మానసిక ఉల్లాసంతో క్రీడలలో పాల్గొనాలి !
కలెక్టర్ జి. రవి

( J. Surender Kumar)
సోమవారం వివేకానంద మినీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ దిగ్గజం ధ్యాన్ చాంద్ జయంతిని పురస్కరించుకొని ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లప్పుడు కార్యాలయ పనులతో బిజీ గా ఉండే ఉద్యోగులు, అధికారులు మానసిక ఉల్లాసంతో క్రీడల్లో పాల్గొని భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో డి.వై.ఎస్.ఓ. నరేష్, జెడ్పి సీ.ఈ.ఓ. రామనుజచారర్యులు, మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, అధికారులు, టి.ఎన్.జి.ఓ.లు, తదితరులు పాల్గొన్నారు.


ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో!


పెండ్యాల బాలకృష్ణ మనుమని జన్మదినం పురస్కరించుకొని రెండు వాలీబాల్ కిట్స్ ఇవ్వడం జరిగింది.
గర్ల్స్ హై స్కూల్ ZPHS హై స్కూల్ ఈ కార్య్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు Dr I రామకృష్ణ,DC అశోక్ పట్వారీ, మరియు సభ్యులు .రాజేశ్వర మనోహర్ రావు ,వెంకటేశ్వర వినోద్ రావు , ట్రెజరీ సిరుపతి రాజన్న సెక్రెటరీ పైడి మారుతి రంగ శంకరయ్య , వోజ్జల మోహన్ రంగ హరినాథ్, పేద్ది శివ,గోపథి వెంకటేశ్వర్లు, చిలుక రామన్న తదితరులు పాల్గొన్నారు


ప్రజావాణిలో సమస్యలకు సత్వర పరిష్కారం


ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 33 మంది ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణశ్రీ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.


పర్యావరణాన్ని కాపాడుదాం.. మట్టి గణపతిని పూజిద్దాం.
ప్రజావాణి అనంతరం ఐ ఎం ఏ హాల్లో మట్టి గణపతి ప్రతిమలను జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణ శ్రీ లతో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటానికి మట్టి గణపతులను పూజించాలని, వాతావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని, పర్యావరణాన్ని సంరక్షిద్దామని మట్టి గణపతిని పూజిద్దాం అని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, అరుణ శ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్.డి.ఓ.లు మాధురి, వినోద్ కుమార్, డి.ఆర్.డి.ఓ. వినోద్, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, జిల్లా పంచాయతి అధికారి హరి కిషన్, ఎల్.డి.యం. వెంకట రెడ్డి, సి.పి.ఓ పూర్ణ చందర్, డి.వై.ఎస్.ఓ నరేష్, బి.సి.,ఎస్సి వెల్ఫేర్ కో-ఆర్డినేటర్లు వెంకట రమణ, హరి ప్రసాద్, డి.యం. మార్క్ ఫెడ్ దివ్య భారతి, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, ఆటవి శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సత్యమ్మ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయి బాబా, షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి నరేష్, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


సంక్షేమంలో నంబర్ వన్ . తెలంగాణ !
ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్.


జగిత్యాల పట్టణ 6,7,8,9 వార్డుల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన 191 ఆసరా పెన్షన్ కార్డ్ లను జగిత్యాల పట్టణ వికెబి ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు అందజేసి అనంతరం వార్డులకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు,13 మంది ఆడబిడ్డలకు 13 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ .
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,కమిషనర్ స్వరూప రాణి ,జిల్లా కౌన్సిలర్ ఫోరం అధ్యక్షులు పంబాల రామ్ కుమార్, అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా రైతు ఐక్య వేదిక అధ్యక్షులుగా నల్ల రమేష్ రెడ్డి !
జగిత్యాల జిల్లా కేంద్రం లో రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ ఎన్నిక జరుగగా ఇబ్రహీంపట్నం మం. కేంద్రానికీ చెందిన నల్ల రమేష్ రెడ్డి, ఉప ఉపాధ్యక్షులుగా మేడిపల్లి మం. పోరుమల్ల గ్రామానికి చెందిన మిట్టపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గా ధర్మపురికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి, సహాయ కార్యదర్శి గా వంతడుపుల అంజయ్య మరియు గౌరవ అధ్యక్షులుగా పన్నాల తిరుపతి రెడ్డి లను రైతు ఐక్య వేదిక సభ్యులు ఎన్నుకోన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీకులుగా, అన్నేడి మనోహర్ రెడ్డి, మారు సాయిరెడ్డి, దారిశెట్టి రాజేష్, పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, జిల్లా రైతు సమన్యాయ సమితి అధ్యక్షులు చిట్టీ వెంకట్రావు మరియు సందీప్ రావు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.


రాయికల్ మండలంలో!
488 మంది లబ్ధిదారులకు పెన్షన్ కార్డుల పంపిణీ!


రాయికల్ పట్టణ పద్మశాలి సంఘం, వైశ్య సంఘం గుడి కోట లో రాయికల్ మున్సిపల్ లో నూతనంగా మంజూరైన 488 మంది లబ్ధిదారులకు పెన్షన్ కార్డ్ లని,8 మందికి 2,50,000 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను,ముగ్గురికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, పాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, AMC ఛైర్మెన్ గాన్నే రాజిరెడ్డి,హనుమాన్ దేవాలయం ఛైర్మెన్ సత్యనారాయణ,కౌన్సిలర్ లు శ్రీధర్ రెడ్డి,కాంతా రావు,మహేందర్,మహేష్,సునీత,అన్వరి భేగాం,సాయి,పట్టణ యూత్ అధ్యక్షుడు రామ్మూర్తి,సదర్ షేక్ హుస్సేన్,ముబీన్,మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్,ఇంఛార్జి
కమిషనర్ సంతోష్,

నాయకులు , కార్యకర్తలు,అధికారులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.