రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ ! మంత్రి కొప్పుల ఈశ్వర్!


    

జగిత్యాల జిల్లా మల్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేసిన కొరండ్ల నరేంధర్ రెడ్డి మరియు వారి పాలకవర్గ సభ్యులు, ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ…..
మొదటగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు పాలక వర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.


మన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే కుటుంబానికి అండగా రైతు భీమా, కాళేశ్వరం ద్వారా సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు.
అయోమయంలో ఉన్న రైతాంగానికి చేయూత నిచ్చెందుకు సీఎం కేసిఆర్ ధాన్యం కొనుగోలు కు నిర్ణయం తీసుకున్నారన్నారు.
కేంద్రం సహకరించకున్న, వడ్లను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే రైతు పక్షపాతిగా సీఎం మరోసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అన్నారు

.


రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు ద్వారా సుమారుగా ₹ 1200 కోట్ల రూపాయలు నష్టం వస్తుందనీ తెలిసిన రైతుల కోసం పరితపించే మన కెసిఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ విషయంలోనే అర్దం అవుతుంది కెసిఆర్ రైతుల పక్షపాతి అని. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కెసిఆర్ కిట్, గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠ దామాలు ఇంక చెప్పుకుంటు పోతే చాలా పథకాలు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.


పలువురిని పరామర్శించిన ఎమ్మేల్యే డా. సంజయ్ !
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పలువురు బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. జగిత్యాల రూరల్ మండల లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన
అర్ఎంపి రాజు ఇటీవల ప్రమాద వశాత్తూ గాయపడగా, కొప్పేర అరవింద్ రెడ్డి కూతురు శిరీష అనారోగ్యం తో పడుతూ ఉండగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మేల్యే.అనంతరం గ్రామానికి చెందిన చిర్ర రాజ లింగం ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
ఎమ్మేల్యే వెంట ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత లక్ష్మణ్, ఆత్మ ఛైర్మెన్ ఏలేటిరాజిరెడ్డి, నాయకులు పురిపాటి రాజిరెడ్డి, సత్తిరెడ్డి, జనార్ధన్, చిన్న గంగయ్య, లక్ష్మారెడ్డి, అమర్, రాజేష్, శ్రీనివాస్ నాయకులు తదితరులు ఉన్నారు.

రెవిన్యూ సదస్సులను వాయిదా.!
. సీఎం కేసీఆర్

భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11 న ప్రగతి భవన్ లో నిర్వహించతలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవెన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు.. 15వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన ‘రెవిన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇందుకు సంబంధిచిన తేదీలను వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.


రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం …ఎమ్మేల్యే
జగిత్యాల మండల లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు నక్క హరీష్ గత వర్షాకాలం పిడుగుపాటుకు గురై మరణించగా ప్రభుత్వం ద్వారా మంజూరైన 6 లక్షల విలువగల చెక్కు ను హరీష్ తండ్రి లింగన్న కు గ్రామ పంచాయతీ వద్ద అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో సీఎం కేసీఆర్ అందరికి సంక్షేమ పథకాలు అందించాలనే దిశగానే కార్యక్రమాలు చేపడుతున్నారని, లక్ష్మీపూర్ గ్రామంలో దళిత యువకుడు ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురై చనిపోవడం వల్ల ఎదిగిన కొడుకుని లింగన్న కోల్పోవడం చాలా బాధాకరమని కొడుకుని తిరిగి తీసుకురాలేమని కానీ ప్రభుత్వం ద్వారా మంజూరైన 6 లక్షల చెక్కు ఇవ్వడం వల్ల వారి కుటుంబానికి కొంత ఆర్థిక సాయంగాఉంటుందని, ,గతంలో దామోదర్ రెడ్డి అనే రైతు చనిపోతే రైతు భీమా 5 లక్షలు అందించామని ,కరెంట్ షాక్,.వర్షాలకు ఇల్లు దెబ్బతిన్న,పశువులు మరణించిన ఇలా అనేక విధాలుగా ప్రభుత్వం లబ్ధిదారులకు కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని ఉమ్మడి రాష్ట్రంలో గత నాయకులు పట్టించుకోలేదని, పథకాలు ప్రజలకు అందేవికాదని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారని, ప్రతి పక్షాలు అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. .వ్యవసాయ రంగ అభివృద్ధికి నీళ్లు,కరెంట్,కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతును రాజును చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని,మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ధి కి నిధుల మంజూరు తో పాటు ఈ విద్య సంవత్సరం నుండి ఆంగ్ల బోధన చేయటం జరుగుతుంది అని అన్నారు.ప్రతి 20మంది పిల్లలు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని అన్నారు.ప్రైవేట్ లో చదివే విద్యార్థుల కోసం పీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది అని,గతంలో బీటెక్ కళాశాలలో 5000 వేల మందికి పూర్తి ఫీజు ఉంటే నేడు 10 వేల మందికి పెంచామని అన్నారు.
నాయకులకు,కార్యకర్తల సహకారం తోనే బీద,మద్య తరగతి ప్రజలకు సేవలను అందిస్తున్నామని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు అని అన్నారు. దేశం మొత్తంలోనే తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా అమలుకావట్లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ సునీత లక్ష్మణ్,ఆత్మఛైర్మెన్ ఏలేటిరాజిరెడ్డి,నాయకులు పురిపాటి రాజిరెడ్డి,సత్తిరెడ్డి, జనార్ధన్, చిన్న గంగయ్య, లక్ష్మారెడ్డి, అమర్, రాజేష్, శ్రీనివాస్ నాయకులు తదితరులు ఉన్నారు.


పరామర్శ!
జగిత్యాల రూరల్ మండల జాబితా పూర్ గ్రామానికి చెందిన గర్వందుల శ్రీనివాస్ కొడుకు గర్వందుల సాయి కుమార్ ఇటీవల దుబాయ్ లో ఆత్మ హత్య చేసుకొని మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్థివ దేహాన్ని దుబాయ్ నుండి స్వదేశం తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తానని,దైర్యం గా ఉండాలని ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. అనంతరం గ్రామానికి చెందిన రాజుల చంద్రవ్వ అనారోగ్యం తో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంట సర్పంచ్ అంకం మమత సతీష్,ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్,గ్రామ శాక అధ్యక్షుడు జలంధర్,గుండెటి గంగారాం, శ్రీనివాస్, జగదీష్, కుమార్, దిలీపు, వినోద్, మహేష్, లక్ష్మి రజం, రమేష్, నర్సయ్య,రంజిత్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు

.

గోదావరి నది తీరా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా గోదావరి నది తీరా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ప్రజలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు., బాబ్లీ నుండి SRSP కి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో గొర్రెల కాపరులు, మత్సకారులు ఒక వారం రోజుల పాటు నది వైపు వెళ్లకుండా ఉండాలని కోరారు. రైతు సోదరులు విద్యుత్ స్తంబాలు, తెగిపోయిన వైర్ల తో అప్రమత్తంగా ఉండాలన్నారు

.
పెరుగుతున్న ధర్మపురి గోదావరి నీటిమట్టం!
పుణ్యక్షేత్రమైన ధర్మపురి గోదావరిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల కడెం ప్రాజెక్టు నిండుకుండల మారడంతో గేట్లు తీయడంతో ఆ నీరు గోదావరిలో కలుస్తుంది దీనికి తోడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నట్టు సమాచారం.

కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం
మంత్రి కొప్పుల ఈశ్వర్!

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మండలానికి మంజూరు అయిన 58 మంది కళ్యాణ లక్ష్మీ – షాదీముబారక్ లబ్దిదారులకు ₹ 58,06,728 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….


👉 కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది.
నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.
👉 టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.


👉 మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు.