సమస్యలు  సకాలంలో పరిషరించాలి కలెక్టర్ జి.రవి

J.Surender Kumar,
జగిత్యాల, జులై 07:-జిల్లాలోని  ప్రజా సమస్యలు  సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రవి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.  కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, ధరణి పెండింగ్ మ్యూటేషన్, అక్రమ ఇసుక రవాణా నియంత్రణ తదితర అంశాల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో గత వారంలో మండలాల వారీగా సీజ్ చేసిన అక్రమ ఇసుక రవాణా వివరాలు కలెక్టర్ తహసిల్దార్ లను అడిగి తెలుసుకున్నారు.   అక్రమ ఇసుక రవాణా క్షేత్రస్థాయిలో నిలిపివేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో నిఘా పెంచి ఫైన్లు అధిక మొత్తంలో విధించాలని కలెక్టర్ తెలియచేశారు. 
మన ఊరు మన బడి పనులకు అవసరమైన ఇసుకను కేటాయించాలనే, దీనిపై సంపూర్ణ నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆర్డీవోలకు ఆదేశించారు. 
కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్న వాటిని, తాసిల్దారు సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని తోరగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం  ధరణి దరఖాస్తులు, పెండింగ్ మ్యూటేషన్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం మండలాల వారీగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి  నిర్మాణ పనులు జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆర్.డి.ఓ.లను  కలెక్టర్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణశ్రీ, జగిత్యాల,కొరుట్ల, రెవెన్యూ డివిజన్ అధికార్లు, తాసిల్దారు సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


ఎమ్మెల్సీ జీవన్ పరామర్శ!
ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మం.వెల్గొండ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పూదరి గంగాధర్  రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  వారి కుటుంబ సభ్యులను పరమర్శించి ఓదార్చారు.
ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్, మాజీ సర్పంచ్ కొండపల్లి సంతోష్ రావు, కస్తూరి మల్లేశం, పెరక రవి, బండ్రా ప్రశాంత్, లక్కం సంతోష్, తోట నరేష్, లింగం రాజన్న,రమేష్, రాజేష్, రాజు, బీమన్న, సఖిల్,దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు.


జాతీయ సలహా మండలి సభ్యుడిగా సారంగుల అమర్నాథ్!
ధర్మపురి కి చెందిన  సారంగుల అమర్నాథ్ ను కేంద్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ, పశు గ్రాస పరిశ్రమ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ ఈనెల ఐదున పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ కేంద్ర మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాడి, మత్స్య , పౌల్ట్రీ  పశుగ్రాసం, తదితర రంగాల్లో విశేష అనుభవం కలిగిన నిపుణులను ప్రభుత్వం నియమిస్తుంది.

అమర్నాథ్. ఐఐటి పట్టభద్రుడు,  బిహెచ్ఎల్ (BHEL)  హైదరాబాద్ లో కీలక హోదా ( మేనేజర్) విధులు నిర్వహించారు. 2014 లో ప్రధాని మోడీ బృందానికి ,క్యాంపైనింగ్ చేసిన ప్రశాంత్ కిషోర్, (ఐ ప్యాక్) సంస్థకు అమర్ తెలుగు రాష్ట్రాల్లో అనుసంధాన కర్తగా పనిచేశారు. . రెండు తెలుగు రాష్ట్రాల సర్వే ఐటి బృందానికి ఆయన నాయకత్వం వహించారు. ఈ దశలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కోట్లాది రూపాయల వ్యయంతో కాంటాక్ట్స్ అనే పశుగ్రాస పరిశ్రమను ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా మొదటిసారి ప్రమాణస్వీకారం మహోత్సవానికి  సారంగుల అమర్నాథ్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి (PMO)  ప్రత్యేక ఆహ్వానం పంపించారు. అమర్నాథ్ నియామకం పట్ల ధర్మపురి పట్టణ ప్రజలు, పలువురు వ్యక్తం చేస్తున్నారు.

పథకాల ఫలాలను ప్రజలకు అందించాలి: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్


జగిత్యాల జూలై 7:- కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు అందేలా అధికారులు పనిచేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులకు సూచించారు.  ధర్మపురి రోడ్డు లోని సుమంగలి గార్డెన్స్ లో గురువారం జగిత్యాల జిల్లా అభివృద్ధికి సంబంధించి అధికారులతో నిజామాబాద్ ఎంపీ దిశా కమిటీ సమావేశం నిర్వహించారు.
సర్వ శిక్ష అభియాన్!
సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద  2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 75.62 కోట్లు మంజూరు చేసిందని, వరకు దాదాపు 5.85 కోట్ల పనులు జరిగాయని, పాఠశాలలకు విడుదలైన నిధులు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని ఎంపీ అధికారులకు సూచించారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం 60% నిధులు విడుదల చేస్తుందని, పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.


మధ్యాహ్న భోజనం!
మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలో 59698 మంది 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో,  9 నుంచి 10వ తరగతి చదువుతున్న 12711 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం  నిధులతో ప్రతిరోజు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అధికారులు వివరించారు.
మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జిల్లాలో ఏజెన్సీలకు రూ.1.52 కోర్టులో బిల్లులను 18 మండలాలకు విడుదల చేశామని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలు ప్రత్యేకంగా నివేదిక తయారు చేసి అందించాలని ఎంపీ సూచించారు.


నీటిపారుదల!
జిల్లాలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వివరాలను ఎంపీ  తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కలిపి 4 కోట్ల 25 లక్షలతో 5 చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టి పూర్తి చేశామని అధికారులు వివరించారు.
గత రెండు సంవత్సరాల కాలంలో 68 కోట్ల నిధులతో 19 చెక్ డాం పనులకు కేంద్ర సంస్థ 95%  నిధులు రుణం కింద అందించిందని ఎంపీ పేర్కొన్నారు.


ఫసల్ బీమా!
జిల్లాలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 2020 ముందు నమోదు చేసుకున్న రైతులలో క్లెయిమ్ పొందిన వారి వివరాలను నివేదిక తయారు చేసి సమర్పించాలని ఎంపీ అధికారులకు సూచించారు.


కిసాన్ యోజన!
వానాకాలం పంటకు సంబంధించి ఎరువులు సకాలంలో   రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.  ప్రధానమంత్రి కిసాన్ సామాన్ యోజన కింద జిల్లాలో 1,15,999 మంది రైతులకు 70.11 కోట్లు పంపిణీ చేయడం జరిగిందని ఎంపీ తెలిపారు.


రహదారులు!
జిల్లాలో జాతీయ రహదారులు నిర్మాణానికి సంబంధించి భూ సర్వే పనుల పురోగతిని ఎంపీ ఆరా తీశారు.  మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులు నివేదిక అందించాలని ఎంపి అధికారులకు తెలిపారు.


అమృత సరోవర్!
జగిత్యాల జిల్లాలో అమృత్ సరోవర్  కింద గుర్తించిన 75 చెరువు పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4.63 కోట్లు మంజూరు చేసిందని, వీటిని వినియోగిస్తూ చెరువు సుందరీకరణ పనులు పగడ్బందీగా చేపట్టాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలోని 9 వెనుకబడిన  జిల్లాలకు ప్రతి సంవత్సరం  రూ.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, జగిత్యాల జిల్లాలో ఆ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన నివేదిక తయారుచేసి అందించాలని ఎంపీ ఆదేశించారు.
గ్రామాలలో ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు బ్రిడ్జిల నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో త్వరగా ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.


వైద్యశాఖ!
వైద్యశాఖ కింద జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు అందుతున్న వైద్య సేవలు గురించి ఎంపీ చర్చించారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలు మాత్రమే పంపిణీ చేయాలని, ఎమ్మెల్యేల బంధువులు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం అందుతుందని ఎంపీ కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు.దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ జిల్లాలోని అధికారులకు కళ్యాణ్ లక్ష్మి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎమ్మెల్యేలతో మాత్రమే పంపిణీ జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
దిశ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,  సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒక్కొక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం


రేషన్ కార్డు లబ్ధిదారులకు వచ్చే నెలలో ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం కింద కరోనా సంక్షోభం నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పలుమార్లు ఈ పథకాన్ని పొడిగించిన కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు కూడా ఈ పథకం కింద ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మే నెలలో ఈ ఉచిత బియ్యం పంపిణీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది..


నోట్ పుస్తకాల వితరణ:                                                                                                           జడ్.పి.హెచ్.ఎస్ బుగ్గారం ప్రభుత్వ పాఠశాలకు చెందిన పేద విద్యార్థిని విద్యార్థుల సహాయార్థం ఈరోజు 7. 7. 22 న శ్రీ చల్ల జనార్ధన్  SA (BOI.SCI) ధర్మపురి  సంవత్సరానికి సరిపడా అందించిన నోట్ పుస్తకాలను ప్రధానోపాధ్యాయుల సమక్షంలో బుగ్గారం ఉపాధ్యాయ బృందం  విద్యార్థులకు అందజేయడం జరిగింది.        ఈ కార్యక్రమానికి సహాయం అందించిన     చల్ల జనార్దన్ కు బుగ్గారం ఉపాధ్యాయ బృందం తరపున కృతజ్ఞతలు   తెలిపారు.


మూడుకు పెరగనున్న గురుకుల పాఠశాలలు!
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

బడుగు, బలహీన వర్గాలతో పాటు అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించి  ఉన్నతంగా తీర్చిదిద్దడమే ద్యేయంగా తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి యేటాకోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గంలో బీసీ సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి గంగుల తో చర్చించారు. ఎమ్మెల్యే సంజయ్  విజ్ణప్తి మేరకు జగిత్యాలకు మంజూరైన బీసీ స్టడీ సెంటర్ ను ఈ  నెల13 న ప్రారంభించడానికి మంత్రి గంగుల జగిత్యాలకు రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే  స్టడీ సెంటర్ ను తాత్కాలికంగా నిర్వహించేందుకు తన సొంత బిల్డింగ్ ను ఉచితంగా కేటాయిస్థానని ఎమ్మెల్యే మంత్రికి వివరించగా మంత్రి శభాష్ అంటూ ఎమ్మెల్యేను అభినందించారు. కాగా  ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోయే బీసీ గురుకుల విద్యాలయాల్లో మరొకటి జగిత్యాలకు కేటాయించాలని కోరగా మంత్రి వెంటనే స్పందించి గురుకుల పాఠశాల ను మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించినట్లు ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మీపూర్ గురుకులంలో 480 మంది విద్యార్థులు, అల్లీపూర్ గ్రామంలో 480 మంది విద్యార్థులతో రెండు బిసి గురుకుల పాఠశాలలు

కొనసాగుతుండగా, జగిత్యాలకు మరో బిసి గురుకులం మంజూరు కావడంతో జగిత్యాల నియోజకవర్గంలో గురుకులాల సంఖ్య మూడుకు చేరనుండగా మరో480 మంది విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందబోతోందన్నారు. అలాగే ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోయే డిగ్రీ కాలేజీల్లో జగిత్యాల జిల్లాకు ఒకటి మంజూరు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ చేసిన విజ్ణప్తికి మంత్రి గంగుల సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.


ఖిలా మరియు ఈద్గా
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా లో ప్రార్థన చేసేస్థలంలో వర్షం కారణంగా నిలిచి ఉన్న నీటిని తొలగించాలని పెరిగిన చెట్లను తొలగించాలని సూచనలు చేశారు.

లెక్చరర్ సత్య ప్రకాష్ కు డాక్టరేట్!
జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా పని చేస్తున్న M. సత్యప్రకాష్ కు శ్రీ రామానంద తీరథ మరఠ్వాడ యూనివర్సీటీ నాంటెడ్ నుండి Ph.D పట్టా పొందినట్లు విశ్వవిద్యాలయం ప్రకటించినది.  “ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిసిపూయ్టుస్ ఇన్ ఇండియా: ఏకేస్ స్టడీ ఆన్ గోదావరి రిసర్ ” అనే అంశం పై శ్రీరామానంద తీరథ్  మరటావాడ యూనివర్సిటీ పోలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ విశాల్ రావ్ సాహెబ్ పదంగీ, పర్యవేక్షణలో పరిశోధన చేసి పిహెడి  పట్టాను సత్యప్రకాశ్ పొందారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్  Y. సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్  మసురూర్ సుల్తానా, IQAC కో ఆర్డినేటర్ హారీ జ్యోత్ కౌర్, , M. శ్రీనివాస్ రెడ్డి  అధ్యాపకులు  G. చంద్రయ్య, A. జ్యోతిలక్ష్మి, K మానస, జమున, మాధవి, పడాల తిరుపతి తదితరులు అభినందించారు.


మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సంజయ్!
ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు ,వైద్య కళాశాల నూతన భవన నిర్మాణం, నిధులు, తదితర అభివృద్ధి పనుల కోసం ఎదురు కేటాయించవలసిందిగా నివేదిక అందించినట్టు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వివరించారు.