అవసరాలు తీర్చే ఖిల్లా.. జగిత్యాల జిల్లా !

ఆజాదికా  అమృత్ మహోత్సవం” సందర్భంగా..

( J. Surender Kumar )
పోరాటాల పురిటి గడ్డగా, బాంచన్ కాల్మొక్త అనే  బానిస బతుకుల నుండి, బంధుకులు పట్టుకొని బయటి  ప్రపంచాన్ని అబ్బురుపరిచి ఆకాశం ఎత్తున ఎగిసిన ఆత్మగౌర పోరాట యోధులను కన్న గడ్డగా, చరిత్ర  పుటలలో లిఖించబడిన  జగిత్యాల జిల్లా, సమాజ అవసరాలు తీర్చే ఖిల్లా గా  కొనసాగుతున్నది. చట్టసభలలో ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న, ప్రజాప్రతినిధులు, మేధావులు, చరిత్రకారులు, భావి తరాల భవిష్యత్తు అవసరాలను దూర దృష్టితో, విద్య, వైద్యం, సాగు, తాగు నీటి వసతులు,  ఉద్యోగ ,ఉపాధి ,మౌలిక వసతుల సదుపాయ కల్పన కోసం వారు చేసిన, చేస్తున్న కృషి అభినందనీయం, ప్రశంసనీయం.

JNTU NACHUPALLI


విద్య వైద్యం !

కొడిమ్యాల మండలం నాచుపల్లి లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, కోరుట్ల పట్టణంలో పశు వైద్య కళాశాల, జగిత్యాల రూరల్ మండలం  పొలాస గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ డిగ్రీ కళాశాల,

కోరుట్ల లో పశువైద్యకాలేజ్

చలిగల్ లో రైతు శిక్షణ  పరిశోధన కేంద్రం, జగిత్యాల శివారు గ్రామం నూకపల్లిలో నాక్ శిక్షణ కేంద్రం, పట్టణంలో నర్సింగ్ కళాశాల, 

agriculture&poltectin college

ఈ విద్యా సంవత్సరం ఆరంభం కానున్న వైద్య కళాశాల, జగిత్యాల పట్టణంలో 500 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు.. మాతా శిశు సంరక్షణ కేంద్రం, కోరుట్లలో మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల. ఐటీ ఐ, ప్రైవేటుగా తెలుగు పండిట్ శిక్షణ కళాశాల, బీఈడీ కళాశాల లతో పాటు జగిత్యాల,

మెడికల్ కాలేజీ.

కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ ,పట్టణాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ప్రైవేట్, జూనియర్ , డిగ్రీ కళాశాలు  ధర్మపురి క్షేత్రంలో “తెలుగు సంస్కృత కళాశాల” లు ( నైట్ కాలేజ్ )  కొనసాగుతున్నాయి.

నిజామ్ సుగర్ ఫ్యాక్టరీ.


మూడు డివిజన్లు, ఐదు మున్సిపాలిటీలు !


జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో  కోరుట్ల, మెట్టుపల్లి, జగిత్యాల రెవెన్యూ డివిజన్లుగా,  3 పోలీస్ సబ్ డివిజన్లో ఉన్నాయి.  జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్టుపల్లి, మున్సిపాలిటీలు,  కోరుట్ల , జగిత్యాల లో వాహనాల తనికి కార్యాలయలు ( RTO ) జగిత్యాల, మల్యాల, కోరుట్లలో, సబ్ రిజిస్టర్ కార్యాలయలు,  జగిత్యాల్ పట్టణంలో ఏడు కోర్టులు, ఫోక్స్ కోర్టుతో కలుపుకొని. మెట్టుపల్లి , కోరుట్ల  ధర్మపురిలో కోర్టులు, ముత్యంపేటలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ( ప్రస్తుతం మూతబడి ఉంది 1982 లో బోధన్ నిజం షుగర్ ఫ్యాక్టరీ కి అనుబంధంగా ఏర్పాటు చేశారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు రైతులకు తెలియపరచడం కోసం ) 

రైల్వే స్టేషన్.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్  కాలువలు, వరద కాలువ,  ‘కాడ’ కార్యాలయం ( కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కార్యాలయం ) రైలు మార్గము, దక్షిణాది లో అతిపెద్ద మామిడి మార్కెట్, నేరుగా ఢిల్లీ, విదేశాలకు ఎగుమతి, జగిత్యాల, కోరుట్ల, మెట్టుపల్లి లలో ఆర్టీసీ బస్సు డిపోలు, మెట్టుపల్లి పట్టణంలో, ఖాది బండార్, దానికి కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి.

నక్షత్రం ఆకారం లో గలఖిలా.


ప్రభుత్వ భూములను కాపాడారు !


జగిత్యాల, కోరుట్ల ,మెట్టుపల్లి పట్టణాల పరిధిలో ప్రభుత్వానికి మరియు SRSP కి చెందిన వందలాది ఎకరాల భూమి , పరం పోగు, తదితర భూములను నాటి, నేటి ప్రజా ప్రతినిధులు,అధికార యంత్రాంగం, కబ్జాలకు, ఆక్రమణలకు గురికాకుండా కాపాడడం ప్రశంసనీయం.

ఖిలా దారి.

ప్రస్తుతం నూతన జిల్లాగా ఆవిర్భవించిన జగిత్యాల పట్టణ  నడిబొడ్డున శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్యాంపు భూములే  నూతన కలెక్టరేట్ భవన సముదాయానికి, పోలీస్ , కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలకు  వైద్య కళాశాల ల నిర్మాణాలకు దిక్కయ్యాయి. 

ప్రభుత్వభూములు.

జిల్లాను ఆనుకొని మంచిర్యాల్, నిర్మల్ జిల్లాల సరిహద్దు గా ప్రవహిస్తున్న గోదావరి సాగునీటి, అవసరాలతో పాటు అనేక ఎత్తిపోతల పథకాలతో. వ్యవసాయ భూములకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. దట్టమైన అడవులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టు , బీర్పూర్  నరసింహాలయం, పెంబట్ల కోనాపూర్ దుబ్బ రాజన్న ఆలయం,  పొలాసలో పోలీస్టేశ్వరాలయం, రాయికల్  లో పురాతన  త్రికుటాలయం,  

పిరంగిలు

1747 లో మొగల్ రాజుల కాలంలో జగిత్యాల పట్టణంలో ఫ్రెంచ్ దేశ ఇంజనీర్ల రూపకల్పనలో నక్షత్రాకారం లో కోటను నిర్మించారు. నేటికీ ఆ కోట చెక్కుచెదరలేదు నూతన జిల్లా ఆవిర్భావం తర్వాత స్వాతంత్ర దినోత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి  యంత్రాంగం ఖిల్లా ను  వినియోగించుకుంటున్నారు. శాతవాహన రాజుల చరిత్రను ప్రపంచానికి

తెలియజేసిన కట్టడాలు, అక్కడ లభించిన పురాతన నాణలు, కోటిలింగాల పుణ్యక్షేత్రం , కోరుట్ల పరిధిలో అరుదైన సైఫాన్ నిర్మాణం, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఊడలమర్రి,. 

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం

భూమికోసం వెట్టీ చాకిరివిముక్తి కోసం, దున్నేవాడికే భూమి అంటూ నిర్వహించిన  “జగిత్యాల జైత్రయాత్ర”.  విప్లవాల ఉద్యమల చరిత్రలో  చిరస్థాయిగా నిలిచిపోయింది.

మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు, ఉరఫ్ గణపతి, స్వగ్రామం ఇదే జిల్లా బీర్పూర్. పురాతన కట్టడాలతో చరిత్రకారులు, కళాకారులు, రచయితలు,

ఖాదీ.బోర్డు

సాహితీవేత్తలు, దేశ రక్షణ కోసం సైన్యంలో కొనసాగుతున్న వీర సైనికులు స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ సినీ డైరెక్టర్లలు,  నటులు, నిర్మాతలు, పుట్టిన జిల్లా జగిత్యాల.
సమాజ అవసరాలు తీర్చే ఖిల్లా గా, జగిత్యాల జిల్లా అని గర్వంగా చెప్పుకోవచ్చు కాబోలు.!

జగిత్యాల లో కోర్టు భువన సముదాయం

ప్రభుత్వ పాఠశాలకు పవర్.. సౌకర్యం ఎప్పుడో ?

పవర్ లేని ప్రభుత్వ పాఠశాల.

75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ తరుణంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు  పవర్. ( విద్యుత్తు )సౌకర్యం లేకపోవడం బాధాకరం.
అది ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలోని పాఠశాల కాదు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శేక్కల పంచాయతీ శివారు గ్రామం రాపల్లి లోనే ఉంది.
కేవలం రెండు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయగలిగితే ఆ పాఠశాలకు విద్యుత్ సౌకర్యం ఎప్పుడో వచ్చేది.  అధికారుల ప్రజా ప్రతినిధులు, అలసత్వమో, నిధుల కొరతనొ ,తెలియదు గాని గత కొన్ని సంవత్సరాలుగా పాఠశాలకు విద్యుత్ సౌకర్యం లేదు.   ఆజాధికా అమృత మహోత్సవంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన  పాఠశాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు  జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.. మహోత్సవాలు ముగింపు నాటికైనా ఆ ప్రభుత్వ పాఠశాలకు పవర్ ( విద్యుత్ ) యోగం ఉందో లేదో వేచి చూద్దాం.