ధరణిలో నూతన ఐచికాలపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలి
జగిత్యాల జూలై 6:- జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ,అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ మరియు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి తదితర అంశాల పై కలెక్టర్ బుధవారం సంబంధించిన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ మరియు సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.
ధరణి వెబ్ సైట్ లో ప్రభుత్వం కల్పించిన నూతన ఐచ్చికాలకు సంబంధించిన దరఖాస్తులను 2 , 3 రోజులలో పరిష్కరించి నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
మిగిలి ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు.

ప్రతి మండల కేంద్రంగా 3 రోజులపాటు సదస్సు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రతి మండలంలో ఇప్పటివరకు అందిన దరఖాస్తుల మేర ఉన్న భూ సమస్యలపై తహసీల్దారులు సంపూర్ణ నివేదిక తయారు చేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
జగిత్యాల రూరల్ ,జగిత్యాల అర్బన్, మల్యాల, కొడిమ్యాల మండలాలో జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూ సర్వే ప్రక్రియ 50% ముగిసిందని, పెండింగ్ భూ సర్వే ప్రక్రియను 7 రోజుల్లో పూర్తయ్యే విధంగా వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, జిల్లాలోని తాసిల్దార్లు, జాతీయ రహదారి కోఆర్డినేటర్, సంబంధిత అధికారులు తదితరులు ఈ టెలి కాన్ఫరెన్స్ మరియు సమావేశం లో పాల్గొన్నారు

దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ పరిశీలించిన!
జగిత్యాల జూలై 05:- జిల్లాలో దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత లబ్ధిదారులకు సూచించారు.
దళిత బంధు పథకం అమలు తీరు పై జిల్లా కలెక్టర్ మంగళవారం మల్యాల మండలం లోని రామన్నపేట, గోర్రెగుండం గ్రామాల్లో పర్యటించి యూనిట్ల గ్రౌండింగ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దళిత బంధు లబ్ధిదారుల కు ఎంపిక కాబడిన యూనిట్లు గ్రౌండింగ్ చేసారా లేదా ఏవిదంగా చేస్తున్నారు విషయంపై స్వయంగా లబ్ధిదారుల నుండి వివరాలు వారి వ్యాపార ఆలోచనలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నగదు వినియోగం అమలు తీరు పై కలెక్టర్ స్వయంగా తిరిగి పరిశీలించారు.
మల్యాల మండలం లోని రామన్నపేట గ్రామంలో దళిత బంధు పథకం లో భాగంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను కలెక్టర్ సందర్శించారు. షాప్ యజమాని ఏర్పాటు చేసిన థాలు పుస్తకాలను పరిశీలించి, వారికి వచ్చే ఆదాయం పై ఆరా తీసి, వారిని కలెక్టర్ అభినందించారు. సదరు యూనిట్ పూర్తి స్థాయి గ్రౌండింగ్ కు నిధులు విడుదల కోసం తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలని కలెక్టర్ ఈడి ఎస్సీ కార్పొరేషన్ ను ఆదేశించారు.
అనంతరం గోర్రె గూడెం గ్రామంలో పర్యటించి కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేస్తున్న డైయిరి యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ పరిశీలించారు. గ్రామంలో నిర్మాణం అవుతున్న గోర్రెల షెడ్ పరిశీలించి, జూలై 20,2022 నాటికి గోర్రెలు కోనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం గ్రామంలో ట్రాక్టర్ యూనిట్ల లబ్ధిదారునితో చర్చించి, కల్టివేటర్, కేజివీల్స్ త్వరగా ఏర్పాటు చేసుకుని ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆ గ్రామంలో మొబైల్ టిఫిన్ సెంటర్ లబ్ధిదారునికి వ్యానును అందజేశారు.
ఈ పర్యటనలో జగిత్యాల ఆర్.డి.ఓ. మాధురి, ఈడి ఎస్సి కార్పొరేషన్ కె.లక్ష్మీ నారాయణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మనోహర్, తసీల్దార్లు, ఎం.పి.డి.ఓ.లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

World zoonoses day .vaccination camp కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జీ రవి మరియు మున్సిపల్ చైర్ పర్సన్ డి డబ్ల్యూ ఓ పశు శాఖ అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ డి ఎం హెచ్ ఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే సంజయ్ కు కేసీఆర్ శుభాకాంక్షలు!
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బుధవారం
తిరుమలతిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ఎమ్మెల్యే సంజయ్ జన్మదిన వేడుకలు
జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా లో టిఆర్ఎస్ వై పట్టణ అధ్యక్షుడు కత్తురోజు గిరి ఆధ్వర్యంలో జగిత్యాల శాసనసభ్యుడు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 60వ పుట్టినరోజు వేడుకలు టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్ ఎస్ వై జిల్లా అధ్యక్షుడు దావ సురేష్ మాట్లాడుతూ. జగిత్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత , ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని నాయకులు గుర్తు చేశారు. పట్టణంలో రోడ్లు, ఓపెన్ జిమ్, మినీ ట్యాంక్ బండ్, మార్కెట్లు, కుల సంఘాల భవనాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహణలో జగిత్యాల నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మొదటగా జగిత్యాల నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు
ఈకార్యక్రమంలో పట్టణ టి ఆర్ ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అల్లాల ఆనందరావు, కౌన్సిలర్ అవారి శివకేసరి బాబు,సింగల్ విండో చైర్మన్ సందీప్ రావు, రామకృష్ణ రెడ్డి.,కూతురు శేఖర్.,దూమల రాజ్ కుమార్, మారం రవిశంకర్, కవేటి నవీన్, వంశీ, ముకీం, కుసరి రాజు,మల్లేష్,రాకేష్, ప్రణయ్, కోటేశ్వరరావు, ఆరిఫ్, క్రాంతి,రాజేష్,ఫిరోజ్,రీజ్వాన్, వెల్దుర్తి ప్రవీణ్(సర్పంచ్) మరియు టి ఆర్ ఎస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్మరపల్లిలో…
శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్బంగా రాయికల్ మం. కుమ్మరిపల్లి గ్రామంలో విద్యార్థులతో కలిసి చెట్లు నాటిన రాయికల్ ZPTC జాదవ్ అశ్విని., తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్ధులకు చాక్లెట్ లు పంచారు, ఈ కార్యక్రమ లో సర్పంచ్ శ్రీమతి వెంకటేష్ స్వప్న, మండల యువ అద్యక్షులు వెంకటేష్, గ్రామ శాఖ అద్యక్షులు,మాజీ mptc స్థానిక నాయకులు పాల్గొన్నారు.