J. Surender Kumar,
జగిత్యాల పట్టణంలో ఆదివారం ఇందిరా భవన్ లో పట్టభద్రుల MLC జీవన్ రెడ్డి ప్రెస్ మీట్. నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడేండ్లు అయిన రైతులకు ఒక రైతుబందు తప్ప, అదనంగా ఏ ఒక్క పనిచేయలేదని ,ఒక్క రైతు బంధు పేరుతో రైతులకు లభించాల్సిన అన్ని సౌకర్యాలకు కోత పెట్టడం సరికాదన్నారు, ,విత్తన రాయితీ లేదు, ఉచిత వడ్డీ లేదు, రుణమాఫీ లేదు, అన్నారు.
తప్ప తాలు నెపంతో వరిధాన్యం కొనుగోలు విషయంలో మోసం చేస్తున్న మిల్లర్లను అదుపుచేయలేని దుస్థితిలో తెరాస ప్రభుత్వం ఉందన్నారు., రైతులకు 24 గంటలు కరంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పే ప్రభుత్వం 9 గంటలకంటే ఎక్కువ కరెంట్ ఇవ్వలేదని, 24 గంటలు కరెంటు ఇస్తున్నామని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం పాడి పరిశ్రమను ప్రోత్సాహిస్తమని లీటరుకు ₹ 4 రూపాయలు రాయితీ ఇస్తామని చెప్పి, 4 ఏండ్లు గడుస్తున్నా రాయితీ దిక్కులేదని, రైతువేదికలు నిర్మించామని గొప్పలు చెప్పే తెరాస ప్రభుత్వం సమాధానం చెప్పాలి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ ఒక్క గ్రామంలో అయిన అవి రైతులకు ఉపయోగపడుతున్నయా ? ఉపయోగపడుతున్నాయంటే అవి అసాంఘిక కార్యక్రమాలకు మాత్రమే అని ఆరోపించారు.
వరి కొనుగోలు విషయంలో తప్ప తాలు పేరుతో తూకంలో మిల్లర్లు రైతులను మోసం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేయాలని ధర్నాలు, రాస్తారోకోలు, చేసిన ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని. తెరాస ప్రభుత్వం కమీషన్ల కోసం మిల్లర్ల తో కుమ్ముకు అయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ,మంత్రి కొప్పుల ఈశ్వర్ కండ్లముందు రైతులకు, తప్ప తాలు తుకంలో మోసం జరుగుతున్న చూస్తుండి పోయారని, ఆఖరుకు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తప్ప తాలు మరియు తుకంలో మిల్లర్లు మోసం చేస్తున్నారని ఇది వాస్తవమే అని ఒప్పుకున్నారు. కానీ అంత ఐపోయినాకనే అని జీవన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల DCC అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, పుప్పాల అశోక్, గొల్లపల్లి సర్పంచ్ నిశాంత్ , నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

విష్ణు సహస్రనామ పారాయణం!
ఆశాడ శుద్ద ఏకాదశి (శైన ఏకాదశి) సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గల శివ కళ్యాణ వేదికపై శ్రీ సీతారామ భజనమండలి ధర్మపురి వారిచే ” విష్ణు సహస్రనామ పారాయణం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో భజనమండలి నిర్వాహకురాలు జయప్రద , దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామన్న, తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాలలో..
జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణవాడ హరిహరాలయ లో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులచే జరిగిన విష్ణు సహస్రనామ పారాయణం చేశారు.

గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి ఈశ్వర్!
గొల్లపల్లి మండలం కేంద్రం లోని గురుకుల పాఠశాలలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రహారీ గోడ కూలీ, పాఠశాల ఆవరణలో నీరు ప్రవేశించగా విషయం తెలియగానే ఆదివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాఠశాలను, తరగతి గదులను పరిశీలించి, వసతులపై పాఠశాల సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

, గురుకుల పాఠశాల 450 మంది విద్యార్థులను కలిసి మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుని, తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సెలవు దినాలు ప్రకటించగా సెలవుల అనంతరం ధర్మపురి మండలం మగ్గిడి గ్రామంలోని మోడల్ స్కూల్ భవనాన్ని పరిశీలించిన మంత్రి పాఠశాల మరమ్మతులను వారం రోజుల్లో పూర్తి చేసి, విద్యార్థులను మగ్గిడి కి తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులకు సూచించారు.

రైలు ఢీ కొని 60 గొర్రెలు మృతి.,
కోరుట్ల మం. చిన్న మేట్పల్లి గ్రామ శివారులో రైలు పట్టాల పై వెళ్తున్న గొఱ్ఱెలను ప్రమాదవశాత్తూ రైలు ఢీ కొనడంతో దాదాపు 60 గొర్రెలు మృతి చెందాయి., లక్కం రాజం కు చెందిన గొర్రెలు మృతి చెందటం తో 6 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వాపోయాడు.

170 క్వింటాళ్ల రేషన్ బియ్యం మరియు లారీ స్వాధీనం..
గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పస్తం కనుకయ్య ,మరియు హర్యానా రాష్ట్రానికి జాను, ఇద్దరు కలిసి సుమారు 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం ను చుట్టూ పక్కల మండలాల్లో తక్కువ ధరలకు కొని, మహారాష్ట్ర రాష్ట్రానికి ఎక్కువ ధరకు అమ్మాలని లారీలో లోడ్ చేసుకొని తరలిస్తుండగా తేదీ 9-7-2022. రోజున రాత్రి 11:30 గంటలకు గొల్లపల్లి శివారులో పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.