లీ అధ్యక్షుడు సింహారాజు ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రందేని మోగిలి, ,అప్పం తిరుపతి , md రఫియోద్దీన్, సర్ద సాయి కిరణ్ ,హరీష్ ,స్తంభంకాడి గణేష్, భరత్, నవీన్, రాజ్ కుమార్, నిరంజన్, అరుణ్, మల్లేశ్, రుషి, ఇషాక్,గణేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఐదుగురి పిడి కేసు నమోదు!
తారకరామనగర్ తండ్రి కొడుకుల హత్య కేసులో నిందితులపై పి.డి. యాక్ట్ అమలు చేసిన పోలీసులు.
జగిత్యాల పట్టణ పరిధిలోనీ తారకరామా నగర్ లో గత జనవరి 20 న మంత్రాల నెపంతో జగన్నాథం నాగేశ్వర్ రావు, అతని ఇద్దరు కొడుకులు రాంబాబు, రమేష్ లను అత్యంత క్రూరంగా పొడిచి చంపిన సంఘటనలో వనం చిన్న దుర్గయ్య, వనం శేఖర్, వనం చిన్న గంగయ్య, వనం దుర్గా ప్రసాద్, కండెల శ్రీనివాస్ లపై జిల్లా కలెక్టర్ జి.రవి ఉత్తర్వులతో పి.డీ. యాక్ట్ అమలు చేసినట్లు రూరల్ సీఐ కృష్ణ కుమార్ తెలిపారు..
జనవరి 23 న నిందితులను అరెస్ట్ చేయగా వారు బెయిలు పై ఏప్రిల్ 24 న జైలు నుండి బయటకు వచ్చారని సీఐ వివరించారు..

పరామర్శ
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మం.వెల్గొండ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పూదరి గంగాధర్ మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బౌతికకాయానికి సందర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ కొండపల్కల సంతోష్ రావు, కస్తూరి మల్లేష్, లక్కం సంతోష్ ,రమేష్, .సాయిని రాజేష్, దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.

బుగ్గారం మండల కేంద్రానికి చెందిన 10వ తరగతి చదువుతూన్న కమటం దినేష్, క్షణాకవేశం లో తొందరపడి ఉరి వేసుకొని మృతి చెందగా వారి బౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. నగునూరి రామగౌడ్, నర్సగౌడ్, కోడీమ్యాల రాజన్న, నక్క శంకర్,లక్ష్మణ్ ,దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.