కాంగ్రెస్ అధికారంలోకి రావడం కు కృషి చేయాలి !
ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి !

(J.Surender Kumar)


జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం పట్టణంలోని జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  నిజాంబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్ కి గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,  కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్  జువ్వడి నర్సింగరావు , తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా పలువురు  వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఐక్యత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి కార్యకర్త నాయకులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.  కాంగ్రెస్ పాలనలో ప్రతి నిరుపేద అభివృద్ధి కోసం  సంక్షేమ పథకాలు పెట్టామన్నారు, నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ , బిజెపి పార్టీ , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల వివరిస్తూ ప్రజలను చైతన్య పరచాలన్నారు.  బిజెపి టిఆర్ఎస్ పాలనలో దేశం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  మోడీ పాలనలో పరిశ్రమలని అమ్మకానికి పెట్టడంతో పాటు నిత్య అవసరలపై సైతం జిఎస్టి వేసి సామాన్యుల నడ్డి విరుస్తున్న అన్నారు.  2023 లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందుకోసం ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలి అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.  జగిత్యాల నుండే సాధారణ ఎన్నికల్లో జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు .
అనంతరం వివిధ మండలాల నాయకులు మాట్లాడుతూ పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని, పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తారన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తూ నాయకులు కార్యకర్తలకు భరోసా ఇస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, ఢిల్లీలో ప్రముఖ స్థానం ఇవ్వాలన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.  టిఆర్ఎస్ పార్టీకి అధికార దాహం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసి ఓట్ల కోసమే పథకాలు అన్నారు.


ధర్మపురి నరసింహుని దర్శించుకున్న రోహిత్ చౌదరి !
జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి ముందుగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమార్, ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు రాయపట్నం నుంచి ద్విచక్ర వాహనాలతో ధర్మపురి క్షేత్రం వరకు  భారీ ఊరేగింపు నిర్వహించి ఘన స్వాగతం పలికారు. 

కమలాపూర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రోహిత్ చౌదరి పూలమాలవేసి నివాళులర్పించారు.


31 న బీహార్ వెళ్లనున్న సీఎం కేసీఆర్ !


ఈనెల 31 వ తేదీ బుధవారం రోజున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బీహార్ పర్యటన చేపట్టనున్నారు. అందులో భాగంగా.. బుధవారం ఉదయం హైదరాబాదు నుండి పాట్నా కు బయలుదేరి వెళ్లనున్నారు.
గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో  అమరులైన 5 గురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
సైనిక కుటుంబాలతో పాటు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని  ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కెసిఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు.
అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.


సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ !


స్టడీ సర్కిల్ –హైదరాబాద్ వారు నిర్వహించనున్న UPSC-CSAT -2023 (సివిల్ సర్వీసెస్) ఉచిత శిక్షణ కు జగిత్యాల జిల్లా అభ్యర్ధుల నుండి ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణా స్టేట్ షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ – హైదరాబాద్ అధ్వర్యంలో నిర్వహించనున్న UPSC-CSAT (సివిల్ సర్వీసు ఆప్టిట్యూడ్ పరీక్ష)- 2023  కొరకు ఉచిత బోజన వసతి సౌకర్యాలతోబంజారాహిల్స్ హైదరాబాద్ నందు ఉచిత శిక్షణ కార్యక్రమానికి అన్నీ జిల్లాలకు చెందిన అర్హులైన ఎస్సి, ఎస్టి, బిసి, స్త్రీ/పురుషుల నుండి ఆన్ లైన్ విధానం ద్వార ధరఖాస్తులను కోరుచున్నారు. ఇట్టి అవకాశాన్ని జగిత్యాల  జిల్లాకు చెందిన  అభ్యర్థులు సద్వినియోగం చేసుకొని సకాలములో దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తువిధానము:
దరఖాస్తుదారులు  www.tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వార ఆన్ లైన్  విధానములో తమ దరఖాస్తు ను పంపవలెను (పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడగలరు)       

                     
అర్హతలు:
👉అన్నీ వర్గాల అభ్యర్థుల వార్షిక కుటుంబ ఆదాయము మూడు లక్షలకు మించరాదు

👉 ఈసంవత్సరం(2022-23) ఏ కళాశాలలోనైనా,ఏదైనా కోర్సుచదువుతున్నవారుగాని(లేదా)ఉద్యోగము చేస్తున్నవారు గాని అప్లై చేయడానికి అనర్హులు

  👉అభ్యర్థులు కనీసము ఏదైనా జనరల్ (లేదా) ప్రొఫెషనల్  కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన వారై ఉండవలెను

👉 అభ్యర్థి UPSC వారు నిర్వహించే CSAT-23 పరీక్ష ఆర్హాతలు కలిగి ఉండవలెను


ముఖ్యమైన తేదీలు: 
👉 చివరి తేదీ : సెప్టెంబర్ 7,2022.
👉ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ:  : సెప్టెంబర్ 18,2022 (ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మద్యహన్నాం 1 గంట 30 నిమిషాల వరకు). 
👉హైదరాబాద్,వరంగల్,నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు


ప్రవేశ పరీక్ష విధానము :


ఆబ్జెక్టివ్ టైప్ విధానం లో ప్రశ్నలు కలిగిన ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ జనరల్ స్టడీస్ సిలబస్ గల పేపర్-1(జనరల్ స్టడీస్ -100 ప్రశ్నలు) పేపర్-2(రీజనింగ్, అర్థమేటిక్ & ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ -40 ప్రశ్నలు). పేపర్-1,లో ప్రతి సరైన సమాధానానికి 2మార్కులు. పేపర్-2, లో ప్రతి సరైన సమాధానానికి 2.5 మార్కులు ఇవ్వనున్నారు, నెగటివ్ మార్కుల విధానం కలదు, ప్రతి తప్పు సమాధానానికి ఒకటి లో ముడవవంతు మార్కులను తొలగిస్తారు
సీట్లు/రిజర్వేషన్/అభ్యర్థుల ఎంపిక విధానం:
  మొత్తము 250 సీట్లలో 200 మంది క్రొత్త వారిని 50 మంది పాతవారిని అంటే గతములో (CSAT-22) కోచింగ్ తిసుకున్నవారిని CSAT-2023 ఉచిత కోచింగ్ లో తిసుకొనున్నారు. మొత్తము సీట్లలో  75% – SC, 10% – ST, 15% – BC లకు కేటాయించగా,ఇందులో మొత్తంగా 33.33 % స్త్రీలకు మరియు 5% దివ్యాంగులకు  కేటాయించారు. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ :040-23546552 లేదా ఈ-మెయిల్ : tsscscexams@gmail
శ్రీ సి. శ్రీధర్ డైరెక్టర్,
టి. ఎస్. ఎస్సి స్టడీ సర్కిల్,
హైదరాబాద్


                          

                                                                              ఎస్టీయూ అకాడమీక్ రాష్ట్ర కన్వీనర్ గా రవి

జగిత్యాల, : రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం అకాడమిక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా శనిగరపు రవి నియమితులయ్యారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సదానందగౌడ్, పర్వతరెడ్డిలు సోమవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఆ నియామక పత్రాన్ని జగిత్యాల జిల్లా ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, మచ్చ శంకర్ లు రవికి అందజేశారు. ఈ సందర్భంగా బైరం హరికిరణ్ మాట్లాడుతూ వెల్గటూర్ మండలంలోని ఎండపెల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవి గత 20 ఏండ్లుగా ఉపాధ్యాయ, విద్యారంగ ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. కరీంనగర్ జిల్లా తాజా మాజి జిల్లా అధ్యక్షులుగా, సంఘ నిర్మాణానికై చేసిన కృషి ఫలితమే ఈ నియామకం అని అన్నారు. అనంతరం శనిగరపు రవి మాట్లాడుతూ తన నియామకానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని, విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు

.


ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలి !తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య


రాష్ట్రంలో  ఉపాధ్యాయుల అన్ని క్యాడర్ల ప్రమోషన్లు బదిలీలు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య కోరారు, జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల్లోని పలు పాఠశాలలను సందర్శించి ఆ సంఘ సభ్యత్వం నమోదు చేస్తూ ఉపాధ్యాయులతో మాట్లాడారు.. ఏడేళ్లుగా ఉపాధ్యాయులు బదిలీలు ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్నారని వెంటనే షెడ్యూల్ విడుదల  బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.. వెనువెంటనే డీఎస్సీ నిర్వహించి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో తపస్ జగిత్యాల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుర్మాచలం రఘునందన్.. గుండు వెంకట రామకృష్ణ.. పట్టణ ప్రధాన కార్యదర్శి శనిగరపు రాజేందర్.. జిల్లా కార్యదర్శి కస్తూరి శ్రీధర్.. నర్సయ్య..శ్రీనివాస మూర్తి.. రవీష్ కుమార్ ..నాగమల రమేష్ ..జయ.. మురళి రవీందర్..ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు…