ఆలయ అభివృద్ధి పనులు అమోఘం, అద్భుతం!

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని అతి ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు అమోఘంగా అద్భుతంగా చేపట్టారని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. భక్తులు, దాతలు ఇచ్చిన దాదాపు ₹ 60 లక్షల రూపాయల తో చేపట్టిన అభివృద్ధి పనులను  మంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పి చైర్ పర్సన్  దావ వసంత లు. సాంప్రదాయబద్ధంగా పనులను ఆరంభించారు.


ముందుగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులతో గణపతి హోమం , పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. వెండి రుద్రాక్ష మండపం , వెండి అభిషేక పాత్ర, పానపట్టం, ఈశాన్య గణపతికి ఇత్తడి తొడుగు, శ్రీ శారదా మాత ఆలయం,శివాలయలో గ్రానైట్ కళ్యాణమండపం , 

భక్తుల సౌకర్యార్థం ప్యూరిఫై వాటర్, గార్డెనింగ్ , కోతుల బెడద నివారణ కు ఆలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్, తదితర అభివృద్ధి పనులు భక్తుల సహకారంతో చేపట్టడం అభినందనీయం అన్నారు.

దాతల  పేర్లు లిఖించిన  శిలాఫలకం ను మంత్రి ఆవిష్కరించారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ, మండల పరిషత్ అధ్యక్షుడు ఎడ్ల చిట్టిబాబు, బుగ్గారం మండల జిల్లా పరిషత్ సభ్యుడు బాదినేని రాజేందర్,  మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యో రాజేష్. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్,

ఇందారపు రామయ్య,. కమిటీ సభ్యులు, ప్రముఖ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, అర్చకులు ,వేద పండితులు, ఆలయ

కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సిబ్బంది. దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చిన దాతలు మంత్రి స్వామివారి శేష వస్త్రం ప్రసాదాన్ని బహుకరించి వారిని అభినందించారు. 

మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, వేద పండితులు అర్చకులు, పూర్ణకుంభం, వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో  స్వాగతంతో పలికారు. 

ఉచిత షుగర్ టెస్ట్ లు!


ధర్మపురి మున్సిపల్ పరిధిలోని 11 వ వార్డ్ లో లయన్స్ క్లబ్ సహకారంతో  లైన్స్ క్లబ్ అధ్యక్షుడు. Dr. ఐ. రామకృష్ణ,  Dr. సర్జారావు నేతృత్వం లో. వార్డు కౌన్సిలర్  జక్కు.పద్మ విజ్ఞప్తి మేరకు  100 మందికి  బుధవారం  వార్డ్ లోని అపార్ట్ మెంట్ లో, మరియు మూల బండ వద్ద ,ఉచితంగా  బ్లేడ్, షుగర్,  పరీక్షలు. నిర్వహించారు. వార్డ్ లో ఇది రెండవసారి  పరీక్షలు నిర్వహించారు. .స్థంబంకాడి.కిషన్  అనారోగ్య రీత్య నడువలేని స్థితిలో ఉంటే ఇంటికి వెళ్లి  పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, జక్కు.పద్మ మాట్లాడుతూ . త్వరలో మెడికల్ క్యాంప్ లు నిర్వహించడం కై  కృష్షి  చేస్తా అని అన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు.శ్రీ రామకృష్ణ మరియు సభ్యులకు, డాక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
మోహన్ సార్ ,పప్పుల.శ్రీనివాస్ ,రంగ.హరనాథ్ , సాయిని సతన్న,గందే.శ్రీనివాస్ ,లాబ్ టెక్నీషియన్ లు,.వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.


సన్మానం !


కాళోజి జయంతి సందర్భం  బాలికల ఉన్నత పాఠశాల భాషా పండితులు సన్మాన గ్రహీతలైన భాషా పండితులు  బక్కశెట్టి మల్లేశం,  గొల్లపెల్లి గణేష్ ఘనంగా సన్మానించారు.


బాచంపల్లికి ఘన సన్మానం ,!


ప్రముఖ పురాణ ప్రవచకులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ని ధర్మపురి క్షేత్రంలో ఘనంగా సన్మానించారు. స్థానిక బ్రాహ్మణ సంఘ భవనంలో భాగవత సప్తహాన్ని ప్రవచనం చేస్తున్న  సంతోష్ కుమార్ శాస్త్రి నీ ధర్మపురి లైన్స్ క్లబ్ అధ్యక్షులు Dr. రామకృష్ణ, సభ్యులు ఆయన వద్దకు వెళ్లి సార్ వాళ్ళతో పూలమాలతో  సన్మానించారు.