మార్కెట్లోకి ప్రమాద రహిత ఫైబర్ (వంట) సిలిండర్లు !


( J.Surender Kumar)
నూతనంగా మార్కెట్లోకి వచ్చిన (ఎల్పిజి )వంట గ్యాస్ సిలిండర్లతో ఎలాంటి ప్రమాదాలు ఉండవు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు దేశవ్యాప్తంగా ప్రమాద రహిత ఫైబర్ సిలిండర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వీటికి ‘ఇండియన్ కాంపోజిట్ సిలిండర్లు’ .గా పేరు పెట్టారు

.
వివరాల్లోకి వెళితే. దేశవ్యాప్తంగా గృహిణిలు, హోటల్లు, రెస్టారెంట్లు, దాబాలలో వినియోగించే ఎల్పిజి సిలిండర్లు, ఇనుము, ఇతర ఖనిజం తో తయారైనవి. ఏదైనా సందర్భంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ల పేలుడు వల్ల సంభవించినప్పుడు ప్రాణా నష్టం తో, పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిన సందర్భాలు అనేకం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేక ప్రయోగాలు జరిపి మూడు, పొరలు గల బుల్లెట్ ప్రూఫ్, ఫైబర్ సిలిండర్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

లోపలి భాగం అధిక సాంద్రత కలిగిన పాలిథిన్ పోర , రెండవ భాగం లో ఫైబర్ గ్లాస్ కోటింగ్ పోర ఉంటుంది. సిలిండర్ పైభాగం ( మూడవ పోర).అధిక సాంద్రత కలిగి పాలిథిన్ తో తయారు చేశారు.

ఫైబర్ సిలిండర్ ప్రత్యేకతలు !

  • మార్కెట్లో 5, 10 కిలోల లిక్విడ్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
  • సిలిండర్ లో గ్యాస్ వినియోగం, నిలువలు, స్పష్టంగా అగుపిస్తాయి. దాంతో సిలిండర్ ఎప్పుడు అయిపోతుంది అనే విషయం ముందస్తుగా తెలిసే అవకాశం ఉంటుంది.
  • ఏదేని సందర్భంలో వంట గదిలో ప్రమాదాలు సంభవించితే. ఫైబర్ సిలిండర్ పేలదు. భారీ స్థాయిలో అగ్నిప్రమాదం సంభవించిన, సిలిండర్ ఉబ్బుతుంది, లేదా కారు టైర్ పంచర్ అయిన విధంగా శబ్దం వస్తుంది.
  • ఇనుప సిలిండర్ ఖాళీ 16.3 కిలోలు బరువు ఉండగా. ఫైబర్ సిలిండర్ లిక్విడ్ గ్యాస్ 10 కిలో తో కలిపి 16.3 కిలోల బరువు ఉంటుంది. మహిళలు ఎవరి సహాయం అక్కర్లేకుండా అమర్చుకోవడం , తరలించడానికి వీలవుతుంది.
  • సిలిండర్ తరలింపులో ఫ్లోరింగ్ గీతలు పడవు, సిలిండర్ తుప్పు పట్టదు.

ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ లో …


ఫైబర్ సిలిండర్ లు ప్రస్తుతం తెలంగాణలోనీ అన్ని మున్సిపాలిటీ ల లో ‘ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ’ ల లో పరిమిత సంఖ్యలో ( కొన్ని సిలిండర్లు మాత్రమే ) అందుబాటులో ఉన్నాయి.

*. 10. కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కు. డిపాజిట్ ₹3350/- 5. కిలోల గ్యాస్ సిలిండర్ కు ₹ 2150/- వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది.

  • గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఫైబర్ సిలిండర్ కావాలి అనుకుంటే. తాము వినియోగించే సిలిండర్ ను సరెండర్ చేసి. దానికి గతంలో చెల్లించి డిపాజిట్ రుసుము మినహాయించి, మిగతా సొమ్ము చెల్లించినట్లయితే ఫైబర్ సిలిండర్ వినియోగదారుడికి గ్యాస్ ఏజెన్సీ వారు అప్పగిస్తారు.
  • రిఫిల్ సిలిండర్ కోసం పాత పద్ధతిలోనే బుకింగ్ సౌకర్యం ఉంటుంది. గతంలో మాదిరిగా వినియోగదారుడికి డోర్ డెలివరీ ఉంటుంది.

భారత ప్రభుత్వం రక్షణ ముందు అనే లక్ష్యంతో ( safety first ) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థను ఆదేశించడంతో ఫైబర్ సిలిండర్లు ప్రమాద రహిత సిలిండర్లుగా రూపుదిద్దుకున్నాయని గ్యాస్ ఏజెన్సీ డీలర్లు వివరిస్తున్నారు .