సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు నిరంతరం కొనసాగించాలి
జగిత్యాల, జూలై 4:- ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల అమలు లో వేగం పెంచాలని కలెక్టర్ జి.రవి అధికారులను ఆదేశించారు.
ఆపరేషన్ ముస్కాన్, మన ఊరు మనబడి, 8వ విడత హరితహారం, దళిత బంధు తదితర వివిధ అంశాల పై కలెక్టర్ సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో కన్వెర్జెన్స్ సమావేశం నిర్వహించారు.
జూలై 1 నుంచి జూలై 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ అమలు కోసం అవసరమైన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని, పనులలో ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ అమలు తీరుపై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

సీజనల్ వ్యాధుల , జ్యారాలు నివారణకు తీసుకుంటున్న చర్యలు పై చర్చించినారు. నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని, దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా లో సీజనల్ వ్యాధుల నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలు పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని తెలిపారు.
మన ఊరు మన బడి!
మన ఊరు మనబడి కార్యక్రమం అమలులో భాగంగా 30 లక్షల కంటే తక్కువ ఉన్న పాఠశాల పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల ప్రతిపాదనల పనులు స్థితిగతులపై మండలాల వారిగా కలెక్టర్ సమీక్షించారు.
మన ఊరు మనబడి కింద కింద చేపట్టిన పనుల ప్రతిపాదనల అనుమతులు తీసుకొని, క్షేత్రస్థాయిలో పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో అభివృద్ధి పనుల కోసం అవసరమైన ఇసుక సిద్ధం చేసామని, వీటిని పాఠశాలల వద్ద 100% డంప్ చేసుకొని రసీదు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఇసుక తరలింపు కోసం గ్రామాలలో ఉన్న ట్రాక్టర్లు వినియోగించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మన ఊరు మనబడి కింద క్షేత్రస్థాయిలో గ్రౌండ్ అయిన పనుల ఫోటోలు , పాఠశాల పనులు పూర్తయిన ఫోటోలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
హరితహారం!
8వ విడత హరితహారం కార్యక్రమాల లక్ష్యాల సాధనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో హరితహారం మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకం ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్, నీటిపారుదల శాఖ పరిధిలో ప్లాంటేషన్, పట్టణాలలో ప్లాంటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
పల్లె ప్రకృతి వనాలు!
జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు గుర్తించిన స్థలాలలో యాదాద్రి మియావాకి విధానం ద్వారా మొక్కలు నాటేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
క్రీడా ప్రాంగణాలు!
జిల్లాలో 121 గ్రామాలలో మాత్రమే గ్రామీణ క్రీడా ప్రాంగణ ఏర్పాటుకు గుర్తించి 41 పనులు పూర్తి కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలోని స్థలాలలో సైతం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయవచ్చని, దీనిపై ప్రధానోపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలోని వైకుంఠధామాలలో నీటి సరఫరా ,విద్యుత్ సరఫరా, కాంపౌండ్ వాల్ నిర్మాణ తదితర పనులు పురోగతిపై నివేదిక తయారుచేసి సమర్పించాలని కలెక్టర్ సూచించారు
దళిత బంధు!
దళిత బంధు పథకంలో భాగంగా 345కి గాను జిల్లాలో 330 యూనిట్లు గ్రౌండ్ చేయడం జరిగిందని, చిత్ర స్థాయిలో బృందాలు వాటి పురోగతిని పరిశీలించిన నివేదికల సమర్పిస్తే తదుపరి నిధులు విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
సమీకృత మార్కెట్లు!
పట్టణాలలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, జిల్లాలో నిర్మాణంలోన మార్కెట్ల పనులను స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ ప్రతివారం, మున్సిపల్ కమిషనర్ ప్రతి 2 రోజులకు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. కోరుట్ల రాయికల్ మున్సిపాలిటీలలో మార్కెట్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం!
జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో సైతం బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ శ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, జిల్లా అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా విశ్వనాధ్ శర్మ!
ధర్మపురి మండల ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కొరిడే విశ్వనాథ్ శర్మ మరియు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ధర్మపురీ మండల శాఖ సోమవారం స్థానిక బ్రాహ్మణ సేవా సంఘ భవనము లో సోమవారం సర్వసభ్య సమావేశం జరిగింది.. మధ్వాచార్య రాంకిషన్ అధ్యక్షత న జరిగిన ముందుగా ఈ సంవత్సరమున దివంగతులైన సభ్యుల కు సంతాపసూచకముగా 2ని.లు మౌనం పాటించారు.
అధ్యక్షులు శ్రీ మధ్వాచార్య రాంకిషన్ ప్రసంగిస్తూ ఇంతవరకు కొనసాగిన కార్యవర్గము సేవలను కొనియాడారు. జరుగబోయే ఈ ఎన్నికలతో నూతన కార్యవర్గము రాబోతున్నందున సంతోషం కలుగుతున్నదని , ఇందులకు సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు అన్నారు.

ప్రధాన కార్యదర్శి శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ విశ్రాంత ప్రిన్సిపాల్ తమ త్రివార్షిక కార్యదర్శి నివేదికను తెలియపరుస్తూ … తమకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
గత సంవత్సరం నుండి జీవన్ ప్రమాణపత్రాల సమర్పణలో చాలా తేలికైన ప్రభుత్వ ఆప్ వచ్చిందని . ఇంట్లో ఆ ఆప్ ద్వారా సెల్ఫీ దిగడం ద్వారా జీవన్ పత్రసమర్పణ చేసుకోవచ్చని , ఆసౌకర్యము లేని వారు మీ సేవ ద్వారా పంపవచ్చు. అక్కడి కూడా వెళ్ళలేనివారు చేతిద్వారా నింపిన ఫామ్స్ ను ఇస్తే వాటిని ట్రెజరీ కార్యాలయంలో సమర్పించగలమని వివరించారు. సంస్థకు స్వంతభవనము లేకపోవుట వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నది. కావున మనమంతా ప్రయత్నించాలి అని వివరించారు.
మాజీ అధ్యక్షులు శ్రీ అలువాల దత్తాత్రి తన ప్రసంగంలో 1982 కు ముందు జాతీయ స్థాయిలో పెన్షనర్ల సంఘం ఏర్పడుటకై ఆనాటి పరిస్థితులను పేర్కొంటూ 1982 లో సంఘం ఏర్పడిన విధానాన్ని వివరించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘానికి పర్మినెంట్ భవనం తప్పనిసరి గా ఉండాలని అందుకని రాజకీయ నాయకులు సహకరించాలని కోరుతూ ,ప్రస్తుతకాలములో ధరలు పెరుగుతున్నాయి కాని ప్రభుత్వము ఇంతవరకు రావలిసిన డీ ఏ ను మాత్రము పెంచే విషయములో ఉదాసీనము వహిసున్నదని, ఇవ్వవలసిన కరువు భత్యమును త్వరగా ఇవ్వాలని అంతే కాక పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్తూ. పెన్షనర్లకు హెల్త్ కార్డు వసతి కల్పించాలని కోరారు.
శ్రీ కొరిడె శంకర్ నూతన గత కార్యవర్గము చేసిన సేవలను ప్రశంసించి, నూతన కార్యవర్గమునకు అభినందనలు తెలియజేశారు..
ఎన్నికల అధికారులు గా రాయకల్ మండల TSGREA అధ్యక్షులు శ్రీ వెంకటరాజయ్య , మరియు జగిత్యాల జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ వెంకట్ రెడ్డి
నిర్వహించగా, నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నికల కార్యక్రమంలో
కొరిడె విశ్వనాథ శర్మ అధ్యక్షులుగా
ఇందవరపు బండయ్య కార్యదర్శిగా ను.
కొరిడె నరహరి కోశాధికారి గాను.
మ్యాన రాజయ్య సహాధ్యక్షలుగాను
కొరుట్ల రాజనర్సయ్య ఉప అధ్యక్షులు (I) గాను.
మహ్మద్ వజీర్ ఉప అధ్యక్షులు (II) గాను.,
పెండ్యాల రవీందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు (I) శ్రీమతి గౌసియా బేగం ఆర్గనైజింగ్ సెక్రటరీలు (II) గాను,
సంగనభట్ల లక్ష్మీ నరహరి పబ్లిసిటీ సెక్రటరీ గాను.
ఏకగ్రీవముగా సభ్యులందరు ఎన్నుకున్నారు.
ఆ తర్వాత జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పెద్ది ఆనంద్ జిల్లా కార్యదర్శి గంగరాజం స్టేట్ కౌన్సిలర్ వనమాల సత్యనారాయణ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాలతో సన్మానించారు. తరువాత ప్రసంగించిన
ఈ కార్యక్రమములో సీనియర్ పాత్రికేయులు సంగనభట్ల రామకిష్టయ్య , సంగనభట్ల మోహన్ రావు , కాకెరి దత్తాత్రి కాకెరి శంకర్ శర్మ సంగనభట్ల సుభాష్ చంద్ర మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు.
ఇందవరపు బండయ్య కృతజ్ఞతలు తెలియజేయగా కార్యక్రమం ముగిసింది.

కలెక్టర్లను కలిసిన గెజిటెడ్ ఉద్యోగుల సంఘం!
నూతనముగా ఎన్నిక కాబడిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల జగిత్యాల జిల్లా సంఘం సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లత మరియు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ శ్రీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేశారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, అసోసియేటెడ్ అధ్యక్షులు కందుకూరి రవిబాబు, కోశాధికారి గణేష్ ఉపాధ్యక్షులు లావణ్య , Dr.N.శ్రీనివాస్. సంయుక్త కార్యదర్శి సలీం, .Dr. ప్రవీణ్ చంద్ర
Organising సెక్రటరీ కిరణ్ కుమార్ ,
ప్రవీణ్. పుల్లయ్య .మరియు కార్యవర్గ సభ్యులు Dr. బద్దం రాజేందర్ రెడ్డి , సిజాయుద్దీన్ . నాగార్జున ..సుష్మ. .విశ్వాన్. తిరుపతి నాయక్. . గెజిటెడ్ అధికారులు పాల్గోన్నారు. .
ఈ సందర్భంగా కలెక్టర్ ,అదనపు కలెక్టర్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

నిత్యావసర వస్తువుల పంపిణీ
ధర్మపురి పట్టణ కేంద్రంలో గల, స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వచ్ఛంద సేవా సంస్థ, ఆధ్వర్యంలో, జూలై నెలకు సంబందించి, రెండు నిరుపేద కుటుంబ సభ్యులు అయినా, వేల్పుల సుమలత, కర్నె దామోదర్ కుటుంబాలకు, నేల రోజులకు సరిపడా, నిత్యావసర వస్తువులను, స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, అందజేయడం జరిగింది. సంస్థ సభ్యుడు రంగు లక్ష్మీ నరహరి మీడియాతో మాట్లాడుతు…. సంస్థ ఆధ్వర్యంలో, ప్రతి నేల నిరుపేద కుటుంబాలకు, నేల రోజులకు సరిపడా, నిత్యావసర వస్తువులను, అందజేయడం జరుగుతుంది అని, తెలిపారు. నిరుపేద కుటుంబంలో ఉండి, ఆర్థికంగా వెనుక బడి ఉండి, తమ సంస్థ దృష్టికీ వస్తే, ఆర్థికంగా ఆదుకుంటామని, తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో, సంస్థ సభ్యులు రంగ హరినాథ్, పప్పుల శ్రీనివాస్, ముత్యాపు భూమయ్య, సంగి శేఖర్, ఎడ్ల గంగ రాజాం, జైషేట్టి రాకేష్, షేగంటి శివ కుమార్, గుండి రమాదేవి, మాధవి లతో పాటు, సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మూడు ఎకరాల భూమి ఇవ్వాలని గల్ఫ్ మృతుడి కుటుంబం విజ్ఞప్తి
గల్ఫ్ లో ఆత్మహత్య చేసుకున్న కార్మికుడి కుటుంబం ప్రజావాణి లో జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి
గత ఐదేళ్లుగా ఇంటికి రాకుండా షార్జా లోనే ఉంటున్న బచ్చల రాజనర్సయ్య అనే వలస కార్మికుడు అప్పుల బాధ భరించలేక అక్కడే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇటీవల జరిగింది. ఇతని స్వస్థలం జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండాపూర్. తమను ప్రభుత్వం ఆదుకోవాలని… గల్ఫ్ మృతుడు రాజనర్సయ్య భార్య బచ్చల జమున సోమవారం (04.07.2022) జగిత్యాల ప్రజావాణి కార్యక్రంలో దరఖాస్తు సమర్పించారు. ఆమె వెంట గల్ఫ్ కాంగ్రెస్ రాష్ట్ర కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఉన్నారు.
తాము నిరుపేద దళితులమని తమ కుటుంబానికి రూ. 10 లక్షల విలువైన దళిత బంధు పథకం మంజూరు చేయాలని ఆమె కోరారు. లేదా ప్రభుత్వం మూడు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించాలని కోరారు. లేదంటే కనీసం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అయినా ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన పెద్ద కూతురు సౌందర్యకు పెళ్లి అయిందని, చిన్న కూతురు సంధ్య డిగ్రీ, కుమారుడు వినయ్, ఇంటర్ చదువుతున్నారని జమున తెలిపారు. తాను దినసరి కూలీ చేస్తున్నాని అన్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ (టిపిసిసి) ప్రవాస భారతీయులు విభాగం (ఎన్నారై సెల్) గల్ఫ్ డివిజన్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి మాట్లాడుతూ… గత ఎనిమిది ఏళ్ళలో గల్ఫ్ దేశాలలో 1,600 మంది తెలంగాణ కార్మికులు చనిపోయారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.