అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు !

ధర్మపురి క్షేత్రంలో..


( J. Surender Kumar  )
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో మంగళవారం అంగరంగ వైభవంగా  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు,  జరిగాయి. వేద పండితులతో ప్రత్యేక పూజలు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు.

అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలంకరణలో అందంగా అలంకరించారు. అమ్మవారు ధర్మచారిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలో మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటం, తదితర సేవ ఊరేగింపులు భక్తజనంకు కనువిందు చేశాయి,

గజవాహన సేవ ఊరేగింపు నిర్వహించారు.
కవితమ్మ చక్కెర ఫ్యాక్టరీ ముందు బతుకమ్మ ఆడాలి!
జువ్వాడి కృష్ణారావు


ఎమ్మెల్సీ కవిత మెట్పల్లి లో, కాకుండా తాము మూసివేయించిన  ముత్యంపేట లోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ముందు బతుకమ్మ ఆడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకుడు జువ్వాడి కృష్ణా రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్రం వస్తే ముత్యంపేట లో ఉన్న నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వంద రోజుల్లో ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రంగంలోనే నడిపిస్తామని హామీ ఇచ్చారని కానీ తీరా చూస్తే అప్పటివరకు ప్రభుత్వ ప్రైవేటు రంగ భాగస్వామ్యం లో నడుస్తుంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మూసిగా  వేయించారని  ఆరోపించారు.  షుగర్ ఫ్యాక్టరీ ముందు బతుకమ్మ ఆడి ,తాము ఫ్యాక్టరీ ఎందుకు ముయించాము అనేది  ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.  మెట్పల్లిలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడటం కోసం రాకుంటే  మహిళా సంఘాల సభ్యులను బెదిరించి లోన్లు రాకుండా చూస్తామని చెప్పి మీటింగ్ కు వచ్చేలా ఒత్తిడి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.  అలాగే బాండ్ పేపర్ అరవింద్, నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపి స్తే వారంరోజుల్లో ప్రత్యేక పసుపు బోర్డు తీసుకొచ్చి  పసుపుకు మద్దతు ధర ఇస్తామని అలాగే నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ రంగంలో నడిపిస్తామని ఒకవేళ అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే తానే తన సొంత నిధులతో ఈ ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికైన బాండ్ పేపర్ అరవింద్. ఈ రోజు రైతులను ప్రజలను మోసం చేశారని ఆరోపించారు చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు  ప్రారంభిస్తారని ఇంకెప్పుడు రైతులు  మద్దతు ఇస్తారని జువ్వాడి కృష్ణారావు  ప్రకటనలో ఆరోపించారు.