రెవెన్యూ సదస్సుల నిర్వహణ షెడ్యూల్ సిద్ధం చేయాలి


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్!

J. Surender Kumar,

జగిత్యాల, జూలై 8:- జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ షెడ్యూల్ తో సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి మాడ్యుల్స్ పై, శుక్రవారం జిల్లా కలెక్టర్ లు, ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మార్పులకు అవకాశం ఇవి !
ధరణి వెబ్ సైట్ లో ఉన్న మాడ్యుల్స్ ను పిపిటి ద్వారా సీఎస్ అధికారులకు వివరించారు, TM 33 మాడ్యుల్ కింద భూ యజమాని పేరు, భూ విస్తీర్ణం, భూమి రకం మార్పులకు దరఖాస్తు అవకాశం కల్పించామని, సదరు దరఖాస్తులలో ఆధారాలను పరిశీలించి, మన దగ్గర అందుబాటులో ఉన్న రికార్డులను తనిఖీ చేసిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని సూచించారు.


అనంతరం సీఎస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భూ రికార్డులు సమర్థవంతంగా నిర్వహిస్తున్న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు సిఎస్ అభినందనలు తెలిపారు. మన రాష్ట్రం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం 95% పైగా భూ రికార్డులు పకడ్బందీగా ఉన్నాయని, మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ములుగు గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహించడం జరిగిందని,

ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సు!
జూలై 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని సీఎస్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై చర్చించేందుకు సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్ లతో జూలై 11న హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని సిఎస్ తెలిపారు.

సీఎం కేసీఆర్ సమీక్ష నాటికి జి.ఓ.58 కింద వచ్చిన దరఖాస్తుల ప్రాథమిక విచారణ ప్రక్రియ 100% పూర్తిచేసి ఆ సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాలను రెవెన్యూ ఉన్నతాధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేయాలని సిఎస్ సూచించారు.

మూడు రోజులపాటు రెవెన్యూ సదస్సు!
జిల్లాలోని ప్రతి 4 లేదా 5 మండలాలకు ఒక బృందం ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో 3 రోజులకు మించకుండా రెవెన్యూ సదస్సులను మండల కేంద్ర హెడ్ క్వార్టర్ లో నిర్వహించాలని సిఎస్ సూచించారు. రెవెన్యూ సదస్సులను విస్తీర్ణం కలిగిన వేదికల్లో నిర్వహించాలని, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, అవసరమైన కంప్యూటర్లు ప్రింటర్, జిరాక్స్ మెషిన్, కౌంటర్లు, మొబైల్ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సి ఎస్ ఆదేశించారు

.

రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేలు!
మండల కేంద్రంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనాలని, దానిని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ సదస్సులో ప్రణాళిక సరిహద్దు జిల్లాల అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని ఖరారు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

గ్రామాల వారిగా షెడ్యూలు!
మండలాల్లోని గ్రామాలను విభజించి , గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులకు హాజరయ్యే తేదీల షెడ్యూల్ తయారు చేయాలని,

విస్తృత ప్రచారం చేయాలి!
రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ పై గ్రామాలలో టాంటాం ద్వారా ప్రచారం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రింట్ మీడియాలో షెడ్యూల్ ప్రచురితమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
జూలై 11న సీఎం కేసీఆర్ తో జరిగే సమావేశానికి రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం జిల్లా ప్రణాళికతో హాజరు కావాలని, ఆ ప్రణాళికలో జిల్లాలో ఏర్పాటు చేసే బృందాల వివరాలు, మండల కేంద్రాలలో వేదికలు, షెడ్యూల్ వంటి లాజిస్టిక్స్ వివరాలు సిద్ధం చేయాలని సి ఎస్ ఆదేశించారు.

100% పరిష్కరించాలి!
రెవెన్యూ సదస్సుల సమయంలో వచ్చిన దరఖాస్తులను 100% అర్హత మేరకు పరిష్కరించాలని, కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు, సరైన డాక్యుమెంట్లు సమర్పించని కేసుల వివరాలతో కూడిన సమాధానం వారికి అందజేయాలని సిఎస్ సూచించారు.

ఎక్కడి గురుకులాలు అక్కడే ఉండాలి!
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాలలు మంజూరు చేసిన ప్రాంతాల్లో ఉండే విధంగా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని సిఎస్ పేర్కొన్నారు.

ఆగస్టు 15 నాటికి స్టడీ సర్కిల్!
ప్రతి జిల్లాలో ఆగస్టు 15 నాటికి స్టడీ సర్కిళ్లు ఏర్పాటుకు సంబంధించి అవసరమైన స్థలాలు, భవనాలను ఎంపిక చేయాలని సిఎస్ కలెక్టర్లకు ఆదేశించారు జిల్లాలో చేపడుతున్న హరితహారం కార్యక్రమం, గ్రామీణ క్రీడ ప్రాంగణాల పురోగతి వివరాలు సైతం తయారు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు.

సిద్ధంగా ఉన్నాము. కలెక్టర్ రవి!
వీడియో కాన్సెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో 18 మండలాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ కోసం 4 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, 15 రోజుల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో నిర్వహణలో భాగంగా అవసరమైన మేర సహయకులను నియమించే కౌంటర్ల వారీగా ప్రజలకు గైడెన్స్ అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్ .లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ , కొరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి వినోద్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, జిల్లాలోని తహసిల్దార్లు సంబంధిత అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.