ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
(J.Surender Kumar)
తెలంగాణ సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బీర్ పూర్ మండల కేంద్రంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం గ్రామ పంచాయతీ వద్ద 1549 బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
అనంతరం పలు గ్రామాలకు చెందిన 13 మంది లబ్ది దారులకు, సీఎం సహాయనిది ద్వారా మంజూరైన ₹3లక్షల 64వేల రూపాయల విలువగల చెక్కులను, కల్యాణ లక్ష్మీ చెక్కులను ఇచ్చారు.
అనంతరం మాట్లాడుతూ దేశంలో 750 జిల్లాలు ఉంటే జగిత్యాల జిల్లా కు రెండవ ర్యాంక్ రావడం చాలా ఆనందదాయకం…
గ్రామాలు పరిశుభ్రం గా ఉంచడం ప్రతి ఒక్కరి భాధ్యత
ఆడబిడ్డల భాగస్వామ్యం తో పట్టణం పచ్చదనం, పరిశుభ్రత సాధ్యం…
తడి,పొడి చెత్త వెరుచేయటం,ప్లాస్టిక్ నివారణ ద్వారా పరిశుభ్రత సాధ్యం.
రాష్ట్రంలో 12 వేల 600 గ్రామాలు ఉంటే ఆయా గ్రామాల్లో పల్లే ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది.
మహిళలు కోసం బీడీ, ఒంటరి మహిళ పెన్షన్ లు ,షి టీమ్స్, కెసిఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, మహిళల పేరు న డబల్ బెడ్ రూం ఇండ్లు ఇలా అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి కోసం చేపట్టడం జరిగింది అన్నారు.
ఆశా, అంగన్ వాడి టీచరు, ఆయా లకు జీతాలు పెంచిన ఘనత కెసిఆర్ ది.
ఇల్లు గుట్టు ఇల్లు వాకిలి తెలిపినట్టు,తెలంగాణ ప్రగతి రాష్ట్రానికి వచ్చిన అవార్డులు తెలుపుతాయి అని అన్నారు..
కేంద్రం తెలంగాణకు అవార్డులకు మాత్రమే పరిమితం అయిందని, నిధుల విషయంలో మొండి చేయి చూపిస్తుందని అన్నారు.
కొందరు కుల మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అన్నారు…..
అన్ని మతాలను,కులాలను టీఆరెఎస్ ప్రభుత్వం సమానం గా చూస్తోంది ….

బీర్ పూర్ మండలం సస్యశ్యామలం గా ఉండడానికి రోళ్ల వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి ₹136 కోట్ల తో జీఓ కూడా తీసుకు వచ్చామని, గతంలో 13 లక్షలు నిదులు కేటాయించిన దాఖలాలు లేవని అన్నారు…
సీఎం సహాయ నిది నిరుపేదలకు వరం అని, ఆరోగ్య శ్రీ సేవలు పెంచి నాణ్యమైన వైద్యం అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు ….
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిల్ప రమేష్,ఎంపీపీ రమేష్, KDCC జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు,జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కోలుముల రమణ,మాజీ జెడ్పీటీసీ శంకర్,మండల పార్టీ అధ్యక్షులు నారపాక రమేష్,మండల రైతు బందు సమితి కన్వీనర్ లు రాజేశం,కొల శ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్,ఉప అధ్యక్షులు శ్రీనివాస్ రావు,గంగాధర్,ఉప సర్పంచ్ హరీష్,గ్రామ శాక అధ్యక్షులు సుధాకర్,ఎంపిడిఓ మల్లా రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్లు,ప్రజాప్రతినిదులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ

బీర్ పూర్ మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు గుండా రాజన్న గౌడ్ ఇటీవల ప్రమాద వశాత్తూ ఇంటి పై కప్పు మీద పడి గాయపడగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగారు.
చొప్పదండి నియోజకవర్గం:
బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే రవిశంకర్ !

కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ఐమాస్ లైట్స్, మహిళ సంఘం భవనాన్ని ప్రారంభించి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ .

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, ఎంపీపీ మేనేన్ని స్వర్ణలత, సర్పంచ్ అంబటి లత, పాక్స్ చైర్మన్ మెన్నెని రాజనర్సింగారావు, మండల సర్పంచ్లు పోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణరావు, వైస్ ఎంపీపీ ప్రసాద్, ఉప సర్పంచ్ నర్సయ్య, కొండగట్టు ఆలయ డైరెక్టర్లు, మహిళ సంఘం సభ్యులు, మరియు ప్రజా ప్రతినిధులు, ,ఆధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు…
ధర్మపురి మున్సిపల్ సమావేశం !.

పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం శ్రీమతి సంగి సత్తమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సద్దుల బతుకమ్మ సంబరాలు,.బతుకమ్మ నిమజ్జనం .మరియు దసరా పండుగలకు లైటింగ్ ఏర్పాటు, 75వ తెలంగాణ జాతీయ సమాఖ్యతా దినోత్సవం సందర్భంగా ర్యాలిలో జెండాలకు పైపులు , కంక బొంగులు, ఫ్లెక్సిలు ఏర్పాటు బోర్ వెల్ సామగ్రీ, మంచి నీటి పైపు లైన్ లికేజ్ సామగ్రీ, మాస్టర్ ప్లన్, బస్తి దవాఖానాలు. మరియు ఇతర బిల్లులు చెల్లింపు చేయుటకు మొత్తం 16 అంశాల గాను 16 అంశాలను ఆమోదించడం జరిగింది.
సమావేశంలో ఛైర్మన్ , వైస్ ఛైర్మన్ కౌన్సిల్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ మేనేజర్, సానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణాలకు ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డులు.

తెలంగాణ పట్టణాలకు మరో మూడు అవార్డులు వచ్చాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్,. కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్ స్వచ్ఛత లీగ్ ( Indian Swachhata League ) అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శుక్రవారం నాడు ఢిల్లీలోని తల‌్కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ,.పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి, కౌశల్ కిశోర్ సంబంధిత పట్టణాల మున్సిపల్ కమీషనర్లు , చైర్మన్ లు అవార్డులను అందుకున్నారు.
గార్బెజ్ ఫ్రీ సిటీస్‌లో భాగంగా ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డులను అందించారు. .ఇందులో 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో అలంపూర్ పట్టణం, ఎంపికైంది.. 25 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల పట్టణాలు ఎంపికయ్యాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ,.వరంగల్, హైదరాబాదు పట్టణ పరిపాలన శాఖ ప్రాంతీయ డైరెక్టర్లు , పీర్జాదీ గూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కమీషనర్ రామకృష్ణ, కోరుట్ల మునిసిపల్ కమీషనర్ అయాజ్,.అలంపూర్ మునిసిపల్ కమీషనర్ నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు.