నరసింహుని దర్శించుకున్న కేంద్ర మంత్రి !


ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ  పర్యాటక , క్రీడల కేంద్ర సహాయ మంత్రి, గోవా పార్లమెంటు సభ్యులు  శ్రీపాదనాయక్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో , మేళతాళాలతో స్వాగతం పలికి పూజలు చేసిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేశారు.

దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామన్న ,.కార్యనిర్వహణాధికారి  సంకటాల శ్రీనివాస్ శేషవస్త్ర, ప్రసాదం చిత్రపటం అందజేశారు.
కార్యక్రమంలో దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్ , వేముల నరేష్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు , ముఖ్య అర్చకులు రమణయ్య, సూపరింటెండెంట్. కిరణ్ కుమార్, .సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ ,రాజగోపాల్, స్థానిక C.I కోటేశ్వర్, స్థానిక డిప్యూటీ తహశీల్దార్ పాల్గొన్నారు.


తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు !
గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు శుక్రవారంఎత్తివేశారు. దీంతో నదిలోకి వదర ప్రవాహం మొదలైంది.
నిజాంబాద్ జిల్లాలోని రెంజల్‌ మండలం కందుకుర్తి, త్రివేణి సంగమం, వైపు నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలోని ,ఆయకట్టుకు సాగు నీరు అందనుంది.  .సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఏడాది జులై 1 నుంచి, అక్టోబర్‌ 28 వరకు, అధికారులు ప్రాజెక్టు గేట్లను  ఎత్తి నీరు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఉత్తరంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఎస్సారెస్పీకి  80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని, ధర్మాబాద్‌  సమీపంలో  బాబ్లీ ప్రాజెక్టును ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రతిఏటా జులై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు  బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.  బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత ప్రక్రియలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర అధికారులతో పాటు, సీడబ్ల్యూసీ  (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌)  అధికారులు పాల్గొంటారు.
బాబ్లీ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 2.7 టీఎంసీలు కాగా గురువారానికి .ఒక టీఎంసీ నీటి నిల్వ ఉంది.
గేట్లు ఎత్తితే గోదావరి ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుంది. గతేడాది బాబ్లీ ప్రాజెక్టులో సీజన్‌
ప్రారంభంలోనే అత్యధిక వర్షాలు కురిసి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద ఎక్కువ కావడంతో
దిగువకు 14 గేట్లను క్రమంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టులో
నీటి మట్టం ఆశించిన స్థాయిలో లేదు.

గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సంతోష్ కుమార్,
జగిత్యాల జిల్లా ఎన్నికలు స్థానిక తెలంగాణ నాన్ గెజిటెడ్ సంఘ భవనంలో శ పుప్పాల శ్రీధర్ .DMHO   ఆధ్వర్యంలో శుక్రవారం  జరిగాయి.

అధ్యక్షులుగా, గంగుల సంతోష్ కుమార్ ఎంపీడీవో రాయికల్, ప్రధాన కార్యదర్శిగా, మామిడి రమేష్, ఇరిగేషన్ శాఖ అసోసియేటెడ్ అధ్యక్షులుగా అరిగెల అశోక్, డిగ్రీ కళాశాల ,కందుకూరి రవిబాబు, పంచాయతీరాజ్ శాఖ కోశాధికారిగా, గణేష్ ట్రెజరీ శాఖ మరియు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుండి గెజిటెడ్ ఉద్యోగులందరికీ సమన్వయంతో బాధ్యతలు అప్పగించడమైనది
ఎన్నికల కార్యక్రమం అందరి సమన్వయంతో సమిష్టితో నిర్వహించడం అయినది
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు  మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం కోసం పాటు పాడుతానని తెలియజేసినారు అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి రవిబాబు మాట్లాడుతూ ఉద్యోగం బాధ్యతతో పాటు సంఘ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామని తెలియజేసినారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జగిత్యాల జిల్లా జేఏసీ చైర్మన్ భోగ శశిధర్  మరియు రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు వకీల్  నూతనంగా ఏర్పడిన సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసి మహిళ ఎంపిక.


ప్రధాని మోడీ పనితనానికి నిదర్శనం!
ఆదివాసి మహిళలను భారతదేశ అత్యున్నత  రాష్ట్రపతి పదవికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంపిక చేసిన తీరు బిజెపి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం అని ఢిల్లీ పార్లమెంటు సభ్యులు మనోజ్ తివారి అన్నారు. శుక్రవారం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం చిత్రవేణి  గోండు గూడెంలో ఆయన పర్యటించారు.

ఎంపీ వెంట జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు, బీర్పూర్ మండల ఇంచార్జ్ న్యాయవాది చిలకమర్రి మదన్మోహన్, తదితరులు ఉన్నారు. ఎంపీకి గుండులు సాంప్రదాయ పద్ధతి మేళతాళాలతో ఘనంగా స్వాగతించి సన్మానించారు.

  జగిత్యాల పట్టణం లో  చైన్ స్నాచింగ్!
పట్టణంలోని గోవిందు పల్లె గౌతమ హై స్కూల్ ముందు గల ఓ కిరాణా షాప్ నడుపుతున్న మహిళ వద్దకు వచ్చిన వ్యక్తి మహిళ మెడలోని బంగారం ఎత్తుకేల్లాడు., సదరు మహిళ వెంటనే 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా, పట్టణ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంట లోపే చైన్ స్నాచర్ ను పట్టుకొన్నారు.,


జగిత్యాల ఖిల్లా ఈద్గా నూతన కమిటీ నియామకం     
   అధ్యక్షులుగా యూనుస్ నదిమ్

జగిత్యాల పట్టణంలోని ఖిల్లా ఈద్గా నూతన కమిటీని నియామిస్తూ జగిత్యాల ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షులు, ఎంఏ. బారి ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులుగా జగిత్యాల పట్టణ ఎంఐఎం అధ్యక్షులు, యూనుస్ నదిమ్,  ఉపాధ్యక్షులుగా జహీర్ ఉద్దీన్, ఎం. డి. షాహేరాజ్ ఉద్దీన్ మోసిక్,  ఎండి. షకీల్,  కార్యదర్శులుగా ఎత్తేమద్ ఉల్ హాక్, ఫజల్ ఉల్లా బేగ్, మహమ్మద్ సులేమాన్ పాష, సంయుక్త కార్యదర్శిగా ఖుసూర్ హాజరీ, కోశాధికారిగా అఖిల్ ఖాన్, సభ్యులుగా జియా ఉద్దీన్ అఖిల్, అబ్దుల్ బాసిత్, మహమ్మద్ రియాజ్, సల్మాన్, ముబీన్, రహీల్, ఫెరోజ్, సమీర్ తదితరులు నియమితులయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులును పలువురు అభినందించారు.