J. Surender Kumar,
గత 12 రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్న జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల వాసి కిడ్నాప్ మిస్టరీ సుఖాంతం అవుతుందా ? వివాదాస్పదం అవుతుందా.?. అనే చర్చ నెలకొంది.
దుబాయ్ ఏర్పోర్ట్ నుంచి గత నెల 21న. విమానంలో ముంబాయి చేరుకున్న పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య 23న స్వగ్రామం కు వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు వాళ్ళ కుటుంబలు కథనం. తన తండ్రి రాకపోవడం, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో శంకరయ్య కుమారుడు 26 న ముంబాయికి వెళ్లి తండ్రి కోసం గాలించి వర్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటర్నెట్ ఫోన్ కాల్ ద్వారా మీ తండ్రిని మేము కిడ్నాప్ చేసాం మాకు ₹ 15 లక్షల కావాలి అంటూ డిమాండ్ చేయడం. శంకరయ్యను తీవ్రంగా కొట్టి బంధించిన ఫోటోలు వాట్సప్ ద్వారా కుటుంబ సభ్యులకు పంపించడం శంకరయ్యతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించడం విధితమే.
కిడ్నాప్ సాధ్యమేనా ?
ముంబైలో జూన్ చివరి వారంలో సేన ప్రభుత్వలో సంక్షోభం, శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు, సేన నాయకులు, కార్యకర్తల, వీరంగం ముంబాయి పట్టణంలో 144 సెక్షన్ విధించడం. ఈ నేపథ్యంలో కిడ్నాప్ సాధ్యమా? అనే కోణంలో ముంబాయి పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాదుకు విమాన సౌకర్యం ఉండగా శంకరయ్య ముంబైలో ఎందుకు దిగారు ? అనే కోణం తో పాటు, దుబాయ్ లో శంకరయ్య పనిచేస్తున్న కంపెనీ, ఆయన స్నేహితుల వివరాలు, ఆరోజు విమానంలో ప్రయాణించిన వారి వివరాలు. టికెట్ల బుకింగ్, సమయం తేదీలను, పాస్పోర్ట్, వివరాలను, దుబాయ్ , ముంబై ఎయిర్పోర్టులో సీసీ ఫుటేజ్ ల లో శంకరయ్యను అనుసరిస్తున్న వారినీ గుర్తించే పనిలో నిఘా అధికారులు ఉన్నట్టు సమాచారం. ముంబైలో కిడ్నాప్ అయిన శంకరయ్య, ఉన్న లాడ్జ్ పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ లు, ఉపగ్రహ చాయ చిత్రల ను (సాటిలైట్ లో ) నిఘా అధికారులతో పాటు తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర పోలీసులు సమన్వయంతో కిడ్నాప్ అంశంపై పరస్పర సహకారంతో నిశితంగా పరిశీలిస్తున్నట్లు చర్చ.

నాడు వెంటపడ్డారు! నేడు కిడ్నాప్ చేశారు !
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస బాట పట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్న అమాయక గ్రామీణులు గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు, మాఫియాల బెదిరింపులకు, గురి అవుతూనే ఉన్నారు. జగిత్యాల డివిజన్ ఓ మండల కు చెందిన వ్యక్తి గత రెండున్నర దశాబ్దాల క్రితం దుబాయ్ లో కొంతకాలం పనిచేసి స్వగ్రామానికి ముంబై విమానాశ్రయం ద్వారా తిరిగి వచ్చాడు. కారణం ఏమిటో తెలియదు కానీ ? పాస్పోర్టులో అతడి పేరు, గ్రామం,ఇంటి అడ్రస్ వివరాలు తెలుసుకొని, ముంబాయికి చెందిన ఓ మాఫియా ముఠా సభ్యులు, జగిత్యాల పట్టణంలో వారం రోజులపాటు మకాం వేసి అతడి గురించి వాకబు చేసి గాలించి, గ్రామ, ఇంటి పరిసరాలను నిర్ధారించుకొని అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించినట్టు నాడు చర్చ జరిగింది. అప్పట్లో నక్సలైట్ ఉద్యమం ఉదృతంగా ఉండేది. ఈ నేపథ్యంలో మాఫియా ముఠా సభ్యులు తమకు చెందాల్సిన వస్తువులను అతని నుంచి తీసుకొని అతడి తీవ్రంగా హెచ్చరించి పాస్పోర్టును చించి ముంబైకి హుటాహుటిన వారు వెళ్ళినట్టు చర్చ. నాడు ప్రముఖ దినపత్రికలో ఈ అంశం ” జగిత్యాలకు మాఫియా ముఠా” అనే శీర్షికతో ప్రచురితమైన వార్త . ఉమ్మడి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. శంకరయ్య కిడ్నాప్ సుఖాంతం కావాలని కుటుంబ సభ్యులతో పాటు పెగడపల్లి మండల వాసులు భగవంతుని వేడుకుంటున్నారు.