అల్లిపూర్ మండలం ఏర్పాటుకు కృషి చేస్తా !

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!


(J. Surender Kumar )
రాయికల్ మండల కేంద్రంలో గల అల్లిపూర్ గ్రామాన్ని మండలం ఏర్పాటుకు తన శాశక్తులకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం
అల్లిపూర్ గ్రామ ప్రజలు   అల్లిపూర్ మండల ఏర్పాటుకు సహకరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నీ వినతిపత్రం ఇచ్చారు స్పందించిన జీవన్ రెడ్డి,  అల్లిపూర్  మండల ఏర్పాటుకు వసతి, సదుపాయాలు ఉన్నాయనీ అన్నారు.. మండల ఏర్పాటుతో అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి, గ్రామ ప్రజలు సమిష్టిగా ఉద్యమించి  పార్టీల కతీతంగా మండల ఏర్పాటుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని  జీవన్ రెడ్డి, అన్నారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, పాలన సౌలభ్యం కోసం, అల్లిపూర్ ను మండలంగా ప్రకటించాలి. మండల ఏర్పాటుతో ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు మరింత చేరువవుతాయని జీవన్ రెడ్డి అన్నారు.
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందించారు. వారి సమక్షంలో జీవన్ రెడ్డి,  రెవెన్యూ అధికారితో ఫోన్లో మాట్లాడారు. కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్ కు సైతం లేఖ రాస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. పాలన సౌలభ్యం కోసం నూతన మండలాలు ఏర్పాటు హర్షించదగినదని అన్నారు.
ఆల్లిపూర్ గ్రామానికి మంజూరు చేసిన ప్రభుత్వ కళాశాల కరీంనగర్ లో నిర్వహించడం తో స్థానికులు ఎటువంటి ప్రయోజనం పొందడం లేదని అన్నారు. .వెంటనే అల్లిపూర్ కున్ కళాశాలను బదిలీ చేసి, ఇక్కడే నిర్వహించాలని అన్నారు. శాసనమండలిలో మండల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తానని, అవసరమైతే సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవిస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. అల్లిపూర్ గ్రామ ప్రజలు మండల ఆవశ్యకతను పార్టీలకతీతంగా సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్తే మండల ఏర్పాటు సాధ్యమేనని ఆయన అన్నారు.

ధర్మపురి కాళికామాత ఆలయంలో  ఉత్సవాలు!


జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ లో గల కాళీమాత ఆలయంలో దుర్గా నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  ధూప ,దీప ,నైవేద్యాలతో అర్చకులు సంజీవ స్వామి, ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు.  నవరాత్రుల ఉత్సవాలు జరిగే వరకు నిలిచే హోమ గుండాన్ని ఏర్పాటు చేశారు  .

గురువారం జరిగిన హోమంలో కూష్మాండ దేవి రూపంలో ఉన్న అమ్మవారి ఆశీస్సుల కొరకై సుదీర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి తమ కోరికలు నెరవేరాలని కోరుకున్నారు.. అమ్మవారికి ఓడి బియ్యం పోస్తూ తమ భక్తిని చాటుకున్నారు.


ధర్మపురి టీటీడీ కళ్యాణమండపంలో..


ధర్మపురి పట్టణంలో నూతన తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గత తొమ్మిది సంవత్సరాలుగా నవదుర్గ సేవా సమితి ధర్మపురి ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థమై నిర్వహించే శ్రీ దుర్గా శరన్నవరాత్రోత్సవలలో భాగంగా నేడు (నాలుగో వ రోజు) అమ్మవారిని *శ్రీ కూష్మాండా దుర్గా అలంకరణ* రూపంలో పూజలు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా చతుష్షష్టి పూజ,మంత్రపుష్పం, మంగళ నీరాజనం విశేష పూజలను వేద పండితులు  కాసర్ల వంశీకృష్ణ శర్మ,  అర్చకత్వంలో జన్మంచి వంశీకృష్ణ , నారంభట్ల ప్రశాంత్ శర్మ , కసోజ్జుల బాలకృష్ణ శర్మ లు నిర్వహించారు. అమ్మ వారిని కూరగాయలు తో శాకాంబరీ అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవదుర్గ సేవా సమితి సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు