J. Surender Kumar,
ప్రముఖ పురాతన పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ( శివాలయం ) భక్తజనం పాలిట నయానందకరం గా మారింది. శివాలయ అభివృద్ధి పనులకు భక్తజనం ద్వారా విరాళాల వెల్లువ వరదల పారింది. ఫలితంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, భక్తిశ్రద్ధలు చిత్తశుద్ధితో శివుడికి దాదాపు ₹30 లక్షల విలువ గల కళా నైపుణ్యంతో అబ్బురపరిచే వెండి పందిరిని చేయించి స్వామివారికి అలంకరించడంతో,పాటు స్వామివారి పానా పట్టం, గర్భాలయం అందంగా తీర్చిదిద్దారు.

ప్రధానంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఈశాన్య గణపతి ఆలయంలో కేవలం ఐదుగురు భక్తులు మినహా, పూజలు, ప్రదక్షిణాలు, అభిషేకాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించలేని దుస్థితిలో ఉండేది. ప్రస్తుతం గ్రానైట్ రాయితో విశాల పరచడంతో పాటు వాస్తు, ఆలయ ప్రామాణికాలకు, భంగం కలగకుండా సుందరంగా తీర్చిదిద్దారు.

వినాయక స్వామి అభిషేక జలాలు , అపవిత్రం జరగకుండా ఏర్పాట్లు చేశారు. చెట్లు చెత్తా, చెదారాలలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పడిఉన్న రాతి నంది విగ్రహాలను ( కొద్దిపాటి భిన్నం అయిన వాటిని ) ఆలయ ప్రాంగణంలో ని ఖాళీ ప్రదేశంలో వేదిక నిర్మించి వాటిపై ఉంచారు.

ఆ విగ్రహాలను, నాటి శిల్పకళ నైపుణ్యాన్ని చూస్తూ భక్తజనం అద్భురపడుతున్నారు. శివాలయంలోగల శ్రీ శారదా దేవి, శ్రీ ఆదిశంకరాచార్యుల, విగ్రహాల వేదిక ప్రాంగణం కు, గ్రిల్స్ ను ఏర్పాటుచేసి భక్తజనంకు వారి సంపూర్ణ రూపం అగుపించేలా చర్యలు చేపట్టారు .

శివాలయంలో గల పార్వతీ సమేత పరమేశ్వరుడు ( లింగాకారంలో ఉండే శంకరుడు, ఇక్కడ పార్వతిని తొడపై కూర్చుండ పెట్టుకున్న శంకరుడి అపురూప విగ్రహం ఈ ఆలయ ప్రాంగణంలో వందలాది సంవత్సరాల నుంచి ఉంటున్నది, భినం అయినా విగ్రహం.) సప్తమాతృకలు, తదితర అపూర్వ శిల్పకళా నైపుణ్యం తో గల విగ్రహాలను నిపుణులతో శుభ్రపరచి వాటి పేర్లను, కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.

ఆలయం మొత్తం నల్ల రాతి గ్రానైట్ తో పాటు సాంప్రదాయబద్ధ రంగులు వేశారు. భక్తజనం సేద తీర్చుకోవడానికి పదుల సంఖ్యలో సిమెంటు బెంచ్ ల తో పాటు ప్రహరీ చుట్టు పూల చెట్లు, గ్రీనరీని అహల్లాదకర వాతావరణము ఏర్పాటు చేశారు .
శివుడి కళ్యాణ వేదిక, హోమశాల.

వందలాది సంవత్సరాల నుంచి ఉన్న రావి చెట్టు, హనుమంతుడి విగ్రహం, వాటి చుట్టూ సిమెంట్ తో. భక్తజనం కు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రదక్షిణాలు చేయడం కోసం ఏర్పాటు చేశారు. నవగ్రహ మండపంను సుందరంగా తీర్చిదిద్దారు.
శివాలయ ప్రవేశద్వారం వద్ద బారికేట్లతో గ్రీనరీ తో పాటు అతి పురాతనమైన ఓ రాతి మంటపం,

పరిసరాలు, టిఫిన్ బండ్లును తొలగించి భక్తుల సౌకర్యార్థం (పశువులు జంతువులు ) రాకుండా ఏర్పాటు చేశారు . విద్యుత్తు అంతరాయం కలగకుండా ఉండేందుకు కమిటీ సభ్యులు ఇన్వైటర్ ఏర్పాటు చేశారు. పువ్వుల, గ్రీనరీ చెట్ల మొక్కలను స్థానిక మున్సిపల్ శాఖ అందించారు.
అదనంగా అర్చకులు ఏర్పాటు చేయాలి !
భక్తజనులకు నయానందకరంగా తీర్చినా శివాలయంలో అదనంగా మరో ఇద్దరు అర్చకులను నియమించుటకు అభివృద్ధి కమిటీ సభ్యులు కృషి చేయాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేకంగా గణపతి ఆలయంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందించడానికి, ప్రతి మంగళవారం, సంకష్ట చతుర్థి, తదితర పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి నియమించాలని, భక్తజనంకు అగుపించేలా పెద్ద పెద్ద హుండీలను ఏర్పాటు చేయాలని. దాతలు అందించే విరాళాలు స్వీకరించడానికి ఉద్యోగినీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది

. దీంతోపాటు స్వామి వారికి నిత్యం ప్రాతః కాలంలో గోదావరి నది జల లా తో అభిషేకం, సాయంత్రం ప్రదోష, పూజది కార్యక్రమాలు భక్తజనంకు వినిపించేలా మైక్ సిస్టం ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు,సెక్యూరిటీని కూడా పెంచాలని భక్తజనం కోరుతున్నారు. ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో కోతుల బెడదను నివారించడానికి అదనపు సిబ్బందిని నియమించాలని, భక్తులు కోరుతున్నారు. నిత్యం శ్రీ ఆదిశంకరాచార్యులకు, శ్రీ శారదా దేవి , శ్రీ పార్వతి అమ్మవారి కి నిత్యం పూజాది కార్యక్రమాల తో పాటు నూతన వస్త్ర అలంకరణ, పత్రీ దళాలు, పుష్పాలంకరణ. ఆలయంలో అర్చకులు భక్తజనంకు అందుబాటులో ఉండేలా సమయపాలన చర్యలు చేపట్టడంతో పాటు. అర్చకులకు షిఫ్ట్ పద్ధతిలో విధులు కేటాయించాలని, శివాలయం ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులకు దోష నివారణ, శని దోష నివారణ తదితర పూజలను శివాలయములో నిర్వహించకుండా, చర్యలు చేపట్టి భక్తజనం మనోభావాలను గౌరవించాలని భక్తజనం ప్రధానంగా అభివృద్ధి కమిటీ సభ్యులను ముక్తకంఠంతో కోరుతున్నారు.

గత దశాబ్దాలుగా ఆలయ పాలకవర్గ ,ఉత్సవ కమిటీ చరిత్రలోనూ అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ (శివాలయం) అభివృద్ధి పట్ల భక్తజనం ఆశించిన మేరకు చర్యలు చేపట్టలేదు అనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ నుంచి ఎలాంటి నిధులు శివాలయ అభివృద్ధి పనులకు తీసుకోకుండా కొన్ని నెలల వ్యవధిలోనే భక్తుల ద్వారా సేకరించిన విరాళాలతో అభివృద్ధి పరచిన ఆలయ కమిటీ సభ్యులను, ఆలయ అధికారులను, దాతలను అభివృద్ధి పనులను రాత్రి పగలు పర్యవేక్షించిన భక్తజనులను ధర్మపురి క్షేత్ర వాసులు వేనోళ్లు అభినందిస్తున్నారు.