మునుగోడు ప్రజాదీవెన సభలో ….
ఈడిలు కాదు, బోడీలు పెట్టుకో
ఏం పీక్కుంటారో పీక్కొండి. సీఎం కేసీఆర్ !
నా బలం..నా ధైర్యం మీరు.
( J.Surender Kumar)
నల్గొండ జిల్లా మునుగోడు లో శనివారం జరిగిన ప్రజా దీవెన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సహజ ధోరణిలోనే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ల ను మాటల తూటాలతో సవాల్ చేశారు.

సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఆయన మాటలలో ..
- దేశంలో విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బ్యాంకులు, ఎల్‌ఐసీలు అన్నీ అమ్ముతున్నారు
- రైతులపై భారం మోపేందుకు భాజపా కుట్ర చేస్తోంది
రైతులు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఇప్పుడు చెప్తోంది నష్టాలు వచ్చి రైతులు సాగు బంద్ చేయాలనేది భాజపా కుట్ర - రైతులు సాగు బంద్ చేస్తే… కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తున్నారు
- రైతుల భూములను అంబానీ, అదానీ లాంటి వాళ్లకు అప్పగించాలని చూస్తున్నారు
- నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోంది

- మునుగోడులో ఉపఎన్నిక ఎందుకు వచ్చింది ?
మరో ఏడాది ఆగితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి - ప్రగతిశీల శక్తులు ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని చెప్పాం
- తెరాసకు మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలకు కృతజ్ఞతలు
- మునుగోడు నుంచి దిల్లీ వరకు ఐక్యత కొనసాగాలి
- విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఏవీ మనకు రాలేదు
- కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే 8 ఏళ్లుగా తేల్చటం లేదు
- కృష్ణా జలాల్లో మీకు వాటా ఇచ్చేది లేదని చెప్పేందుకు అమిత్ షా వస్తున్నారా?
- తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు, సాధించేవరకు పోరాడుతూనే ఉంటాం
- కృష్ణా జలాల్లో వాటా గురించి భాజపా నేతలు మోదీ, అమిత్ షాను ఎప్పుడైనా అడిగారా?
- కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి రేపు మునుగోడులో చెప్పాలని అమిత్‌షాను అడుగుతున్నా
- భాజపా 8 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా?
*విమానాశ్రయాలు, రైల్వేలు, పోర్టులు, బ్యాంకులు, ఎల్‌ఐసీలు అన్నీ అమ్ముతున్నారు - మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధ పడిందో తెలుసు
- ఫ్లోరైడ్ బాధితుడిని దిల్లీకి తీసుకెళ్లి చూపించినా మన మొర ఎవరూ వినలేదు
- గతంలోని ఏ పాలకుడు మునుగోడు ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదు
- 15 రోజులు జిల్లాలో తిరిగి ఫ్లోరైడ్ కష్టాలపై అవగాహన కల్పించాం
- అందరి పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం:
- ఇప్పుడు మిషన్ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోరైడ్ జిల్లాగా మారాం
- నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు
- మేధావులు హెచ్చరించినా… ఫ్లోరైడ్ గురించి గత పాలకులు ఆలోచించలేదు
- నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా… ప్రజలకు తాగునీళ్లు అందలేదు
- తెరాసకు మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలకు కృతజ్ఞతల

- C P I నాయకుడు . పల్లా వెంకట్ రెడ్డి ప్రసంగంలో
- *మునుగోడు ప్రజాదీవెన సభలో పాల్గొన్న సీపీఎం నేతలు
తెరాసకు మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలు 4 సార్లు తెదేపా, ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో గెలిచాం – - హుజూర్‌నగర్, నాగార్జునసాగ ర్ ఉపఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇచ్చాం
- మేం ఎవరికి ఇచ్చినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపలేదు:
*మతోన్మాదమే భాజపా అజెండా: - కేసీఆర్ దేశ రాజకీయలపై వామపక్షాలతో చర్చించారు:
- దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది:
- రాజగోపాల్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని భాజపా ఇక్కడకు రావాలని చూస్తోంది:
- తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. భాజపా అని నిరూపించాలని చూస్తోంది
*ఎన్నికలు వేరు, రాజకీయ పోరాటం వేరు:
మంత్రి జగదీష్ రెడ్డి, ప్రసంగంలో..

- ఎడారిలాంటి జిల్లాను సీఎం సస్యశ్యామలంగా మార్చారు
- 2014కు ముందు మునుగోడులో దీన పరిస్థితులు ఉండేవి
- నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని సీఎం కేసీఆర్ పారదోలారు
*గతంలో కేసీఆర్ ఎక్కడికెళ్లినా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ గురించి చెప్పేవారు - భవిష్యత్‌లో నల్గొండకు ఏదైనా చేస్తే ముందు ఫ్లోరైడ్ నివారణే అని సీఎం ఆనాడు చెప్పారు
- మునుగోడు ఉపఎన్నికలో తెరాసకు సీపీఐ నేతల మద్దతు ప్రకటించారు.
మునుగోడు ప్రజాదీవెన సభకు భారీగా. వివిధ గ్రామాల నుంచి ర్యాలీలుగా బోనాలు, కోలాటాలతో మునుగోడు సభకు తరలివచ్చారు. సభ వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం నివాళులర్పించి సీఎం కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు.
నివాళులు !

భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా శాసన మండలి సభ్యులు టి.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ధర్మపురి బైపాస్ రోడ్డు లో గల రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పదమూడు లక్ష్మణ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బండ శంకర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ద్విచక్రవాహనం పై 32 ఈ -చాలన్లు వసూలు!
పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై ఎల్. రామ్ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఓ ద్విచక్రవాహనానికి 32 ఈ – చలాన్లు పెండింగ్ లో ఉన్నట్టు గుర్తించారు., టిఎస్03 ఈ జి 0399 నంబర్ గల ద్విచక్ర వాహనం పై 32 చలాన్లు ₹ 5750 పెండింగ్ లో ఉండటంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించగా, వాహన యజమాని పెండింగ్ లో ఉన్న చలాన్లు చెల్లించి తీసుకెళ్ళారు.

ఉచితంగా మధుమేహ, రక్త పరీక్షలు నిర్వహణ !
జగిత్యాల క్లబ్ ఆధ్వర్యంలో… రోటరీ-ఆపి-రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని క్లబ్ ఆవరణలో ఉచిత మధుమేహ, రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు. క్లబ్ సెక్రటరీతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఎవిఎల్ఎన్ చారి,రోటరీ-ఆపి ప్రతినిధులు, కొత్త ప్రతాప్, త్రివేణి విద్యాసాగర్, ఎన్నాకుల అశోక్, క్లబ్ కార్యవర్గం, సభ్యులు పాల్గొనగా, నర్సింగ్ కళాశాల విద్యార్థినుల సహకారంతో పాథలాజికల్ టెక్నిషియన్ నర్సయ్య తదితరులు మధుమేహ, రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 22 వరకు చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో, ప్రభుత్వ కార్యక్రమాలకు తోడుగా ఉచితంగా మధుమేహ, రక్త పరీక్షలు నిర్వహించామన్నారు.

వరద బాధితులకు బియ్యం పంపిణీ
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సహకారంతో..
పంపిణీ చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి వరద ముంపుకు గురయిన సుమారు 400మంది బాదితకుటుంబాలకు టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణ కేంద్రంలో శనివారం జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బియ్యం పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంఘనబట్ల దినేష్, మునిసిపల్ ప్లోర్ లీడర్ వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్ గరిగే అరుణ, వేముల రాజేష్, చిలుముల లక్ష్మణ్, సింహారాజు ప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, సీపతి సత్యనారాయణ, రాందేని మోగిలి, అయ్యెరి మహేష్, సుముఖ్, ఎదులపురం మహేందర్ ,స్తంభంకాడి గణేష్, బొంది లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు..