ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల,: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) కి ఏజెంట్లే మూల స్తంబాలని వారిని గౌరవిస్తేనే సంస్థ మనుగడ కొనసాగించగలదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవిత బీమా శాఖ కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఏజెంట్లు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి సంస్థ లో పేదలు దాచుకున్న సొమ్మును కార్పొరేట్ శక్తుల పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కుట్రపూరితమైన చర్యని మండిపడ్డారు.

ఎనిమిదేళ్ల బిజెపి ప్రభుత్వంలో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం మోపి ఆదాని, అంబానీలు ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక పరిపుష్టి గల ఎల్ఐసి సంస్థ నిధులను దేశ ప్రయోజనాలకు వాడుకోవాల్సిందే పోయి, ప్రైవేట్ పరం చేసే దిశగా కేంద్రం కుట్రలు చేస్తుందని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకుందని ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఉచితాలు అనే నెపంవేసి వాటిని రద్దు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తుందని, కానీ గత ఎనిమిదేళ్ల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా ప్రజా సొమ్మును కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం దోచిపెట్టి మాఫీ చేసిందని ఆరోపించారు. ఎల్‌ఐసిని నేడు ఐపిఒ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి మోడీ ప్రభుత్వం పూనుకోవడం దారుణమన్నారు. ఈ చర్యను పాలసీదారులు, ప్రజలు, ఉద్యోగులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ వల్ల రాబోయే కాలంలో దేశ మౌలిక రంగంలో ఎల్‌ఐసి పెట్టుబడులు దారుణంగా క్షీణిస్తాయని, అభివృద్ధి కుంటుపడుతుందని, డిపాజిట్లకు భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థను కాపాడుకోవడానికి ఏజెంట్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఏజెంట్ల సమంజసమైన అన్ని డిమాండ్ ను సంస్థ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఏజెంట్ల సంఘం సంఘం అధ్యక్షులు ఏ. వెంకటస్వామి, కార్యదర్శి పి. ఐలయ్య, కోశాధికారి జే మల్లయ్య మాజీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఏలూరి సత్యం 200 మందికి పైగా ఏజెంట్లు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఆహ్వానం !
జర్నలిస్ట్ డే సందర్భంగా సన్మాన మహోత్సవము
జగిత్యాల పట్టణంలోని గౌరవ పాత్రికేయ (ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా) మిత్రులందరికీ పట్టణ ఆర్యవైశ్య సంఘము పక్షాన పాత్రికేయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటనలో పేర్కొన్నారు. మిమ్మల్ని అందరిని వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వైశ్య భవన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవములకు ఆహ్వానిస్తూ. ముఖ్యమైన (జర్నలిస్ట్ డే ) పురస్కరించుకొని . మంగళవారం (6/09/2022) ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న. గౌరవ సన్మాన సమ్మేళనం, సందర్బంగా జరుగు పూజా కార్యక్రమంలో పాల్గొని మాచే స్వామి వారి ప్రసాదంగా ఏర్పాటుచేసిన అల్పాహారం స్వీకరించి స్వామి వారి ఆశీస్సులు, జగజ్జనని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులు పొందగలరని ఆహ్వానిస్తూ ప్రకటనలో పేర్కొన్నారు.

కొడిమ్యాల హరికృష్ణ పై పీడి యాక్ట్ నమోదు!
నిందితునికి కరీంనగర్ జైల్లో పిడి యాక్ట్ ఉత్తర్వులు !
నిందితుడు కొడిమ్యల హరికృష్ణ, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హేయమైన నేరము మైనర్ అమ్మాయిల పై లైంగిక దాడులకు పాల్పడుతూ, మహిళలు మరియు సాధారణ ప్రజల్లో భయాందోళనను సృష్టిస్తూ శాంతిభద్రతలకు విగాధం కలిగిస్తూ, ప్రజా జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తూ, మరియు సామాజిక శాంతికి భంగం కలిగిస్తున్నాడు..2022 సంవత్సరంలో జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు లైంగిక నేరాలకు పాల్పడడం జరిగింది. అనే పోలీసు వర్గాల కథనం
నియంత్రణ చట్టం 1986 (చట్టం సంఖ్య 1/1986), తెలంగాణా నియంత్రణ చట్టం ( సవరణ చట్టం సంఖ్య 13/2018) ప్రకారం ఇతడిని లైంగిక నేరాలకు పాల్పడే నేరస్తుని గా నిర్ధారించి, ఇతని బారి నుండి ప్రజలను రక్షించాలన్న ఉద్దేశ్యంతో తేది 05-09-2022 న నిందితుడి పై జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ఉత్తర్వుల ప్రకారం పి.డి. యాక్ట్ పెట్టడం జరిగింది. . అని పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జైలు అధికారి సమక్షంలో ధర్మపురి సి.ఐ కోటేశ్వర్ , గొల్లపల్లి ఎస్.ఐ దతాత్రి పిడి యాక్టు ఉత్తర్వులు నిందితుడికి అందించారు. పీడీ యాక్ట్ ను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ధర్మపురి సి.ఐ కోటేశ్వర్ , గొల్లపల్లి ఎస్ .ఐ దతాత్రి జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ అభినందించారు. సోమవారం నిందితుడిని కరీంనగర్ జిల్లా జైలు నుండి చర్లపల్లి జైలు కు తరలించినట్టు పోలీస్ వర్గాలు ప్రకటనలో పేర్కొన్నారు.
బుగ్గారం పంచాయితీ లో నిధుల దుర్వినియోగం పై పిర్యాదు

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామపంచాయతీలో లక్షలాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలినా అధికారులు చేపట్టాల్సిన చర్యలు శూన్యం అయ్యాయని, ఫిర్యాదులపై విచారణతో జారీ చేసిన షోకాజ్ నోటీసులకు రెండేండ్లు పూర్తి’ కాబోతోందని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో ఆయన సోమవారం మరోసారి పిర్యాదు చేశారు. ఈసందర్భంగా చుక్క గంగారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ బుగ్గారం జిపి లో నిధుల దుర్వినియోగం రోజు – రోజుకు ఇంకా పెరుగుతూనే ఉందన్నారు. ఇందుకు అధికారులు, ఉన్నతాధికారులు కూడా అండగా నిలిచి తప్పుడు రికార్డులు, తప్పుడు తీర్మాణాలు, దొంగ బిల్లులు సృష్టించి బ్యాంక్ నుండి లక్షల కొద్ది నిధులు డ్రా చేస్తున్నారని పేర్కొన్నారు. బుగ్గారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం మీద అప్పటి డిఎల్పీఓ ప్రభాకర్ 2020 సెప్టెంబర్ 17న విచారణ చేపట్టారు.
అట్టి నివేదిక ఆధారంగా బుగ్గారం సర్పంచ్ మూల సుమలత- శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల సొమ్ము రూ.16,14,585 – 00 లపై ఉన్నతాధికారులు నేటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
బుగ్గారం గ్రామస్తులు 09-05-2022న, రెండోదపా చేసిన 16 పిర్యాదులతో నేటి డిఎల్పీఓ గత జూన్ 28న
విచారణ చేపట్టారు. రెండోసారి ఫిర్యాదులపై విచారణ జరిగి కూడా రెండు నెల్లు పూర్తి అయిందన్నారు. ఇంకా కూడా ఉన్నతాధికారులకు విచారణ నివేదిక అందకపోవడం శోచనీయమన్నారు. సమాచార హక్కు చట్టాన్ని కూడా పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు ఉల్లంఘించి సమాచారం ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్ కు ఆయన పిర్యాదు చేసారు.
ఇప్పటికైనా స్పందించి బుగ్గారం జిపి లో జరిగిన నిధుల దుర్వినియోగం లో బాధ్యులైన ప్రతీ ఒక్కరిపై, దొంగ రికార్డులకు సహకరించిన అధికారులపై, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులపై, ఉన్నతాధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని గంగారెడ్డి ఫిర్యాదు లో పేర్కొన్నారు.కోరారు.