Ndtv టీవీ కొనుగోలు అందుకేనా ?
(J.Surender Kumar)
హోం మంత్రి అమిత్ షా, మీడియా సంస్థల దిగ్గజం, సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త . రామోజీరావుల మధ్య జరిగిన చర్చల సారాంశం రాష్ట్రంలో కమలం పార్టీకి విస్తృత స్థాయిలో కవరేజ్ కల్పించాల్సిందిగా కోరడం కోసమే ? కాబోలు అనే చర్చ నెలకొంది. జాతీయస్థాయిలో ఆ పార్టీకి కవరేజి కోసం బిజెపి పార్టీకి ఆత్మీయుడు, అపర కుబేరుడు, గౌతమ్ ఆదాని NDTV లొ మెజార్టీ షేర్లు కొనుగోలు చేసి ఆ సంస్థ ను సొంతం చేసుకున్నారు. ఆగస్టు 21 రాత్రి రామోజీరావు, అమిత్ షా కలవడం. 23 ఆగస్టు NDTV మీడియా గ్రూపులో మెజార్టీ షేర్లను గౌతమ్ ఆదాని కొనుగోలు చేయడం. కాకతాలీయం అయినా, 48 గంటల వ్యవధిలోనే జరగడం చర్చకు అవకాశం కల్పిస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం, ఆయా రాజకీయపార్టీల, నాయకుల పరస్పర ఆరోపణలు , ప్రత్యారోపణలు తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీల మధ్య నువ్వా? నేనా ? అనే తరహాలో కొనసాగుతున్న వాతావరణంలో, త్వరలో జరగనున్న ఉప ఎన్నిక, రానున్న ఎన్నికల్లో కమలం పార్టీకి రాష్ట్రంలో ప్రధాన మీడియా సంస్థల కవరేజ్ అవసరంను బిజెపి పార్టీ భవిష్యత్తు అవసరాల దృశ్య గుర్తించినట్టు సమాచారం.
మునుగోడు సభతో…
ఆగస్టు 20న అధికార టిఆర్ఎస్ పార్టీ ‘మునుగోడు నియోజకవర్గంలో ‘ భారీ బహిరంగ సభను నిర్వహించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్,. హైదరాబాద్ నుంచి వేలాది వాహనాలతో ( దాదాపు రెండు నుంచి మూడు వేల కార్లతో ) సభస్థలికి చేరుకున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమీషాల పై కేసిఆర్, తన మాటల, తూటాలతో, పలు ఆరోపణలు చేసిన విషయం. తెలిసిందే.. ఈడీలు, మోడీలు, నన్ను ఏమి పి…. లేరని ఘాటుగా విమర్శించారు. .అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రతిష్ట మంటగల్పుతున్నారంటూ, మోడీపై కేసిఆర్ ఆరోపణలు, జాతీయ, అంతర్జాతీయ మీడియాలో, ఎలక్ట్రానిక్ ఛానల్ లో, వివిధ రాష్ట్రాల ప్రాంతీయ మీడియా ల లో కెసిఆర్ ఆరోపణలకు. ఆయా మీడియా సంస్థలు ప్రాధాన్యత కల్పించాయి.

ఈ నేపథ్యంలో మునుగొడులో ఆగస్టు 21న, జరిగిన బిజెపి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్లో రెండుసార్లు స్వల్ప మార్పులు చేసిన విషయం తెలిసిందె. నోవెల్ట హోటల్లో ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, అమీత్ షా తో డిన్నర్, ఫిలిం సిటీ లో మీడియా దిగ్గజం, రామోజీరావు తో, షా చర్చలు విధితమే. తెలుగుదేశం పార్టీతో రానున్న ఎన్నికల్లో పొత్తుల అంశంలో రామోజీరావు తో మోడీ , షా ద్వయంకు చర్చలు జరపాల్సిన అవసరం లేదు అనే చెప్పుకోవాల్సిందే. వారం రోజుల ముందు, ఢిల్లీలో నీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఆజాది కా అమృత మహోత్సవ కార్యక్రమంలో దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో, ప్రధాని మోడీ కరచాలనం, ఐదు నిమిషాలు మాట్లాడిన సంఘటనలను దేశం పార్టీ అనుకూల మీడియా. ఊదరగొట్టడంతో పాటు వాటిపై డిబేట్లు, విశ్లేషణలు. పత్రికల్లో పతాక శీర్షిక ఈ అంశంపై తెలుగుదేశం పార్టీకి, బాబు అద్భుత విజయాలు సాధించినట్లు అనుకూల కథనాలు, ప్రచురితమైన విషయం తెలిసిందే.

తాను ముఖ్యమంత్రిగానే ఏపీ శాసనసభలో అడుగుపెడతానంటూ శపథం చేసిన శాసనసభ సమావేశాలలో నుంచి బయటకు వెళ్లి కన్నీరు, మున్నీరుగా మీడియా ముందు రోధించిన చంద్రబాబు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన. అభ్యర్థులకు ఏపీ అసెంబ్లీ లో అడుగుపెట్టి ఓటు వేయడంతో పాటు, తన శాసనసభ్యులతో ఓట్లు వేయించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ,అమిత్ షా ప్రమేయం లేకుండా ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, అధికార ప్రతినిధులు ఎవరైనా. బాబుతో కానీ, దేశం పార్టీ క్రియాశీల నాయకులతో మాట్లాడినా, వీరిని పలకరించిన, ఉబ్బితబ్బి ఆయి ఆనంద డోలికల్లో ఊగిపోయే తెలుగుదేశం పార్టీ . బిజెపిల మధ్య స్నేహ సంబంధాలు. పునరుద్ధరించడం కోసం రామోజీరావు లాంటి దిగ్గజాలు బిజెపి పార్టీకి అవసరం ఉండకపోవచ్చు , ఉ,అంటే ఉరుకులు , పరుగులతో ఆ పార్టీతో కలవడానికి టిడిపి నాయకులు, అధినేత, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల చర్చించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, 2018- 19 లో ఆ పార్టీతో తెగ దంపులు చేసుకొని. ప్రధాని నరేంద్ర మోడీ పై ఆయన కుటుంబంపై బహిరంగ సభలో వ్యక్తిగత ఆరోపణలతో బాబు దాడి చేశారు. తిరుమల పర్యటనకు వచ్చిన నాటి కేంద్ర హోంమంత్రి . అమిత్ షా కు నల్ల జెండాలతో, నిరసన తెలపడంతో పాటు ఆయన కాన్వాయ్ ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ నేపథ్యంలో బిజెపి పార్టీకి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సినంత అవసరం ఉండకపోవచ్చునేది చర్చ.

మీడియా అవసరం ఉంది కాబోలు.!
రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా
మూడు దినపత్రికలు, మూడు టీవీ చానల్స్, ఇంగ్లీష్ దినపత్రిక, ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియా గా వాటికి ముద్ర పడింది. బిజెపి పార్టీకి రెండు టీవీ ఛానల్లు, ఓ దినపత్రిక మాత్రమే ఉన్నాయి. దేశంలోనే లార్జెస్ట్ సర్కులేషన్ గా కొనసాగుతున్న ప్రాంతీయ దినపత్రిక ఈనాడు నేటికీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఏనలేని పాఠకుల సంఖ్య అత్యధికం, అనేది జగమెరిగిన సత్యం. ప్రముఖ సినీ నటుడు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని, తొమ్మిది నెలల్లో అధికారంలోకి తేవడం, రాష్ట్రంలో మద్యపానానికి నిషేధం అమలు కోసం ప్రచురించిన కథనాలు, నాటి రాష్ట్ర ప్రభుత్వం మద్యపానం నిషేధం అమలు చేయడం, 1995లో ఆగస్టులో సంక్షోభంలో C.M పదవి నుంచి N T R ను తప్పించడం, చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయడంలో రామోజీరావు పత్రిక, ఈనాడు కీలక భూమి క పోషించింది అనే విషయం జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ వాతావరణం, హైదరాబాద్ పట్టణంలో వివిధ సంస్థలపై ఐటి,ఈడి,. దాడులు, రైతుల ఆత్మహత్యలు, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాల ఆరోపణలు, ధరణి వెబ్సైట్ వల్ల రైతుల ఇబ్బందులు, పోడు రైతుల పట్టాలు పంపిణీ అంశం, చిన్నారులు మహిళలపై లైంగిక దాడులు, విద్యార్థుల ఆత్మహత్యలు ఈ వర్షాలు బిజెపి పార్టీ రాష్ట్రంలో చేస్తున్న పోరాటాలు, ఆందోళనలు, ధర్నాల పై లార్జెస్ట్ సర్కులేషన్ పత్రికలో, ప్రచార తీరు, ప్రాధాన్యతల ,పై రాష్ట్ర బిజెపి నాయకత్వం బిజెపి అధిష్టానం కు పార్టీ పట్ల జరుగుతున్న ప్రాధాన్యత అంశాలను వివరించినట్టు చర్చ. ఈ నేపథ్యంలో అమిత్ షా, రామోజీరావు ల మధ్య చర్చలు జరిగినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ( అయితే.వారి మధ్య ఎలాంటి అంశాలపై చర్చ జరిగింది ? ఎందుకు జరిగింది ? అనే విషయం నిఘా సంస్థలకు గాని, ఆయా రాజకీయ పార్టీలకు గాని తెలిసే అవకాశం లేదు,
తెలియకపోవచ్చు, బహుశా ఈ అంశం ల పై చర్చ జరిగింది. అనే ఊహాగానాలు మాత్రమే, తప్పవాస్తవా అంశాలు తెలిసే అవకాశం లేదు )
జూనియర్ ఎన్టీఆర్ తో డిన్నర్ !
ప్రముఖ నటుడు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు, తారక రామారావు తో హోం మంత్రి అమిత్ షా చర్చలు జరపడం ఆయనతో కలిసి డిన్నర్ లో పాల్గొనడం, ఏపీ రాజకీయాల్లో చర్చ అయింది. జూనియర్ NTR కు టిడిపి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని, బిజెపి పార్టీ గెలుపుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారని చర్చలో తదితర అంశాలను పలువురు విశ్లేషించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వివిధ సినిమాలలో నటించడానికి చేసుకున్న ఒప్పందాల మేరకు ఆయన షూటింగ్ షెడ్యూల్, 2005 సంవత్సరం నాటి వరకు ఉన్నట్టు చర్చ. ఒకవేళ బీజేపీ పార్టీకి ప్రచారం చేసిన దక్షిణాది రాష్ట్రాల్లోనే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. జనసేన పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్, పార్టీ జనసేన బిజెపి పార్టీకి ఏపీలో మిత్రపక్షమే. అయితే బిజెపి అధిష్టానం ప్రమేయం లేకుండా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్, బిజెపి పార్టీతో కలసి రాజకీయ వేదికను పంచుకొని అధికార వైయస్సార్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు ,ఆందోళనలు చేపట్టిన సందర్భాలు లేవనే చెప్పుకోవచ్చు. జాతీయ బిజెపి పార్టీ అగ్రనాయకత్వం ప్రమేయం లేకుండా, రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు తదితర అంశాలను, బహిరంగంగా ప్రకటించడం, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు ఉండవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు ప్రకటనలు చేయడం, తెలుగుదేశం పార్టీ తో, నాయకులతో జనసేన పార్టీ భవిష్యత్తులో కలసి పోటీ చేస్తారు అనే ఏపీలో జోరుగా జరుగుతున్నది. దేశం పార్టీ అనుకూల మీడియాలలో, జనసేన పార్టీ కార్యక్రమాలకు ఎనలేని ప్రాధాన్యంతో పాటు, ప్రత్యక్ష ప్రసారాలు చేయడం, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఓసారి, ఇతర పార్టీలతోను, పొత్తు అంటూ అనేక సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొనడం బిజెపి పార్టీ అధిష్టానంకు, అగ్ర నాయకులకు అసహనం కలిగిస్తున్నట్టు చర్చ. ఈ నేపథ్యంలో యూత్ ఫాలోయింగ్ , రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు, ఉన్న నందమూరి వంశానికి చెందినవాడు ట్రెండింగ్ హీరో జూనియర్ NTR ను తెరమీద తేవడంతో పాటు, అవసరం అనుకుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోతో పాటు దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ పక్షాన ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్టు, ఆయనతో బిజెపి పార్టీ అగ్రనాయకత్వం మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా సంకేతాలను బిజెపి అధిష్టానం ప్రత్యక్షంగా చూపించినట్టు చర్చ.

ఆదాని చేతికి ఎన్డిటీవీ !