ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం…
ఆత్మీయ బంధువు కెసీఆర్!

మంత్రి కొప్పుల ఈశ్వర్


జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో 779 కొత్త ఆసరా పిన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ .. బుగ్గారం మండల ఎంపీపీ జడ్పిటిసి బాదినేని రాజమణి రాజేందర్
ఈ సందర్భంగా మంత్రి జడ్పిటిసి గారుమాట్లాడుతూ..


దేశంలోని 29 రాష్ట్రాలలో 130 కోట్ల జనాభా లో.₹ 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్  మాత్రమేన్నారు..        కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుచందర్ రైతుబంధు సమితి తాండ్ర సత్యనారాయణ

మరియు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉప సర్పంచులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు అనాధికారులు తదితరులు భారీ సంఖ్యలో హాజరయ్యారు

ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు – మంత్రి కొప్పుల


100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీలు ముఖ్యమంత్రి గొప్ప ఆలోచనా విధానంతో తెలంగాణ ఫిష్ హబ్ గా మారుతోంది – మంత్రి  అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తో కలిసి 6 లక్షల చేప పిల్లలను పిల్లలను వదిలారు.
ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ.. 
రాష్ట్రంలో కుల వృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ సబ్సిడీ పై అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుంది.
తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుంది, ఇతర రాష్ట్రాల కు ఎగుమతి తో ముదిరాజ్, గంగ పుత్రులకు ఉపాధి పెరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రాష్ట్రాన్ని ఫిష్ హబ్  గా తీర్చిదిద్దింది ‌ముఖ్యమంత్రి‌ మన కెసిఆర్ , ఈ అద్భుతమైన మార్పును ఏడు సంవత్సరాలలోనే జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్  మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపలు ఎక్కడ దొరికేది అంటే రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం చేపల ఎగుమతులకు ప్రసిద్దిగా ఉండేది, కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రం ఫిష్ హబ్ మారి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లలు పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగింది, కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలను కులవృత్తులను ఆధారపడి బ్రతికేవాళ్లను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందని మంత్రి అన్నారు.


పరామర్శ !
బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన బతుకు తెరువు కోసం పాదం శేఖర్  ఉపాధి కోసం 4 నెలల క్రితం కత్తర్ లో వెల్లడం జరిగింది, అక్కడ రోడ్ఢు ప్రమాదం లో బ్రెన్ డెడ్ కావడంతో అతని డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్న సంగతి తెలిసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి, డెడ్ బాడీ స్వగ్రామం తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తానని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , శేకర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.


ప్రజావాణిలో 24 దరఖాస్తు లు!
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఐ ఎం ఏ హాల్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా24దరఖాస్తులను జిల్లా కలెక్టర్ జి.రవి స్వీకరించారు


బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగిన ఖాతాదారులు.
గొల్లపల్లి మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంకులో జరిగిన మోసం గురించి విషయం  తెలిసిందె, అయితే ఈ రోజున పెద్ద ఎత్తున ఖాతాదారులు బ్యాంకుకు తరలివచ్చి వారి వారి ఖాతాలను చెక్ చేసుకుంటున్నారు. ఖాతాల నుండి గల్లంతయిన డబ్బును తిరిగి చెల్లించాలని ఖాతాదారులు దాదాపు 3 గంటలపాటు జగిత్యాల – ధర్మారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగారు., బ్యాంకు సిబ్బంది వైఖరి నశించాలని ఖాతాదారులకు వెంటనే న్యాయం చేయాలని నినాదాలతో డిమాండ్ చేశారు.  ఖాతాదారులకు మద్దతుగా గొల్లపల్లి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీరాములపల్లి గ్రామ సర్పంచ్ నేరెళ్ల గంగారెడ్డి, ధర్నాలో పాల్గొని ఖాతాదారులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఖాతాదారులకు సత్వర న్యాయం చేసి యధావిధిగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు., చాలామంది ఖాతాదారులు ఆసుపత్రి ఖర్చులకోసం పింఛన్ డబ్బుల కోసం బ్యాంకులో వేచి చూస్తున్నారని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండా డబ్బులను డ్రా చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా సంతకం లేకుండా మా ఖాతాల నుండి డబ్బు ఏ విధంగా డ్రా చేశారని ఖాతాదారులు బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ నేను ఈ మధ్యనే ఈ బ్యాంకుకు బదిలీపై వచ్చానని ఖాతాలన్నీ చెక్ చేసి, ఉన్నతాధికారులతో మాట్లాడి ఖాతాదారులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వగా ఖాతాదారులు  రాస్తారోకో విరమించారు.